
గుర్‌గావ్ : అత్యాచార కేసును ఉపసంహరించుకునేందుకు నిరాకరించిన మహిళను దారుణంగా కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. గుర్గావ్‌లో శుక్రవారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. కోర్టులో ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి కొన్ని గంటలముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
బాధితురాలి తల్లి అందించిన సమాచారం ప్రకారం నిందితుడు సందీప్ కుమార్, శుక్రవారం తెల్లవారుఝామున ఆమె ఇంటికి వెళ్లాడు. మాట్లాడాలి రమ్మని బయటికి పిలిచి, కిడ్నాప్ చేసి కారులో తీసుకు పోయాడు. అనంతరం ఆమెను తుపాకీతో కాల్చి చంపి పారిపోయాడు. గుర్‌గావ్-ఫరిదాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే పై మృతదేహాన్ని గుర్తించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుభాష్ బోకన్ తెలిపారు.
కాగా ఒక బార్‌లో డాన్సర్‌గా పనిచేస్తున్న బాధితురాలు అదే బార్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్న సందీప్ కుమార్‌పై మార్చి, 2017లో అత్యాచార కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టయిన సందీప్ అనంతరం బెయిల్‌పై బయటికొచ్చాడు. దీనిపై విచారణ శుక్రవారం (జనవరి18) జరగాల్సి వుంది. అయితే కేసును ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తానని చాలాసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి దారుణానికి ఒడిగట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment