‘ఈ ఏడాది లడ్డూ వేలం లేదు’ | Balapur Ganesh Utsav Committee Says No Laddu Velam Over Coronavirus | Sakshi
Sakshi News home page

‘ఈ ఏడాది లడ్డూ వేలం లేదు’

Published Thu, Jul 23 2020 2:48 PM | Last Updated on Thu, Jul 23 2020 5:09 PM

Balapur Ganesh Utsav Committee Says No Laddu Velam Over Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ గణపతి ఉత్సవాల కోసం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ ఏడాది గణపతి ఉత్సవాల్లో భాగంగా కేవలం ఆరు అడుగుల వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఉత్సవ కమిటీ పేర్కొంది. అదే విధంగా అత్యంత ఆసక్తికరంగా నిర్వహించే వినాయకుడి లడ్డూ వేలంపాట ఏడాది నిర్వహించబోమని తెలిపింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల దర్శనం నిలిపివేస్తున్నట్లు  ఉత్సవ కమిటీ ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement