Gujarat Confirms 2 More Omicron Cases, India Tally Reaches 25 - Sakshi
Sakshi News home page

Omricon variant: భారత్‌లో మరో 3 ఒమిక్రాన్‌ కేసులు..

Published Fri, Dec 10 2021 4:33 PM | Last Updated on Fri, Dec 10 2021 8:01 PM

Gujarat Confirms 2 More Omicron Cases, India Tally Reaches 25 - Sakshi

గాంధీనగర్‌: కరోనా వైరస్‌ కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో అలజడి సృష్టిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు విదేశాలకే పరిమితమైన ఈ మహమ్మారి, ఇప్పుడు చాపకింద నీరులా దేశం మొత్తం విస్తరిస్తోంది. తావేరియంట్‌ కరోనా వైరస్‌ జాగా శుక్రవారం మూడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇద్దరికి, ముంబైలోని ధారవిలో 49 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 26కు చేరింది. డిసెంబర్‌ 4న జింబాబ్వే నుంచి భారత్‌ తిరిగొచ్చిన ఎన్నారై వ్యక్తికి కోవిడ్‌ కొత్త వేరియంట్‌ సోకగా.. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన జింబాబ్వే వ్యక్తిని కలిసిన పది మందిని క్వారంటైన్ లో పెట్టారు. అతడితో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు.
చదవండి: దేశంలో పవర్‌ఫుల్‌ కపుల్‌ ఎవరో తెలుసా?

సంక్షిప్తంగా రిధమ్ గంభీర్ / 10 డిసెంబర్ 2021, శుక్రవారం సాయంత్రం 05:50
ముంబైలోని ధారవిలో ఓమిక్రాన్ కోవిడ్-19 వేరియంట్‌కు 49 ఏళ్ల వ్యక్తి పాజిటివ్ పరీక్షించాడు, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 26కి చేరుకుంది. రోగి డిసెంబర్ 4న టాంజానియా నుండి తిరిగి వచ్చాడు మరియు యాదృచ్ఛిక RT-PCR సమయంలో COVID-19కి పాజిటివ్ పరీక్షించారు. విమానాశ్రయంలో పరీక్ష జరిగింది. BMC ప్రకారం, రోగి లక్షణం లేనివాడు, టీకాలు వేయబడలేదు మరియు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన భార్య, బావమరిదికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం గుజరాత్‌లో మూడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే ముంబైలోని బాధితుడు ఇటీవల టాంజానియా నుంచి భారత్‌ తిరిగి వచ్చాడు. కాగా, ఈ ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవని, ఆసుపత్రిలో అడ్మిట్‌ అయి చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. భారత్‌ వ్యాప్తంగా మహారాష్ట్రలో 10, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో ౩, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తో సహా 57 దేశాలు ఈ కొత్త కరోనా వేరియంట్‌ బారినపడ్డాయి.
చదవండి: సొంత పార్టీ ఎంపీకి పబ్లిక్‌గా వార్నింగ్‌ ఇచ్చిన మమత

మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసుపైనా చర్చ జరుగుతోంది. అవసరముంటే బూస్టర్ డోస్ కూడా తీసుకోవచ్చని, అయితే, సెకండ్ డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే తీసుకోవాలని ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇక గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,503 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలగా.. మొత్తం కేసుల సంఖ్య  3,46,74,744 కు పెరిగింది. కొత్తగా 624 మంది మరణించగా మరణాల సంఖ్య 4,74,735కు చేరింది. ప్రస్తుతం దేశంలో 94,943 యాక్టివ్‌ కేసులున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement