Festival Season sales
-
పండుగల ఆఫర్లు షురూ
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో మెరుగైన అమ్మకాల కోసం కంపెనీలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే కార్ల కంపెనీలు, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గణేశ చతురి్థ, ఓనమ్ పండుగల సందర్భంగా ఆఫర్లతో అమ్మకాలు పెంచుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు డిమాండ్ స్తబ్దుగా ఉండడంతో, ప్రస్తుత పండుగల సమయంలో మెరుగైన అమ్మకాలపై కంపెనీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. కేరళలో ఓనమ్ పండుగకు ముందే మారుతి 10 శాతం అధిక బుకింగ్‌లను సాధించింది. వినాయక చవితి రోజు అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక కార్ల డెలివరీలను నమోదు చేసినట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇక ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6 నుంచి 15 వరకు) ద్విచక్ర వాహన అమ్మకాలు 15–16 శాతం పెరిగాయి. కేరళలో కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 7–8 శాతం అధికంగా నమోదయ్యాయి. గతేడాది ఓనమ్ సమయంలో విక్రయాలు తగ్గడాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కార్లు, ప్రీమియం కన్జ్యూమర్ ఉత్పత్తుల పరంగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ‘‘ఓనమ్ సమయంలో మాస్ విభాగంలో అమ్మకాల పెరంగా పెద్ద వృద్ధి లేదు. ప్రీమియం ఉత్పత్తుల విభాగంలోనే ఎక్కువ అమ్మకాలు కొనసాగాయి. మాస్ విభాగం అమ్మకాలు అవసరాల ఆధారంగానే ఉన్నాయి. వేసవిలో అధిక వేడి కారణంగా కూలింగ్ ఉత్పత్తులు పెరగడం ఇందుకు నిదర్శనం’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఓనమ్ సందర్భంగా విక్రయాలు గతేడాదితో పోలి్చతే పెరిగాయి కానీ, ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించారు. వీటికి డిమాండ్..ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఓనమ్ పండుగ సమయంలో 15 శాతం అధికంగా నమోదయ్యాయి. ఆరంభ స్థాయిలోని సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 6–7 శాతం పెరిగాయి. వాషింగ్ మెషిన్లలో అధిక ఫీచర్లతో కూడిన పూర్తి ఆటోమేటిక్ ఉత్పత్తుల విక్రయాలు 12–13 శాతం వృద్ధి చెందాయి. ఇక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల అమ్మకాలు కేవలం 4–5 శాతమే పెరిగాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బుకింగ్‌లను శుక్రవారం ప్రారంభించగా, మొదటి రోజే కస్టమర్ల నుంచి వచి్చన స్పందన గతేడాది కంటే మెరుగ్గా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పండుగల సీజన్ మెరుగ్గా ఉంటే 12–15 శాతం మేర అధిక అమ్మకాలు కొనసాగుతాయని, కార్ల విక్రయాల్లో వృద్ధి 20 శాతం మేర ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్‌కు అమ్మకాలు తీరు ఎలా ఉంటాయన్నది ఓనమ్ సమయంలో డిమాండ్ తెలియజేస్తుంటుంది. గతేడాది ఆటో అమ్మకాల బేస్ అధిక స్థాయిలో ఉండడంతో, ఈ ఏడాది విక్రయాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనా సైతం నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న డిమాండ్‌కు ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలు సానుకూల సంకేతాలిస్తున్నట్టు మారుతి సుజుకీ పార్థా బెనర్జీ పేర్కొన్నారు. ఈ పండుగల సీజన్ స్కూటర్లు, మోటారు సైకిళ్లకు ఉత్తమంగా నిలిచి పోతుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోవాల్సి ఉందంటూ, ఇప్పటి వరకు కనిపిస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో నెలవారీ సగటున 3.30 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, పండగుల సీజన్లో 15 శాతం మేర అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాతో ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమలకు ఏటా పండగుల సీజన్ అమ్మకాల పరంగా ఎంతో కీలకం కావడం తెలిసిందే. -
కొత్త కార్ల పండగ!
సార్వత్రిక ఎన్నికలు.. మండుటెండలు.. కుండపోత వర్షాలు.. కార్ల కంపెనీల అమ్మకాలను గత మూడు నాలుగు నెలలూ గట్టిగానే దెబ్బకొట్టాయి. గ్రామీణ డిమాండ్‌తో జూలైలో మాత్రం కాస్త పుంజుకుని ఊరటనిచ్చాయి. నిండు కుండలా కార్ల నిల్వలు పేరుకుపోవడంతో డీలర్లు పండగ సీజన్ కోసం అవురావురుమని ఎదురుచూస్తున్నారు. మరోపక్క, అమ్మకాలు మందగించడంతో.. కార్ల కంపెనీలు గేరు మారుస్తున్నాయి. కొంగొత్త వాహన మోడళ్లను కారు ప్రియుల కోసం రెడీ చేస్తున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు సేల్స్ పెంపుతో పండుగ చేసుకోవాలని చూస్తుండగా.. కస్టమర్లకు కూడా కొత్త కార్ల జాతర కనువిందు చేయనుంది. రాబోయే పండుగ సీజన్ కోసం కార్ల కంపెనీలన్నీ ‘కొత్త’ వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. దాదాపు 20 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అంచనా. ఇందులో 12 కార్లు పూర్తిగా కొత్తవి కావడం విశేషం. ప్రస్తుతం దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ)పైనే కంపెనీలన్నీ ఎక్కువగా గురి పెట్టాయి. కొత్తగా విడుదలయ్యే వాటిలో 13 ఎస్యూవీ మోడల్స్ ఉండటం దీనికి నిదర్శనం. టాటా మోటార్స్, నిస్సాన్, సిట్రాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ మోటార్స్, కియా, హ్యుందాయ్, ఫోక్స్వ్యాగన్తో పాటు లగ్జరీ కార్ దిగ్గజాలు మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ తదితర కంపెనీలు వచ్చే మూడు నెలల్లో కొత్త ఎస్‌యూవీలతో మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ఇక మారుతీ సుజుకీ, మెర్సిడెస్ నయా సెడాన్లతో అలరించనుండగా.. కియా, ఎంజీ మల్టీ పర్పస్ వాహనాలను (ఎంపీవీ) రంగంలోకి దించుతున్నాయి. సేల్స్ తగ్గినా.. నిల్వల పెంపు.. ఈ ఆరి్థక సంవత్సరం మొదలు (ఏప్రిల్ నుంచి) వాహన అమ్మకాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఎన్నికలతో పాటు మండుటెండలు కూడా వాహన విక్రయాలపై ప్రభావం చూపాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేయడం కంపెనీల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, గ్రా మీణ డిమాండ్ మళ్లీ పుంజుకోవడంతో జూలైలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 10% పెరగ డం విశేషం. కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేయడం.. పండుగల్లో భారీ డిమాండ్ ఆశలతో వాహన కంపెనీలు భారీగా నిల్వలు పెంచుకున్నాయి. డీలర్ల వద్ద సగటున 25–30 రోజుల నిల్వలు ఉంటాయని, ప్రస్తుతం 60–65 రోజుల నిల్వలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.73,000 కోట్లుగా అంచనా. సెపె్టంబర్‌తో షురూ... దక్షిణాదిన కేరళ ‘ఓనమ్’ తో పండుగ సేల్స్ మొదలవుతాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి, దుర్గాపూజ, దసరా, దీపావళి ఇలా వరుసగా అటు జనాలకు ఇటు కంపెనీలకూ పండుగే. మూడు నెలలుగా పేరుకున్న నిల్వలను పండుగల్లో విక్రయించడంతో పాటు కొత్త మోడళ్లతో కస్టమర్లను షోరూమ్‌లకు క్యూ కట్టించాలనేది వాహన సంస్థల వ్యూహం. మహీంద్రా సక్సెస్ఫుల్ ఎస్యూవీ ‘థార్’లో (ప్రస్తుతం మూడు డోర్ల మోడల్ ఉంది) కొత్తగా ఐదు డోర్ల థార్ ‘రాక్స్’ను తీసుకొస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దీన్ని ఆవిష్కరించి.. పండుగ సీజన్లో మార్కెట్లోకి తీసుకొచ్చేలా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ‘ఐదు డోర్ల థార్ కోసం మేము ముందుగా ప్లాన్ చేసిన ఉత్పత్తికి మరో 3,000–4,000 అదనంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం’ అని ఎంఅండ్ఎం సీఈఓ (ఆటో, ట్రాక్టర్ల విభాగం) రాజేష్ జెజూరికర్ క్యూ1 ఆరి్థక ఫలితాల సందర్భంగా వెల్లడించారు.ఈవీలు, హైబ్రిడ్లు కూడా... కొత్తగా లైన్ కడుతున్న వాహన మోడల్స్ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా రకరకాల ఇంజిన్ ఆప్షన్లతో లభించనున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ (ఈవీ) హైబ్రిడ్ (సీఎన్జీ+పెట్రోల్ వంటివి) ఇంజిన్లు సైతం వీటిలో ఉన్నాయి. ఈవీ విభాగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్ సరికొత్త ఎస్యూవీ కూప్ ‘కర్వ్’తో పండగ చేసుకోవాలనుకుంటోంది. ఈ మోడల్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఈవీ వేరియంట్‌ను కూడా తీసుకొస్తోంది. ముందుగా ఈవీ ‘కర్వ్’ను ప్రవేశపెట్టడం విశేషం. గత నెలలో నిస్సాన్ ఆవిష్కరించిన ప్రీమియం ఎస్యూవీ ఎక్స్–ట్రెయిల్ కూడా పండుగల్లో రోడ్డెక్కనుంది.పండుగ రేసు గుర్రాలు (అంచనా ధర రూ.లలో).. → టాటా మోటార్స్–కర్వ్ ఈవీ (18–25 లక్షలు), → కర్వ్ (రూ.10.5–20 లక్షలు), → మారుతీ–స్విఫ్ట్ హైబ్రిడ్ (10 లక్షలు), డిజైర్–2024 (7–10 లక్షలు) → మహీంద్రా–థార్ రాక్స్ (13–23 లక్షలు) → నిస్సాన్ – ఎక్స్ట్రెయిల్ (49 లక్షల నుంచి)→ టయోటా బెల్టా – (9.5–12 లక్షలు) → మెర్సిడెజ్–బెంజ్ – ఈక్యూఎస్ ఎస్యూవీ (2 కోట్లు) → బీఎండబ్ల్యూ–ఎం3 (1.47 కోట్లు) → రెనో–కార్డియన్ (10–12 లక్షలు) → ఎంజీ–క్లౌడ్ ఈవీ (29–30 లక్షలు), → గ్లోస్టర్–2024 (40 లక్షలు) → స్కోడా–కొడియాక్–2024 (40–50 లక్షలు) → బీవైడీ–సీగల్ ఈవీ (10 లక్షలు) → కియా–ఈవీ9 (75–82 లక్షలు)→ ఆడి–క్యూ8 ఫేస్‌లిఫ్ట్ (రూ.1.17 కోట్లు) → సిట్రాన్ – సీ3ఎక్స్ (రూ.11.5 –15 లక్షలు), బసాల్ట్ (రూ.8 లక్షలు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే?
భారతదేశంలో వైభవంగా జరుపుకునే పండుగల్లో ఒకటైన 'దీపావళి' సందర్భంగా దేశీయ మార్కెట్లో బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. వాహన అమ్మకాలు, బంగారం, నిత్యావసర వస్తువుల సేల్స్ ఒక ఎత్తయితే, టపాసులు విక్రయాలే మరో ఎత్తుగా సాగుతాయి. రాబోయే దీపావళిని దృష్టిలో ఉంచుకుని భారత్ చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించింది. దీని వల్ల చైనాకు వేలకోట్లు నష్టం వాటిల్లుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చైనా వస్తువులను భారతదేశంలోకి దిగుమతి చేసుకోకూడదని తీసుకున్న నిర్ణయంతో చైనా సుమారు రూ. 50,000 కోట్ల వ్యాపార నష్టాన్ని చవిచూడనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చైనా ఉత్పత్తుల బహిష్కరణకు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలునివ్వడంతో దీపావళి సమయంలో చైనా ఉత్పతుల దిగుమతులు భారీగా తగ్గుతాయి. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచడానికి 'సీఏఐటీ' ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఇతడొక వారధి! 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించాడు. దీపావళి పండుగ సమయంలో వినియోగదారులు సుమారు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తూ.. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి చైనా ఉత్పత్తుల దిగుమతి నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, లక్నో, చండీగఢ్, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోల్‌కతా, రాంచీ, గౌహతి, పాట్నా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మదురై, పాండిచ్చేరి మొదలైన ప్రాంతాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, బదులుగా భారతీయ వస్తువులకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా భారీ నష్టం.. ప్రతి సంవత్సరం పండుగ సీజన్లలో భారతీయ వ్యాపారులు చైనా నుంచి రూ.70,000 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటారని సమాచారం. అయితే భారత్ తీసుకున్న నిర్ణయంతో చైనా.. రాఖీ సందర్భంగా సుమారు రూ.5,000 కోట్లు, వినాయక చవితి సమయంలో రూ. 500 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. -
‘పై’ ఎలక్ట్రానిక్స్ లక్కీడ్రాలో బహుమతుల బొనాంజా
గత ఏడాది డిసెంబర్ 5న ప్రముఖ రిటైల్ దిగ్గజం పై ఇంటర్నేషన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(Pai International Electronics Ltd) నిర్వహించిన మెగా ఫెస్టివల్ సేల్ లక్కీ డ్రాలో హైదరాబాద్‌కు చెందిన బాబీ అనే వ్యక్తి మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఏ కారును గెలుచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను పై సంస్థ యూట్యూబ్‌లో ప్రసారం చేసింది. 2021 గాను దసరా, దీపావళి నేపథ్యంలో రూ. 2 వేలు కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసే వారికి డిజిటల్ కూపన్లను పై ఇంటర్నేషనల్ అందించింది. ఈ సేల్‌లో బాబీ రూ. 8000 విలువైన సేల్ ఫోన్‌ను కొనుగోలు చేసి కారును గెల్చుకున్నాడు. కస్టమర్ల కోసం ప్రతియేడాది నాలుగు సార్లు, ప్రతి పండుగ సీజన్లో లక్కీ విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. గత 20 సంవత్సరాలలో,..320 కార్లు, 320 బైక్‌లు, రూ. 22.5 కోట్ల విలువైన ఉచిత షాపింగ్, రూ. 7.3 కోట్ల గోల్డ్ రివార్డ్, రూ. 2.65 కోట్ల విలువైన నగదు బహుమతులు, అలాగే 64.56 కోట్ల విలువైన పై లాయల్టీ పాయింట్లను అందించింది. Pai International Electronics Ltd రిటైల్ సంస్థ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నీచర్ కోసం ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌గా నిలుస్తోంది. కస్టమర్ల కోసం అనేక రకాల సేల్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. అంతేకాకుండా కస్టమర్లకు అదనంగా లక్కీడ్రాలు, బహుమతులను ఉచితంగా అందిస్తోంది. పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లు విలువైన బహుమతులను ప్రకటించింది. వాటితో పాటుగా కస్టమర్లు 15 కోట్ల వరకు పైగా లాయల్టీ పాయింట్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. హ్యుందాయ్ ఆరా వంటి కార్లు, అలాగే ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. కస్టమర్లకు అదనంగా గిఫ్ట్‌కార్డులను, రివార్డులను కూడా ప్రకటిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విస్తరించి ఉంది. ఇది సుమారు 87 లార్జ్ స్కేల్ మల్టీ బ్రాండ్ అవుట్లెట్లతో పాటుగా దాదాపు 121 మొబైల్ ఫోన్ అవుట్లెట్లతో, 15 ఫర్నిచర్ షాపులను కలిగి ఉంది. కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. పై ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవలను కూడా చేస్తోంది పై ఇంటర్నేషనల్. పర్యావరణ పరిరక్షణ నుంచి నిరుపేద వృద్ధులకు, విద్యార్థులకు తన వంతు సహాకారాన్ని అందిస్తోంది. (అడ్వటోరియల్) -
పండుగలపై పానసోనిక్ ఆశలు
కోల్‌కతా: కరోనా కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పండుగ సీజన్లో అమ్మకాలు మెరుగ్గా ఉండగలవని పానసోనిక్ ఇండియా ఆశిస్తోంది. గతేడాది జూన్–సెపె్టంబర్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో విక్రయాలు 18 శాతం పెరిగాయని సంస్థ చైర్మన్ మనీష్ శర్మ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో తమ గ్రూప్ సంస్థ పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా నెలకొల్పిన ఎలక్ట్రికల్ పరికరాలు, వైరింగ్ డివైజ్‌ల ఉత్పత్తి ప్లాంటు త్వరలో అందుబాటులోకి రాగలదని ఆయన పేర్కొన్నారు. -
అయ్యో మారుతి ! ఆటోమొబైల్ సెక్టార్‌పై ‘చిప్’ ఎఫెక్ట్
దేశంలోనే నంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కార్ల తయారీలో కీలకమైన సెమికండర్లు (చిప్)ల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సమస్యను అధిగమించేందుకు మారుతి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. చిప్సెట్ల ఎఫెక్ట్ దసరా, దీపావళి పండుగలకి మన దగ్గర కార్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. మారుతి సైతం ఇదే లక్ష్యంతో భారీగా సేల్స్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన చిప్సెట్ల కొరత కారణంగా ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. మారుతికి చిప్సెట్లు తయారు చేసే కంపెనీలు ఇప్పుడప్పుడే డిమాండ్‌కు తగ్గట్టు చిప్‌లు సరఫరా చేయలేమంటూ తేల్చిచెప్పాయి. దీంతో పండగ సీజన్ అమ్మకాల మాట అటుంచి చివరకు నెలవారీ తయారీ యూనిట్లలోనూ కోత పెట్టేందుకు మారుతి సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. టార్గెట్ కుదింపు ? దసరా, దీపావళీలను లక్ష్యంగా చేసుకుని మారుతి సెప్టెంబరు నెల తయారీ టార్గెట్ 60,000 నుంచి 90,000 యూనిట్లుగా ఆగస్టులో నిర్ధేశించుకుంది. అయితే చిప్సెట్ల కొరత కారణంగా ఈ టార్గెట్‌ను 50,000 నుంచి 70,000లకు కుదించినట్టు ఎకనామిక్ టైమ్స్ లో కథనాలు ప్రచురితం అయ్యాయి. సాధారణంగా పండగ సీజన్లో లక్షకు పైగా యూనిట్లను మారుతి తయారు చేస్తుంది. కానీ చిప్ సెట్ల కొరతతో ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. 2014 తర్వాత కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్లు విధించినప్పుడు కూడా మారుతి కార్ల తయారీ ఈ స్థాయిలో దిగువకు చేరుకోలేదు. చివరి సారిగా 2014లో యాభై వేల యూనిట్లు తయారు చేశారు. ఆ తర్వాత ప్రతీ ఏడు 70వేలకు పైగానే కార్లు తయారు అయ్యేవి. చిప్సెట్లు, సెమికండక్టర్ల కొరతతో మారుతి ప్రణాళిక అమలు కష్టంగా మారింది. ఓపెన్ మార్కెట్ నుంచి చిప్సెట్లు కొనుగోలు చేసే దిశగా కూడా మారుతి ప్రయత్నాలు చేస్తోంది. షేర్ ధర తగ్గలేదు చిప్ సెట్ల కొరతతో ఇబ్బందుల్లో మారుతి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నా ఆ కంపెనీ షేర్ వ్యాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం రోజు మారుతి షేర్ ధర రూ.6605 నుంచి 6,675కి చేరుకోవడం ఈ కంపెనీపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. చదవండి: ఇండియాకి టెస్లా కారు వస్తోందా? జరుగుతున్నదేంటీ? -
కొత్తగా కార్లు కొంటున్నవారే అధికం!
చెన్పై, సాక్షి: రుతుపవనాలు, రబీ పంటలు, చౌక రుణాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి కార్ల విక్రయాలు పెరిగినట్లు ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పండుగల సందర్భంగా ఇటీవల కార్ల విక్రయాలు 10-15 శాతం స్థాయిలో్ పుంజుకున్నట్లు తెలియజేశాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల నుంచి డిమాండ్ అధికంగా కనిపిస్తున్నట్లు వెల్లడించాయి. అక్టోబర్ 16న మొదలైన పండుగల సీజన్ నవంబర్ చివరి వారం వరకూ కొనసాగినట్లు తెలియజేశారు. గతేడాదితో పోలిస్తే.. ఈ పండుగల సీజన్లో 10-11 శాతం అధికంగా 2.33 లక్షల కార్లను విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇది గత 4-5 ఏళ్లలో అధికమని చెప్పారు. వీటిలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే నమోదైనట్లు వెల్లడించారు. గ్రామ ప్రాంతాల నుంచి తొలిసారి కార్లు కొంటున్నవారి వాటా 5 శాతం పెరిగి 54 శాతాన్ని తాకినట్లు తెలియజేశారు. పట్టణాలలో అయితే ఈ సంఖ్య 48 శాతానికి చేరినట్లు చెప్పారు. ప్రధానంగా ఈకో వ్యాన్లు, ఆల్టో, వ్యాగన్ ఆర్ వంటి చిన్న కార్లకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. రేనాల్ట్ సైతం నవరాత్రి రోజులలో 5,000 కార్లు, ధన్‌తేరాస్, దీపావళిలలో 3,000 కార్లు చొప్పున విక్రయించినట్లు రేనాల్ట్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కోవిడ్-19కు ముందు స్థాయితో పోలిస్తే 50 శాతం డిమాండ్ కనిపించినట్లు తెలియజేశారు. గ్రామీణవాసులు, రైతులకు ప్రత్యేక పథకాలు ప్రకటించడంతో ఇది సాధ్యపడినట్లు వెల్లడించారు. తొలిసారి కారు కొనుగోలుదారులు, ఇతరులతో కలిపి క్విడ్, ట్రైబర్లకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే 7 శాతం పెరిగిన వర్షపాతంతో రబీ పంటల దిగుబడి 6 శాతం అధికంగా 152 మిలియన్ టన్నులకు చేరినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ప్రభుత్వం రబీ పంటలకు మద్దతు ధరను పెంచడంతో ఖరీఫలోనూ పంటలసాగు 95 మిలియన్లు పెరిగి 1100 మిలియన్ హెక్టార్లకు చేరినట్లు వివరించారు. -
పండుగల సీజన్‌పై ఆటో రంగం ఆశలు
న్యూఢిల్లీ: వచ్చే పండుగల సీజన్లో అమ్మకాలు పెరిగేందుకు అవకాశం ఉందని దేశీ ఆటో రంగం భావిస్తోంది. రివర్స్ గేర్‌లో ప్రయాణిస్తోన్న విక్రయాలు ఈ సీజన్లోనైనా ముందుకు కదులుతాయనే కొండంత ఆశతో ఉంది. ఒక్కసారిగా అమ్మకాలు జూమ్ అనే అవకాశాలు కనుచూపు మేరలో లేనప్పటికీ.. ప్రతికూల వాతావరణం నుంచి పండుగల సీజన్లో ఈ రంగం నెమ్మదిగా బయటపడేందుకు మాత్రం ఆస్కారం ఉందని అంచనావేస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (మార్కెటింగ్ – సేల్స్) రాజేష్ గోయెల్ అన్నారు. ‘దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో ఇప్పటికే పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ ఏడాదిలో అమ్మకాలు జోరందుకునే అవకాశాలు తక్కువని భావిస్తున్నా. అయితే, క్రమంగా గాడిన పడేందుకు మాత్రం ఈ పండుగల సమయం సరైనదనిగా భావించవచ్చు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో కార్ల ధరలు మరింత చౌకగా ఉంటాయనే అంచనలో వినియోగదారులు ఉంటే మాత్రం.. ఆ సమయంలో రిజిస్ట్రేషన్ క్షిష్టతరంగా ఉంటుంది. అందుచేత కొనుగోలుదారులకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నా’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) నిర్వహించిన వార్షిక ఆటో రిటైల్ సమావేశంలో గోయెల్ వ్యాఖ్యానించారు. ఒక్కసారే అమ్మకాలు పెరిగేందుకు అవకాశాలు లేకపోయినా.. వచ్చే నెల నుంచి క్రమంగా ఊపందుకునేందుకు అవకాశం ఉందని భావిస్తున్నామని టయోటా కిర్లోస్కర్ మోటార్’ (టీకేఎం) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా అన్నారు. ఎంక్వైరీలు పెరగడమే సంకేతం.. ప్రస్తుతం కస్టమర్ల ఆఫర్లు అధిక స్థాయిలో ఉన్నాయి. ఇది సానుకూల అంశం కాగా, షోరూంలకు పెరిగిన ఎంక్వైరీల (కొనుగోలుదారుల నుంచి కార్లకు సంబంధించిన విచారణ) ఆధారంగా ఈ పండుగల సీజన్లో అమ్మకాలు గాడిన పడతాయని అంచనావేస్తున్నట్లు మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వివరించారు. -
పండుగల వేళ.. ఆఫర్లే ఆఫర్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీ కంపెనీలు పండుగల సీజన్ అమ్మకాలకు సిద్ధమవుతున్నాయి. కస్టమర్లను ఊరించే ఆఫర్లతో ప్రచారం ప్రారంభించాయి. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, బహుమతులతో అమ్మకాలు పెంచుకునేందుకు హడా వుడి చేస్తున్నాయి. ఈ పండుగ సీజన్ అమ్మకాల్లో 20-50 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నాయి. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల పరిశ్రమ తిరిగి పుంజుకుంటుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. ఒకదాని వెంట మరొకటి.. దసరా, దీపావళి సమీపిస్తుండడంతో కంపెనీలు ఒకదాని వెంట ఒకటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని రకాల రిఫ్రిజిరేటర్లపై ట్యాబ్లెట్ పీసీని బహుమతిగా శాంసంగ్ అందిస్తోంది. బ్రేవియా టీవీలు, ఆల్ఫా కెమెరాలపై ప్రమోషనల్ ఆఫర్లను సోనీ ప్రకటించింది. ఖచ్చితమైన బహుమతులూ అందిస్తోంది. ఎంపిక చేసిన హై ఎండ్ టీవీలపై రూ.1.5 లక్షల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌తోపాటు సౌండ్ బార్, డీవీడీ ప్లేయర్, కొన్ని స్మార్ట్ టీవీ మోడళ్లపై మేజిక్ మోషన్ రిమోట్‌ను ఎల్జీ ఉచితంగా ఇస్తోంది. మైక్రోవేవ్ ఓవెన్, బ్లూరే వంటి బహుమతులను ప్యానాసోనిక్ హామీగా ఇస్తోంది. కొన్ని టీవీ మోడళ్లపై సౌండ్‌బార్, స్పీకర్ సిస్టమ్స్ ఉచితమని సాన్సూయ్ ప్రకటించింది. ఇండక్షన్ కుక్టాప్తోపాటు ఖచ్చితమైన బహుమతులను కెల్వినేటర్ అందిస్తోంది. ఎంపిక చేసిన ఉపకరణాలపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ను రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. ప్రతి పీసీపైన రూ.8 వేల విలువగల బహుమతులను అందుకోండని డెల్ అంటోంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి నూతన వాషింగ్ మెషీన్ వేరియంట్‌ను వర్ల్‌పూల్ మార్కెట్లోకి తెస్తోంది. హై ఎండ్ మైక్రోవేవ్స్ కూడా రానున్నాయి. కొత్త కొత్త వేరియంట్లను ప్రవేశపెడుతున్నట్టు హాయర్ తెలిపింది. వీడియోకాన్ నూతన 4కే యూహెచ్డీ ఎల్ఈడీ టీవీలను ఆవిష్కరించింది. ఇ-జోన్, ఆదీశ్వర్, టీఎంసీ, బజాజ్ ఎలక్ట్రానిక్స్, యెస్మార్ట్, క్రోమా తదితర మల్టీబ్రాండ్ రిటైల్ చైన్లు ఆకర్షణీయ బహుమతులతో కస్టమర్లను ఆహ్వానిస్తున్నాయి. గతేడాది కంటే.. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్ పుంజుకుం టున్న సంకేతాలు ఉన్నాయని హాయర్ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులు నమోదు చేయడం, మార్కెట్ సెంటిమెంటు తిరిగి నిలదొక్కుకోవడం ప్రస్తుతం కలిసి వచ్చే అంశమని అన్నారు. ఎంత కాదన్నా 25 శాతంపైగా వృద్ధి కనబరుస్తుందన్న అంచనాలతో పరిశ్రమ ఉత్సాహంగా ఉందని చెప్పారు. హాయర్ ఈ సీజన్లో 40-50 శాతం వృద్ధి ఆశిస్తోందని పేర్కొన్నారు. ఎల్ఈడీ ప్యానెళ్లకు మంచి గిరాకీ ఉంటుందని ఒనిడా బ్రాండ్‌తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జీఎల్ మిర్చందానీ వెల్లడించారు. ఈ సీజన్లో ఒనిడా 30 శాతం వృద్ధి ఆశిస్తోందని చెప్పారు. కాగా, ప్రజల జీవన వ్యయం పెరగడం, ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, వడ్డీ రేట్లు కిందకు రాకపోవడం వంటి అంశాలు పరిశ్రమకు మింగుడు పడడం లేదు. పెద్ద పెద్ద లక్ష్యాలతో.. గతేడాది ఆగస్టు-నవంబర్‌తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో కంపెనీ అమ్మకాల విలువ 25 శాతం వృద్ధితో రూ.5,100 కోట్లు నమోదవుతుందని సోనీ అంచనా వేస్తోంది. మార్కెటింగ్ వ్యయాల కోసం కంపెనీ రూ.250 కోట్లను కేటాయించింది. సెంటిమెంటు బలంగా ఉన్న కారణంగా తమ అమ్మకాల్లో 35 శాతం వృద్ధి ఉండొచ్చని ఎల్జీ అంటోంది. కొత్త ప్రభుత్వం రాక, డాలరుతో పోలిస్తే రూపాయి బలంగా ఉండడంతో కస్టమర్లలో సానుకూల స్పందన కనపడుతోంది. ఈ అంశాలే అమ్మకాలకు జోష్‌నిస్తాయని ప్యానాసోనిక్ చెబుతోంది. 2013తో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం వృద్ధిని కంపెనీ అంచనా వేస్తోంది. 2009, 2010లో పరిశ్రమ 30-40 శాతం వృద్ధి చెందింది. ఆ స్థాయిలో ప్రస్తుత సంవత్సరంలో అమ్మకాలు నమోదు కాకపోవచ్చని వర్ల్‌పూల్ ఇండియా తెలిపింది. ఈ సీజన్లో తమ అమ్మకాల పరిమాణంలో 20 శాతం హెచ్చుదలను వర్ల్‌పూల్ ఆశిస్తోంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విపణి పరిమాణం రూ.40 వేల కోట్లుంది.