సాక్షి, విశాఖపట్నం: వినాయక చవితి పురస్కరించుకుని భారీ వినాయక విగ్రహం ఏర్పాటులో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గణనాథుడి మండపం కుప్పకూలిన ఘటన విశాఖలోని గాజువాకలో చోటుచేసుకుంది.సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా నాతయ్యపాలెంలో 70 అడుగుల గణనాథుడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా అతి పెద్ద మండపాన్ని నిర్మించి అందులోనే విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నారు.
ఇందుకోసం గత వారం రోజులుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలితో పాటు భారీ వర్షం కారణంగా మండపం పేకపేడలా కూలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సుమారు రూ.15 లక్షలతో నెల రోజులుగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment