మేనకోడలితో సంబంధం.. ప్రైవేట్‌ వీడియో లీక్‌ | Man Films Private Moments During Affair With Niece With Niece In Gujarat | Sakshi
Sakshi News home page

ఏకాంతంగా ఉన్న వీడియో పంపి.. మేనమామ బ్లాక్‌ మెయిల్‌

Published Sun, Aug 2 2020 12:03 PM | Last Updated on Sun, Aug 2 2020 1:29 PM

Man Films Private Moments During Affair With Niece With Niece In Gujarat - Sakshi

సూరత్‌ : మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు ఓ కీచక మేనమామ. ఈ ఘటన గుజరాత్‌లోని సూరల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి  సూరత్‌లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవినం గడుపుతోంది. ఈ పనిని ఆమె మేనమామ(30) నేర్పించాడు. ప్రతి రోజు యువతి ఇంటికి ఆయన వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతని నమ్మి అతనితో రహస్యంగా గడిపింది. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపిన సందర్భాలను అతగాడు వీడియో తీశాడు. ( చదవండి : నగ్నచిత్రాలు పంపించాలని బ్లాక్‌మెయిల్)

నో చెప్పి,  దూరం పెట్టిందని..
ఇదిలా ఉంటే యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మేనమామ.. యువతి దగ్గరికి వచ్చి పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న అతడు.. వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, వారి బంధువులకు పంపాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి తండ్రి సూరత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : భార్యను హత్య చేసిన కొద్దిసేపటికే..) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement