
సాక్షి, గాంధీనగర్ : జాతిపిత మహాత్మా గాంధీ 1930లో నిర్వహించిన దండి సత్యాగ్రహం యాత్రకు ప్రత్యక్ష సాక్షి, 106 ఏళ్ల వద్ధురాలు మోత్లీ బా గుజరాత్ అసెంబ్లీకి శనివారం జరిగిన మొదటి విడత పోలింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. ఆ తర్వాత ఆమె గర్వంగా వేలిపై ఓటువేసినట్లు సిరా గుర్తును చూపిస్తూ మీడియాకు ఫోజిచ్చారు. ఆమె సూరత్‌లో ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసినట్లు తెలియజేస్తూ ఆకాశవాణి ట్వీట్ చేసింది. మొదటి విడతగా ఈ రోజు 89 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 977 మంది అభ్యర్థులు తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెల్సిందే. వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment