భార్యను చంపి.. సూట్‌కేస్‌లో పెట్టాడు!
పోలీసుల కథనం ప్రకారం.. ఉల్లాస్‌నగర్‌లోని విఠల్‌వాడికి చెందిన రాజేశ్ ఖాన్, జమీల భార్యాభర్తలు. అయితే, భార్య డ్యాన్సర్‌గా పనిచేస్తున్న జమీల పలువురి వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో పదునైన కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి స్నేహితుడు షఫీవుల్లా షేక్‌కు ఫోన్ చేశాడు. అయితే, షేక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజేశ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తానే జమీలను చంపినట్టు అతను ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.