
కోల్‌కతా: కరోనా కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పండుగ సీజన్‌లో అమ్మకాలు మెరుగ్గా ఉండగలవని పానసోనిక్ ఇండియా ఆశిస్తోంది. గతేడాది జూన్–సెపె్టంబర్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో విక్రయాలు 18 శాతం పెరిగాయని సంస్థ చైర్మన్ మనీష్ శర్మ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో తమ గ్రూప్ సంస్థ పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా నెలకొల్పిన ఎలక్ట్రికల్ పరికరాలు, వైరింగ్ డివైజ్‌ల ఉత్పత్తి ప్లాంటు త్వరలో అందుబాటులోకి రాగలదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment