bar dancer
-
బార్ డ్యాన్సర్‌తో మందేసి చిందేసిన ఎమ్మెల్యే
సాక్షి, ముంబై: తాను ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధి అన్న విషయాన్ని మరిచిన ఓ ఎమ్మెల్యే పబ్లిక్‌గా చుక్కేసి బార్ డ్యాన్సర్‌తో చిందేశాడు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పురమ్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని బార్ డ్యాన్సర్‌తో రచ్చరచ్చ చేశాడు. మందేసి ఆమెపై డబ్బు నోట్లు విసురుతూ చిందేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ జల్లాలోని ఆమ్గోన్-డోరి అసెంబ్లీ స్థానం నుంచి సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. Wowwww wht a govT bjP vidhansabha ...aamdar devri-amgaon sanjay puram @Dev_Fadnavis @PMOIndia @nitin_gadkari @BJP4India pic.twitter.com/kwYgYCBr5j — Aniket (@jainaniket953) September 27, 2019 -
క్లబ్ డ్యాన్సర్ బట్టలు విప్పి అసభ్యకరంగా..
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని లెస్బెన్ పబ్‌లో శుక్రవారం రాత్రి ఓ డ్యాన్సర్‌పై దాడి జరిగింది. నడిరోడ్డుపై తనను వివస్త్రన చేసి, దాడికిపాల్పడ్డారని క్లబ్ డ్యాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. సినిమా చాన్స్‌ల కోసం హైదరాబాద్ వచ్చిన యువతి, ఆర్థిక సమస్యల కారణంగా లెస్బెన్ పబ్‌లో డాన్సర్‌గా పని చేస్తోంది. ఆ పబ్‌కొచ్చే కస్టమర్లు తాగిన మైకంలో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, కోరిక తీర్చాలంటూ వేధించేవారని తెలిపింది. అవన్నీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుని వెళ్లిపోయేదాన్నని చెప్పింది. ఓ రాత్రి కస్టమర్‌తో గడిపితే రూ.10వేలు ఇస్తారని పబ్ నిర్వాహకులు ఒత్తిడి చేసేవారని క్లబ్ డ్యాన్సర్ వాపోయింది. 'ఇటువంటి అసాంఘీక కార్యక్రమాలకు అంగీకరించలేదు. దీంతో వారంతా నాపై కక్ష్య కట్టారు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారు. పబ్‌లో బ్లేడ్లతో ఒళ్లంతా గాయాలు చేసే వారు. నిన్న క్లబ్ ముగిసిన తర్వాత ఒంటి గంటకు నలుగురు అమ్మాయిలు, మరోవ్యక్తితో కలిసి దాడి చేశారు. ఒంటిపై బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్లకు ప్రముఖ రాజకీయ నాయకులు తెలుసంటూ బెదిరించారు. సయ్యద్ అనే వ్యక్తి వీళ్లందరికి బాస్. పంజాగుట్ట పీఎస్‌లో వారిపై ఫిర్యాదు చేశాను. నాపై దాడి చేసిన వారు కూడా పంజాగుట్ట పీఎస్‌కు వచ్చి వెళ్ళిపోయారు. క్లబ్లో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. సాయంత్రానికల్లా దాడి చేసిన వాళ్లందరిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు' అని క్లబ్ డ్యాన్సర్ పేర్కొంది. -
కేసు విత్ డ్రా చేసుకోలేదని దారుణ హత్య
గుర్గావ్ : అత్యాచార కేసును ఉపసంహరించుకునేందుకు నిరాకరించిన మహిళను దారుణంగా కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. గుర్గావ్లో శుక్రవారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. కోర్టులో ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి కొన్ని గంటలముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి అందించిన సమాచారం ప్రకారం నిందితుడు సందీప్ కుమార్, శుక్రవారం తెల్లవారుఝామున ఆమె ఇంటికి వెళ్లాడు. మాట్లాడాలి రమ్మని బయటికి పిలిచి, కిడ్నాప్ చేసి కారులో తీసుకు పోయాడు. అనంతరం ఆమెను తుపాకీతో కాల్చి చంపి పారిపోయాడు. గుర్గావ్-ఫరిదాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే పై మృతదేహాన్ని గుర్తించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుభాష్ బోకన్ తెలిపారు. కాగా ఒక బార్లో డాన్సర్‌గా పనిచేస్తున్న బాధితురాలు అదే బార్లో బౌన్సర్‌గా పనిచేస్తున్న సందీప్ కుమార్‌పై మార్చి, 2017లో అత్యాచార కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టయిన సందీప్ అనంతరం బెయిల్‌పై బయటికొచ్చాడు. దీనిపై విచారణ శుక్రవారం (జనవరి18) జరగాల్సి వుంది. అయితే కేసును ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తానని చాలాసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి దారుణానికి ఒడిగట్టాడు. -
బార్ డ్యాన్సర్‌ను హత్య చేసిన ప్రియుడు
సూరత్ : మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఓ బార్ డ్యాన్సర్‌ను ప్రియుడే అతికిరాతకంగా తల నరికి చంపాడు. ఈ సంఘటన ముంబై శివారులోని కమ్రేజ్ సమీపంలోని టింబా గ్రామంలోని ఓ ఫామ్ హౌస్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌కి చెందిన మోడల్ జ్యోతి సూర్జిత్ సింగ్ అలియాస్ నిషాజ్యోతి ముంబైలో బార్ డ్యాన్సర్‌గా పనిచేసేది. సూరత్ సమీపంలోని టింబా గ్రామానికి చెందిన ప్రీతేష్ పటేల్(30) తరచూ ముంబైలోని బార్లకు వెళుతుండటంతో నిషాజ్యోతితో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో నిషాజ్యోతి, ప్రీతేష్ తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలోనే డిసెంబరు 27న ప్రీతేష్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్‌కు నిషాజ్యోతి హాజరైంది. అనంతరం కొత్త సంవత్సర వేడుకల కోసం డిసెంబర్ 28న ముంబై బయలుదేరి తిరిగి సోమవారం టింబాకు చేరుకున్నారు. అయితే నిషాజ్యోతికి మరో యువకుడితో సంబంధం ఉందనే అనుమానంతో ప్రీతేష్ మంగళవారం ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడై కొడవలితో నిషాజ్యోతి తల నరికి చంపాడు. ఈ హత్య జరిగిన సమయంలో నిషాజ్యోతి డ్రైవర్ సందీప్ సింగ్‌తో పాటూ అతడి భార్య కూడా అక్కడే ఉన్నారు. సందీప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. తమను కూడా అతడుచంపుతాడేమోనని భయంతో అక్కడి నుంచి పారిపోయామని వారు పోలీసులకు చెప్పారు. పరారీలో ఉన్న ప్రీతేష్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా తాను నిషాజ్యోతి కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టానని, ఆమె మరో యువకుడితో చనువుగా ఉంటుందని పోలీసులకు చెప్పాడు. నిషాజ్యోతితో ప్రీతేష్ వివాహేతర సంబంధం కొనసాగించడంతో తన భార్యతో తరచూ గొడవలు కూడా అయ్యేవి. చివరికి జ్యోతి కోసం అతడు తన భార్యకు కూడా విడాకులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
భార్యను చంపి.. సూట్‌కేస్‌లో పెట్టాడు!
ఉల్లాస్‌నగర్: బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు ఆమెను పొడిచిచంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. భార్య మృతదేహాన్ని ఎవరికీ కనపడకుండా తరలించడానికి తనకు సాయం చేయాలని కోరాడు. అయితే, స్నేహితుడు అందుకు అంగీకరించకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతని బండారం బట్టబయలైంది. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని ఉల్లాస్‌నగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉల్లాస్‌నగర్‌లోని విఠల్వాడికి చెందిన రాజేశ్ ఖాన్, జమీల భార్యాభర్తలు. అయితే, భార్య డ్యాన్సర్‌గా పనిచేస్తున్న జమీల పలువురి వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో పదునైన కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి స్నేహితుడు షఫీవుల్లా షేక్‌కు ఫోన్ చేశాడు. అయితే, షేక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజేశ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తానే జమీలను చంపినట్టు అతను ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.