Dandi March
-
గాంధీ వాడిన ఊతకర్ర కథ ఏమిటి? ఇప్పుడు ఎక్కడుంది?
దండి మార్చ్‌కు ముందు.. ఆ తరువాత గాంధీ ఫోటోల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఊతకర్ర. గాంధీ 1930లో దండి మార్చ్‌తో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చేతిలో ఊతకర్ర చేరింది.ఇంతకీ ఈ ఊతకర్ర కథ ఏమిటి? దీనిని ఎవరు గాంధీకి ఇచ్చారు? 1930, మార్చి 12న తన 60 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుండి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి చారిత్రాత్మక యాత్రకు బయలుదేరారు. అప్పుడు గాంధీ సహచరుడు, స్నేహితుడు కాకా కలేల్కర్ మహాత్మునికి ఊతమిచ్చేందుకు ఒక కర్ర అవసరమని భావించారు. గాంధీ సాగించే అంత సుదీర్ఘ నడకలో ఆ కర్ర ఉపయోగకరంగా ఉండవచ్చనుకున్నారు. ఈ ఊతకర్రను తీసుకుని గాంధీ 24 రోజుల పాటు ప్రతిరోజూ పది మైళ్లు నడిచేవారు. ఈ నేపధ్యంలోనే ఆ ఊతకర్రకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. కాగా గాంధీ తన జీవితంలో అనేక ఊతకర్రలను ఉపయోగించారు. అయితే ఆయన దండి మార్చ్‌లో ఉపయోగించిన ఊతకర్ర ఆ ఉద్యమానికి ప్రతీకగా మారింది. ఇది గాంధీ ఊతకర్రగా ప్రసిద్ధి చెందింది. ఈ కర్ర బలంగా ఉంటుంది. 54 అంగుళాల ఎత్తు కలిగిన వెదురు కర్ర ఇది. ఈ ప్రత్యేకమైన వెదురు కర్ణాటక తీర ప్రాంతంలోని మల్నాడులో మాత్రమే పెరుగుతుంది. 1948 జనవరి 30వ తేదీ వరకు అంటే గాంధీ హత్యకు గురయ్యే వరకు ఈ ఊతకర్ర గాంధీ దగ్గరే ఉంది. ప్రస్తుతం ఈ ఊతకర్ర న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న నేషనల్ గాంధీ మ్యూజియంలో ఉంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? -
కోపం రావడం కూడా మంచిదే! ఇలా చేస్తే విజయం మీదే!
ప్రేమ, అభిమానం, ఈర్ష్య, ద్వేషం లాగే కోపం కూడా ఓ సహజ, సహజాత ఉద్వేగం. యాంగర్ మేనేజ్మెంట్ అని దాన్ని చంపుకోవడం కంటే... ఎలా ఛానలైజ్ చేస్తే, దాన్నుంచి గరిష్ఠ ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుంటే మంచిదంటున్నారు మానసికవేత్తలూ, ప్రవర్తన శాస్త్రవేత్తలు. నిజానికి కోపం అన్నది పట్టుదలకు మొదటిమెట్టు. భయం ప్రాణరక్షణకు ఉపయోగపడినట్టే... కోపం పట్టుదలకు కారణమై, ఎట్టకేలకు సక్సెస్‌ను సాధించి పెడుతుంది. అంటారు సైకాలజిస్టులు. అదెలాగో చూద్దాం. చాణక్యుడి చతురత మొదలుకొని, ఫ్రెంచి విప్లవం వరకు తొలి దశలోని కోపం... తొలుత పట్టుదలగా మారి... తర్వాత వివేచనతో కూడిన వ్యూహం వల్ల మంచి ఫలితాలను ఇచ్చిన సంగతి చరిత్ర చూసిందే. ఇక్కడ ఓ మంచి మార్పు కోసం ప్రజలు తమ యాంగర్‌ను మోటివేటింగ్ అంశంగా చేసుకున్నారన్నది మానసిక విశేషజ్ఞుల విశ్లేషణ. ఎప్పటి చాణక్యాలో, మరెక్కడి ఫ్రెంచి విప్లవాలో కాదు... ఉప్పు సత్యాగ్రహాలూ, దండి యాత్రలతో మన స్వాతంత్య్రం కూడా ఈ శతాబ్దపు మన ఆగ్రహ విజయ ఫలితమే. ‘ఆగ్రహం నుంచి ఆనందానికి దారి తీసే మంచి దారే మన కోపం’ అని చెబుతున్న ఓ సైకాలజిస్ట్... ఆగ్రహం ప్రభావాన్ని ఇలా వివరిస్తున్నాడు. ‘‘కోపం మొదట మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రేరేపించి స్ఫూర్తిని పుట్టిస్తుంది. పట్టుదల పెంచి విజయం సాధింపజేస్తుంది. చివరగా సంతోషాన్నిస్తుంది. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే యాంగర్ క్రియేట్స్ ఇంపాక్ట్. ఇట్ మొబిలైజెస్, లీడ్స్ టు విక్టరీ దేర్ బై గివ్స్ హ్యాపీనెస్’’. ‘యాంగ్రీ పీపుల్ ఆర్ ఆప్టిమిస్టిక్’ ఆశావహ దృక్పథానికి ఆగ్రహమే మార్గం... ‘యాంగ్రీ పీపుల్ ఆర్ ఆప్టిమిస్టిక్’ అన్నది మనోవిశ్లేషకుల మరో మాట. నలుగురు స్టుడెంట్స్ ఒకే రూమ్‌లో చదువుకుంటూ ఉండేవారు. వాళ్లలో ఒకడికి ఓ రేంజ్ మంచి ర్యాంకే వచ్చింది. ఆ ర్యాంకుకు ఆనందించిన ఆ తండ్రి, కొడుక్కి అదే రాష్ట్రంలో సీట్ వచ్చే అవకాశం లేకపోయినా... పక్కరాష్ట్రంలోని ఓ మోస్తరు మంచి కాలేజీలో మెడిసిన్‌లో చేర్పించాడు. దాంతో తమ మీద తమకే కోపం వచ్చిన ఆ ముగ్గురూ... లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరారు. బాగా చదివారు. దాంతో ఆ ముగ్గురూ సొంతరాష్ట్రంలోనే ఫ్రీ సీట్ సాధించారు. కాస్త ధనవంతుడైన తండ్రికి పుట్టిన మొదట సీటు సాధించిన మిత్రుడి కంటే... తమ కోపం కారణంగా ఇంకా మంచి కాలేజీల్లో, ఇంకా కాస్త చవకగా చదువుకుంటున్నారా మిగతా ముగ్గురు మిత్రులు. అనేక విజయ వ్యూహాలకు కోపమే కీలకం... కోపాన్ని ఓ ప్రతికూల ఉద్వేగంగా భావిస్తారు. కానీ విజయం సాధించాలనే పట్టుదలకు కావాల్సిన వ్యూహాలను ఆలోచించేలా చేస్తుంది ఆగ్రహం. అయితే కత్తికి లాగే కోపానికీ రెండు అంచులుంటాయి. వివేకం కోల్పోయిన క్రోధం... పన్నాగాలకు దిగుతుంది. వివేచనతో కూడిన కోపం వ్యూహాలతో విజయాలందిస్తుంది. ఉగ్రతకు ఆస్కారమివ్వకుండా ఆగ్రహాన్ని జాగ్రత్తగా ఛానెలైజ్ చేసుకుని గెలుపెలా సాధించాలో తెలుస్తుంది. తనలోకి తాను చూసుకునేందుకు ఓ సాధనం తనలోకి తాను తొంగి చూసుకుని, అంతర్మధనంతో, ఆత్మపరిశీలనకు తావిచ్చేది కూడా కోపమే అంటారు జెరెమీ డీన్ అనే సైకాలజీ స్కాలర్. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ నుంచి డాక్టరేట్ పొందిన ఆయన ‘‘మేకింగ్ హ్యాబిట్స్, బ్రేకింగ్ హ్యాబిట్స్’’ అనే పుస్తకం రాశారు. మానసిక అంశాలపై బ్లాగ్ కూడా నిర్వహిస్తుంటారు. ఓ సంఘటన మనలో కోపానికి కారణమైందనుకోండి. అప్పుడు మన ఆగ్రహం సహేతుకమైనదేనా?, మన చేతగానితనం వల్ల కోపం వచ్చిందా?... ఇలా ఆత్మపరిశీలన చేసుకోవడం మానసిక ఔన్నత్యానికీ కారణమవుతుందంటారాయన. మరి అంతా మంచేనా... ఇలా చూసుకున్నప్పుడు ఆగ్రహం వల్ల అంతా మంచే జరుగుతుందా? చెడు జరగదా అంటే... కోపం వల్ల చెరుపు జరిగే అవకాశమూ ఉంది. అయితే ఆగ్రహంతో కూడిన ఉన్మాద స్థితిలో మంచికీ, చెడుకూ మధ్య తేడా గుర్తించలేనంత వివేచన కోల్పోయినప్పుడు మాత్రమే ఆగ్రహం వల్ల అనర్థం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు మానసికవేత్తలు. అందువల్ల వివేచన కోల్పోనంత వరకు కోపం కూడా మిత్రుడే! చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం
సామాన్యులను విశేషంగా ప్రభావితం చేసే ఉప్పు కోసం సామాన్యులందరినీ కలుస్తూ దానికి నడకను సాధనంగా చేసుకున్న మహాఉద్యమ పథికుడు మహాత్మాగాంధీ. 1930 ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల ముప్పై నిమిషాలకు 61 ఏళ్ల వృద్ధ నేత గాంధీ తన సహచరులతో కలిసి నాటి బ్రిటిష్ చట్టాన్ని ధిక్కరిస్తూ, గుజరాత్ తీరంలోని దండి వద్ద చేసిన ఉప్పు తయారీ బ్రిటిష్ పాలకులను వణికించింది. ఈ ఉద్యమమే తర్వాత భారత స్వాతంత్య్రానికి నాంది పలికింది. అటు జాతీయ నాయకులు, ఇటు బ్రిటిష్ పాలకులు పరాచికాలు ఆడినప్పటికీ ఈ రెండు వర్గాల అంచనాలను వమ్ము చేస్తూ దండి సత్యాగ్రహం ఘన విజయం సాధించడమే కాకుండా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది. అది 1930 ఏప్రిల్ 6. ఉదయం 6 గంటల 30 నిమిషాలు. 61 సంవత్సరాల వృద్ధుడు తన సహచరులతో వచ్చి ఉప్పును తయారు చేశారు. ఆ నాయకుడు గాంధీజీ. అలా ఉప్పు సత్యాగ్రహానికి రంగస్థలం అయిన ప్రాంతం గుజరాత్ తీరంలోని దండి. వందేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన అప్పటి బ్రిటీషు పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఉద్య మంతోనే భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. వ్యూహంలో చాతుర్యం: గాంధీజీ వేషభాషలు చాలా మామూలుగా కనబడతాయి. ఇంగ్లండు చదువు గానీ, దక్షిణాఫ్రికా అనుభవం గానీ ఆయనకు ఉన్నట్టు మాటలు, దుస్తుల ద్వారా అంచనా వేయలేం. ఈ దండి సత్యాగ్రహం భావనలో రెండు అంశాలు మనం గమనించవచ్చు. ఒకటి ఉప్పు, రెండవది నడక. గాలి, నీరు తర్వాత ముఖ్యమైనది ఉప్పు అని గాంధీజీ దండి సత్యాగ్రహం గురించి వివరిస్తూ పేర్కొన్నారు. అప్పటి బ్రిటీష్ వారు భారతీయుల నుంచి వసూలు చేసే పన్నుల్లో ఉప్పు పన్ను 8.2 శాతం ఆక్రమించేది. నిజానికి సుదీర్ఘమైన సముద్రతీరంగల ఈ దేశంలో ఉప్పు వద్దన్నా లభిస్తుంది. మనకు సూర్యరశ్మి కూడా కొరత కాదు. అయితే బ్రిటీష్ వాళ్ళు తమకనుకూలంగా ఉప్పు తయారీని నిషేధిస్తూ చట్టాలు చేశారు. ఈ ఉప్పు పన్ను ధనికుల కన్నా పేదవారినే ఎక్కువ బాధించేది. దేశంలోని పేదలను కదిలించే ఉప్పును గాంధీ తన ఉద్యమానికి ఒక ప్రతీకగా స్వీకరించడం అమోఘమైన పాచిక. గాంధీ చంపారన్ ఉద్యమ సమయంలో ఏనుగునెక్కి కూడా ప్రయాణం చేశారు. దండి సత్యాగ్రహానికి బండ్లు, కార్లు కాకుండా కేవలం నడిచే కార్యక్రమంగా ఆయన మలిచాడు. సబర్మతీ ఆశ్రమానికి దగ్గరలో వుండే ఏదో ఒక తీర ప్రాంతాన్ని కాకుండా 200 మైళ్ళ దూరంలో వుండే నౌసరి (దండికి అప్పటి పేరు) ని ఎంచుకోవడం కూడా గాంధీ ప్రతిభావంతమైన ప్రణాళిక. 1930 మార్చి 12వ తేదీన 78 మంది అనుచరులతో 24 రోజుల పాటు నడుస్తూ మధ్యమధ్యన ప్రతి రోజూ ఒక ఊరిలో ఆగుతూ సాగడం అప్పటికి చాలా కొత్త వింతగా కనబడింది. మిగతా జాతీయ నాయకులు ఇదేమి వ్యూహమని పరాచికాలు ఆడగా బ్రిటీష్ పాలకులు 6 పదులు దాటిన ముదుసలి ఏమి నడుస్తాడులే అని తమలో తాము నవ్వుకున్నారు. ఈ రెండు వర్గాల అంచనాలను వమ్ము చేస్తూ దండి సత్యాగ్రహం విజయవంతం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది. యువకులకు పెద్ద పీట: గాంధీతోపాటు 200 మైళ్ళు నడచిన 78 మంది వివరాలు పరిశీలిస్తే అందులో 40–50 ఏళ్ల వయసున్నవాళ్ళు 6గురు మాత్రమే వుండగా... 60 దాటినవాడు ఒక్క గాంధీజీయే. ఈ బృందంలో ఎక్కువమంది 20–25 మధ్య వయసున్న యువకులే కావడం విశేషం. చాలా జాగ్రత్తగా గాంధీజీ ఈ 78 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరిలో ఒకే ఒక తెలుగు వ్యక్తి 25 సంవత్సరాల ఎర్నేని సుబ్రహ్మణ్యం. వీరే తరువాతి దశలో పొట్టి శ్రీరాములుకు మిత్రుడిగా, గురువుగా కొనసాగారు. భారత స్వాతంత్య్రోద్యమంలో క్రియాశీలక సంఘటనలు సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనం వంటివి ఉవ్వెత్తున మొదలైనా చౌరీచౌరాలో జరిగిన అల్లర్ల కారణంగా గాంధీ తన వ్యూహాన్ని మార్చేశారు. తరువాత మనకు కనబడే ప్రధాన సంఘటన దండి సత్యాగ్రహమే. సంఘటనలకు స్పందనగా ఎలా వ్యక్తులు తమను తాము మలచుకోవాలో సత్యాగ్రహ శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. అటువంటి వినూత్న శిక్షణకు రాజమండ్రి దగ్గర వున్న సత్యాగ్రహ ఆశ్రమం కేంద్రం కావడం తెలుగువారందరికీ గర్వకారణం. దండి సత్యాగ్రహం ప్రభావం: 1930 ఏప్రిల్ 6న గాంధీ తన సహచరులతో కలసి ఉప్పును తయారు చేసి, బ్రిటీష్ శాసనాన్ని ఉల్లంఘించారు. అలా గాంధీ తయారు చేసిన ఉప్పు గడ్డను తరువాత వేలం వేయడం ఒక చారిత్రక విశేషం. గాంధీజీ ఉప్పు తయారు చేసిన సమయంలో తెలుగింటి కోడలైన సరోజినీ నాయుడు చట్టాన్ని గాంధీ అతిక్రమించారని బిగ్గరగా ప్రకటించడం ఇంకో విశేషం. కమలాదేవి ఛటోపాధ్యాయ స్వాతంత్య్రం ఉప్పును కొంటారా అని బొంబాయిలో మెజిస్ట్రేట్‌ను అడగడం మరో ఆశ్చర్యకరమైన అంశం. ఈ రీతిలో దేశవ్యాప్తంగా ఉప్పు స్వాతంత్య్ర ఉద్యమానికి నిప్పు రవ్వగా పనిచేసింది. 1930 ఫిబ్రవరి 27న యంగ్ ఇండియా పత్రికలో నేను అరెస్టయితే అనే శీర్షికతో గాంధీ ఒక సంపాదకీయాన్ని రాస్తూ ఉప్పు పన్ను దుష్ప్రభావాన్ని వివరించాడు. మార్చి రెండవ తేదీ గాంధీజీ వైస్రాయ్ కి సుదీర్ఘమైన ఉత్తరం రాసి ఈ పన్ను ద్వారా పేదలను ఏ స్థాయిలో పీడిస్తున్నారో తెలియజేసారు. ఒక వేళ మీరు సానుకూలంగా స్పందించక పోతే 11వ రోజున సబర్మతీ ఆశ్రమం నుంచి బయలుదేరి ఉప్పు పన్ను చట్టాన్ని అతిక్రమిస్తానని హెచ్చరించారు. ఏప్రిల్ 6వ తేదీన చూసీచూడనట్టున్న బ్రిటీష్ ప్రభుత్వం అప్రమత్తమై మే 5వ తేదీన గాంధీజీని అరెస్టు చేసింది. ప్రపంచ వ్యాప్త స్ఫూర్తి : శాంతియుతంగా నిరసన తెలిపే విధానం (సత్యాగ్రహం) ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. గాంధీ దండి సత్యాగ్రహం నడకను చిత్రిం చిన దృశ్యాలు యూరప్‌ను, అమెరికాను విపరీతంగా ఆకర్షించాయి. న్యూయార్క్ టైమ్స్ ప్రతి రోజూ వార్తలు ప్రచురించటమే కాకుండా ఏప్రిల్ 6, 7 తేదీల్లో తొలి పేజీ కథనాలను ప్రచురించింది. 1930 సంవత్సరం మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా గాంధీజీని టైం మ్యాగజైన్ ఎంపిక చేయడం విశేషం. ఉప్పు పన్నుకు సంబంధించిన సామాజిక ఆర్థికపరమైన పార్శా్వలను వివరించే రీతిలో రామమనోహర్ లోహియా ఉద్యమం జరిగిన మూడేళ్ళలో పీహెచ్.డి పట్టాను గడిం చడం ఇంకో విశేషం. దండి ఉద్యమం జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో నల్లజాతి వారికి వెలుగు చుక్కానిగా మారింది. ఆ ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. తొలుత తాను గాంధీజీని సీరియస్‌గా పట్టించుకోలేదని అయితే ఉప్పు సత్యాగ్రహం, ఆయన నిరాహార దీక్షలు, సత్యాగ్రహ భావన ఆకర్షించాయని తరువాత గాంధీ సిద్ధాంతాలను లోతుగా అన్వేషించడం మొదలైందని, చివరకు గాంధీపట్ల ఆయన ఉద్యమంపట్ల ఆరాధనగా మారిందని అదే తన ఉద్యమాన్ని నడిపించిందని మార్టిన్ విశ్లేషించారు. దండి సత్యాగ్రహానికి 75 ఏళ్ళ పండుగ : 1980లో దండియాత్ర స్వర్ణోత్సవం, 2005లో 75 ఏళ్ళ పండుగ జరి గాయి. ఈ రెండు సందర్భాలలో భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్ళలను విడుదల చేసింది. మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ 2005లో చేసిన రిఎనాక్టిమెంట్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా వార్తలకెక్కింది. 9 దేశాల నుంచి 900 మందితో ప్రారంభమైన తుషార్ గాంధీ బృందం అప్పటి దండి సత్యాగ్రహం దారిలోనే కదిలితే రోజు రోజుకూ కొత్తవారు వచ్చి చేరడంతో ఆ సంఖ్య కొన్ని వేలుగా పెరిగింది. దీనిని న్యాయం, స్వాతంత్య్రం కోసం చేసిన అంతర్జాతీయ నడక అని నామకరణం చేశారు. సబర్మతీ ఆశ్రమం నుంచి దండి దాకా సాగే ఈ దారిని ఇపుడు దండి దారి (దండి పాత్) అని నామకరణం చేశారు. 2019 జనవరి 30వ తేదీన దండిలో నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్ మ్యూజియంను భారత ప్రభుత్వం ప్రారంభించింది.సామాన్యులను విశేషంగా ప్రభావితం చేసే విషయం కోసం సామాన్యులందరినీ కలుస్తూ దానికి నడకను సాధనంగా చేసుకున్న మహాఉద్యమ పథికుడు మహాత్మాగాంధీ. ఇప్పటికీ ఈ విశేషాలు తలుచుకుంటే, తవ్వి పోసుకుంటే ఆశ్చర్యకరం... స్ఫూర్తిదాయకం! వ్యాసకర్త:డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్ : 94407 32392 -
దండి యాత్ర ప్రారంభమైంది నేడే
-
సరిగ్గా 88 ఏళ్ల క్రితం..
అహ్మదాబాద్: సరిగ్గా 88 ఏళ్ల క్రితం, ఇదే రోజు అంటే, 1930, మార్చి 12వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి 390 కిలోమీటర్ల దూరంలోని దండికి యాత్రను ప్రారంభించారు. భారత్‌లో విస్తారింగా దొరికే ఉప్పుపై కూడా బ్రిటిష్ పాలకులు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ ఈ దండియాత్రను ప్రారంభించారు. కేవలం 70 మంది అనుచరులతో గాంధీజీ ఈ యాత్రను ప్రారంభించగా, మార్గమధ్యంలో వేలాది మంది ప్రజలు యాత్రలో కలుస్తూ వచ్చారు. ఏప్రిల్ ఐదవ తేదీ నాడు దండికి గాంధీజీ యాత్ర చేరుకునే సరికి ఆయన వెనకాల మూడు కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు యాత్రలో ఉన్నారు. గాంధీజీ 24 రోజులపాటు దండియాత్రను నిర్వహించాక పన్నును ఎత్తేసే వరకు సత్యాగ్రహాన్ని కొనసాగించారు. -
దండియాత్రకు సాక్షిగా నిలిచిన అవ్వ ఓటు
సాక్షి, గాంధీనగర్ : జాతిపిత మహాత్మా గాంధీ 1930లో నిర్వహించిన దండి సత్యాగ్రహం యాత్రకు ప్రత్యక్ష సాక్షి, 106 ఏళ్ల వద్ధురాలు మోత్లీ బా గుజరాత్ అసెంబ్లీకి శనివారం జరిగిన మొదటి విడత పోలింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. ఆ తర్వాత ఆమె గర్వంగా వేలిపై ఓటువేసినట్లు సిరా గుర్తును చూపిస్తూ మీడియాకు ఫోజిచ్చారు. ఆమె సూరత్‌లో ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసినట్లు తెలియజేస్తూ ఆకాశవాణి ట్వీట్ చేసింది. మొదటి విడతగా ఈ రోజు 89 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 977 మంది అభ్యర్థులు తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెల్సిందే. వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. -
మహాత్మా మన్నించు..!
తణుకు: ప్రతిష్టాత్మక దండి మార్చ్ విగ్రహాలపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తి కట్టారు. వీటిని తొలగించి ఆ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని భావించారు. దాంతో అత్యంత హేయమైన రీతిలో శనివారం రాత్రి దొంగచాటుగా వీటిని వేరే ప్రాంతానికి తరలించేందుకు కుట్ర పన్నారు. ఇందుకు ముందస్తు ప్రణాళిక రచించిన అధికార టీడీపీ నేతలు భారీగా పోలీసు బలగాలను మోహరింపజేశారు. విగ్రహాల తొలగింపును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విగ్రహాలను తొలగించడానికి వీలు లేదని పట్టుబడుతూ నాయకులు ధర్నాకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి ఉండ్రాజవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఒకానొక సమయంలో పోలీసులకు, వైఎస్సార్ సీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ప్రధానమైన గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి ఎన్టీఆర్ పార్కు వద్దకు తరలించారు. మిగతా వాటిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో న్యూఢిల్లీ, గుజరాత్లో మాత్రమే దండి మార్చ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. తర్వాత మన రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జిల్లాలో తణుకు పట్టణంలో నాలుగేళ్ల క్రితం నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రపతి రోడ్డును ఆనుకుని చిట్టూరి ఇంద్రయ్య డిగ్రీ కళాశాల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. అప్పటి మునిసిపల్ అధికారులు సైతం విగ్రహాల ఏర్పాటుకు సహకరించారు. అయితే అప్పట్లోనే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నాయకులతోపాటు బీజేపీ నాయకులు విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకించారు. దేవాదాయశాఖకు చెందిన స్థలంలో వీటిని ఏర్పాటు చేశారంటూ తీవ్ర రాద్ధాంతం చేశారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో దేవాదాయశాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే విగ్రహాలపై వివక్ష చూపుతున్న అధికార పార్టీ నాయకులు అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని భావించి విగ్రహాలను ఎన్టీఆర్ పార్కు వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మునిసిపాలిటీ తీర్మానం గతంలో దండి మార్చ్ విగ్రహాల ఏర్పాటుకు అనుకూలంగా పని చేసిన మునిసిపాలిటీ ప్రస్తుత పాలకవర్గం మాత్రం వీటిని నిర్మించడం విరుద్ధమని చెబుతుండటం గమనార్హం. దండి మార్చ్ విగ్రహాలకు సంబంధించి న్యాయస్థానంలో వాదోపవాదాలు నడుస్తుండటంతోపాటు సంబంధిత విగ్రహాలు దేవస్థానం స్థలంలో ఏర్పాటు చేయడంపై వ్యతిరేకంగా తీర్పు రావడంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దండి మార్చ్ విగ్రహాలను పట్టణంలోని ఎన్టీఆర్ పార్కు లేదా సొసైటీ రోడ్డులోని వైఎస్సార్ పార్కునకు తరలించాలని గతేడాది జరిగిన మునిసిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశారు. విగ్రహాల ఏర్పాటు సమయంలో అనుకూలంగా వ్యవహరించిన మునిసిలిటీ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రపతి రోడ్డును ఆనుకుని కళాశాలకు సమీపంలో వీటిని ఏర్పాటు చేయడం, ఈ ప్రాంతంలో పలు విద్యాసంస్థలు ఉండటం, పైగా రద్దీ ప్రాంతం కావడంతో వీటి ప్రాధాన్యం ఎక్కువ మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దేశంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన దండి మార్చ్ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగానే కేవలం రాజకీయ కారణాలతోనే తరలించే ప్రయత్నం చేస్తున్నారని పలు ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, విద్యార్థులు విమర్శిస్తున్నారు. కేవలం వివక్షతోనే ప్రస్తుతం విగ్రహాల ఏర్పాటు అంశం కోర్టు పరిధిలో ఉండగా వీటిని తరలించడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. విగ్రహాలను వేరే చోటకు తరలించడానికి కోర్టు అనుమతులు ఇచ్చిందని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విగ్రహాలను ఏర్పాటు చేశారన్న అంశం మినహాయించి విగ్రహాల తరలింపునకు సంబంధించి ప్రత్యేక కారణాలు ఏమీ అధికారులు వెల్లడించడంలేదు. విగ్రహాల ఏర్పాటు ఉద్దేశం నెరవేరడం లేదనీ, ట్రాఫిక్ నియంత్రణ సాధ్యం కావడంలేదనీ, ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటూ కౌన్సిల్ తీర్మానించడం విశేషం. గత పురపాలక సంఘం మద్దతుతో విగ్రహాలు ఏర్పాటు చేయడంపై గతేడాది మునిసిపల్ కమిషనర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ వేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. అయితే పిటిషన్ ఉపసంహరించుకుని విగ్రహాలను తొలగించే ప్రయత్నం కౌన్సిల్ చేసింది. దురుద్దేశంతోనే కేవలం దురుద్దేశంతోనే ప్రతిష్టాత్మక దండి మార్చ్ విగ్రహాలను అధికార పార్టీ నాయకులు తొలగిస్తున్నారు. గతంలో విగ్రహాల ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరించిన మునిసిపల్ కౌన్సిల్ ఇప్పుడు విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో ఇలాంటి ప్రతిష్టాత్మకమై విగ్రహాలను తొలగించడం భావ్యం కాదు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు కావడంతోనే వివక్షతోనే వీటిని తొలగిస్తున్నారు. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే, తణుకు -
సంకీర్తన దండియాత్ర ప్రారంభం
సాక్షి, ముంబై: విలేపార్లేలోని ప్రముఖ ఇస్కాన్ సంస్థకు చెందిన సుమారు 1,500 మంది భక్తులు సంకీర్తన దండి యాత్ర ప్రారంభించారు. ఇందులోభాగంగా ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. శ్రీకృష్ణ చైతన్యస్వామి రాష్ట్రాన్ని సందర్శించి ఈ సంవత్సరంతో 500 ఏళ్లు పూర్తయ్యింది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని స్వామి నడిచిన మార్గంలో పయనించాలనే లక్ష్యంతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు చెప్పారు. గత నెల 29వ తేదీన కొల్హాపూర్‌లోని ఇస్కాన్ మందిరం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా వీరంతా పండరీపూర్‌లోని విఠలుడిని దర్శించుకున్నారు. ఆ తరువాత పుణే. సాతారాల మీదుగా నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుని మళ్లీ ఈ నెల 22న సాతారాలో ఇస్కాన్ మందిరానికి చేరుకుంటారు. ఈ యా త్రలో భాగంగా ఈ భక్త బందం దాదాపు 386 కి.మీ. కాలినడకన పయనిస్తుంది.