సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్, అహ్మదాబాద్ ఆసుపత్రి విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. (ఘోరం : 8 మంది కరోనా రోగులు ఆహుతి)
ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, అహ్మదాబాద్ మేయర్ బిజాల్ పటేల్‌తో మాట్లాడినట్టు మోదీ తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. స్థానిక యంత్రాంగం బాధితులకు అన్నివిధాలా సహాయం అందిస్తోందని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి 50వేల రూపాయలు సాయాన్ని అందిస్తున్నట్టు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
Saddened by the tragic hospital fire in Ahmedabad. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to CM @vijayrupanibjp Ji and Mayor @ibijalpatel Ji regarding the situation. Administration is providing all possible assistance to the affected.
— Narendra Modi (@narendramodi) August 6, 2020
Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the hospital fire in Ahmedabad. Rs. 50,000 each would be given to those injured due to the hospital fire.
— PMO India (@PMOIndia) August 6, 2020
Comments
Please login to add a commentAdd a comment