అహ్మదాబాద్ : గుజరాత్‌లోని సూరత్ జిల్లా సరోలి ప్రాంతంలోని రఘువీర్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పదిఅంతస్తుల భవనం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 50కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరాయని అధికారులు తెలిపారు. కాగా కొద్దిరోజుల కిందట ఇదే భవనంలోని నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. మరోవైపు అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలను కొద్దిసేపటిలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment