బార్ డ్యాన్సర్‌ను హత్య చేసిన ప్రియుడు | Mumbai bar dancer beheaded by lover in Surath | Sakshi
Sakshi News home page

బార్ డ్యాన్సర్‌ను అతికిరాతకంగా హత్య చేసిన ప్రియుడు

Published Wed, Jan 3 2018 9:28 AM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

Mumbai bar dancer beheaded by lover in Surath - Sakshi

సూరత్ : మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఓ బార్ డ్యాన్సర్ను ప్రియుడే అతికిరాతకంగా తల నరికి చంపాడు. ఈ సంఘటన ముంబై శివారులోని కమ్రేజ్ సమీపంలోని టింబా గ్రామంలోని ఓ ఫామ్ హౌస్లో చోటుచేసుకుంది. పంజాబ్కి చెందిన మోడల్ జ్యోతి సూర్జిత్ సింగ్ అలియాస్ నిషాజ్యోతి ముంబైలో బార్ డ్యాన్సర్‌గా పనిచేసేది. సూరత్ సమీపంలోని టింబా గ్రామానికి చెందిన ప్రీతేష్ పటేల్(30) తరచూ ముంబైలోని బార్లకు వెళుతుండటంతో నిషాజ్యోతితో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో నిషాజ్యోతి, ప్రీతేష్ తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలోనే డిసెంబరు 27న ప్రీతేష్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫామ్‌హౌస్లో ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్కు నిషాజ్యోతి హాజరైంది. అనంతరం కొత్త సంవత్సర వేడుకల కోసం డిసెంబర్ 28న ముంబై బయలుదేరి తిరిగి సోమవారం టింబాకు చేరుకున్నారు.

అయితే నిషాజ్యోతికి మరో యువకుడితో సంబంధం ఉందనే అనుమానంతో ప్రీతేష్ మంగళవారం ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడై కొడవలితో నిషాజ్యోతి తల నరికి చంపాడు. ఈ హత్య జరిగిన సమయంలో నిషాజ్యోతి డ్రైవర్ సందీప్ సింగ్తో పాటూ అతడి భార్య కూడా అక్కడే ఉన్నారు. సందీప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. తమను కూడా అతడుచంపుతాడేమోనని భయంతో అక్కడి నుంచి పారిపోయామని వారు పోలీసులకు చెప్పారు. పరారీలో ఉన్న ప్రీతేష్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా తాను నిషాజ్యోతి కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టానని, ఆమె మరో యువకుడితో చనువుగా ఉంటుందని పోలీసులకు చెప్పాడు. నిషాజ్యోతితో ప్రీతేష్ వివాహేతర సంబంధం కొనసాగించడంతో తన భార్యతో తరచూ గొడవలు కూడా అయ్యేవి. చివరికి జ్యోతి కోసం అతడు తన భార్యకు కూడా విడాకులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement