రాజస్థాన్‌లో పట్టుబడ్డ సూరత్ హత్యాచార కేసు నిందితుడు
సాక్షి, జైపూర్ : సూరత్‌లో మైనర్ బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్ సంకేతాల ఆధారంగా రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. సవాయ్ మధోపూర్ నివాసి అయిన రామ్ సహాయ్ గుజ్జార్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సూరత్ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. 9 నుంచి 11 సంవత్సరాల వయసుగల బాధిత బాలికను ఇంకా సూరత్ పోలీసులు గుర్తించలేదు.
బాధిత బాలికను గుర్తించేందుకు చివరి ప్రయత్నంగా ఆమె ఫోటోను పోలీసులు ట్వీట్ చేశారు. కాగా ఆమె తమ కుమార్తె అంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ జంట ముందుకు రాగా వారు అందించిన వివరాలు, వేలిముద్రలు, పుట్టుమచ్చ, ఎత్తు వంటి ఆధారాలు సరిపోలలేదు. దీంతో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. బాధిత బాలిక శరీరంపై 80 గాయాలున్నాయని, మృతదేహాన్నిసూరత్ నగరంలోని స్టేడియం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఈనెల 6న కనుగొన్నామని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment