Fire Breaks Out At Ahmedabad Hospital And Patients Evacuated - Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. భయంతో పేషంట్స్‌ పరుగులు!

Published Sun, Jul 30 2023 12:09 PM | Last Updated on Sun, Jul 30 2023 12:25 PM

Fire At Ahmedabad Hospital And Patients Evacuated - Sakshi

అహ్మాదాబాద్‌: గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఆసుపత్రిలో మంటలు చెలరేగడంతో హాస్పిటల్‌లో ఉన్న వంద మందికిపైగా పేషంట్లను అక్కడి నుంచి తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని షాయిబాగ్‌ ప్రాంతంలో ఉన్న రాజస్థాన్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి బేస్‌మెంట్‌లో ఆదివారం ఉదయం మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పేషంట్స్‌ను కాపాడే ప్రయత్నం చేసింది ఆసుపత్రి యాజమాన్యం. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు వంద మందికిపైగా పేషంట్స్‌ను వేరు చోటకు షిఫ్ట్‌ చేసింది. ఆసుపత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొద్ది మంది పేషంట్స్‌ పరుగులు తీసినట్టు తెలుస్తోంది. 


ఇక, అగ్ని ప్రమాద ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. 25 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక, ప్రమాదం స్థానికంగా పేషంట్లను, ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అయితే, అగ్ని ‍ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మరోవైపు.. ఈ ఆసుపత్రిని ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నడుపుతోంది. 

ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లలో వారి పాత్రపై ఆరా తీస్తున్న కేంద్రం.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement