Manish Sharma
-
పండుగలపై పానసోనిక్ ఆశలు
కోల్‌కతా: కరోనా కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పండుగ సీజన్లో అమ్మకాలు మెరుగ్గా ఉండగలవని పానసోనిక్ ఇండియా ఆశిస్తోంది. గతేడాది జూన్–సెపె్టంబర్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో విక్రయాలు 18 శాతం పెరిగాయని సంస్థ చైర్మన్ మనీష్ శర్మ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో తమ గ్రూప్ సంస్థ పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా నెలకొల్పిన ఎలక్ట్రికల్ పరికరాలు, వైరింగ్ డివైజ్‌ల ఉత్పత్తి ప్లాంటు త్వరలో అందుబాటులోకి రాగలదని ఆయన పేర్కొన్నారు. -
బై బై జయేష్
పాత్ర ఎలాంటిదైనా అందులోకి సులువుగా ఒదిగిపోగలరు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. తన లేటెస్ట్ చిత్రం ‘జయేష్‌భాయ్ జోర్దార్’ కోసం తుంటరి గుజరాతీ కుర్రాడిలా మారారు. తాజాగా ఆ పాత్రకు బై బై చెప్పారు. నూతన దర్శకుడు దివ్యాంగ్ తక్కర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జయేష్‌భాయ్ జోర్దార్’. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై మనీష్ శర్మ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే బాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ‘‘జయేష్ భాయ్ బై బై’’ అన్నారు రణ్వీర్. -
భారత్‌లో ప్యానాసోనిక్ రిఫ్రిజిరేటర్ల తయారీ ప్లాంటు
ఆరు నెలల్లో మేక్ ఇన్ ఇండియా ఫోన్ ♦ రూ.6 వేలలోపు 4జీ స్మార్ట్ ఫోన్ కూడా ♦ ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న ప్యానాసోనిక్ భారత్‌లో రిఫ్రిజి రేటర్ల తయారీ ప్లాంటును ఏడాదిన్నరలో ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లను కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తోంది. రూ.200-300 కోట్ల అంచనా వ్యయంతో 6-10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పుతామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ తెలిపారు. ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పోలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌తోపాటు మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాల కు ఇక్కడ తయారైన రిఫ్రిజిరేటర్లను ఎగుమతి చేస్తామని వెల్లడించారు. భారత్‌ను హబ్‌గా చేసుకుంటామని వివరించారు. మేక్ ఇన్ ఇండియా ఫోన్.. మొబైల్ ఫోన్లను సైతం కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేస్తోంది. ఆరు నెలల్లో మేక్ ఇన్ ఇండియ ఫోన్ తీసుకొస్తామని ఎండీ పేర్కొన్నారు. సొంతంగా ప్లాంటు పెట్టడమా, లేదా థర్డ్ పార్టీ కంపెనీతో చేతులు కలపడమా త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తయారీ సామర్థ్యం నెలకు 10 ల క్షల యూనిట్లు ఉంటుందన్నారు. ‘2014-15లో ఆదాయంలో మొబైల్స్ విభాగం వాటా 5 శాతం మాత్రమే. 2015-16లో ఇది 20 శాతం చేరనుంది. నెలకు 3.20 లక్షల మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్నాం. మార్చికల్లా రూ.6 వేలలోపు ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తాం’ అని వెల్లడించారు. ధరలు పెరగొచ్చు: రూపాయి పతనం కారణంగా వివిధ కంపెనీల గృహోపకరణాల ధరలు అక్టోబరు నుంచి 3-5 శాతం పెరిగే చాన్స్ ఉందని కంన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సియామా) ప్రెసిడెంట్ కూడా అయిన మనీష్ శర్మ తెలిపారు. గతేడాది పరిశ్రమ రూ.48,000 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ఈ ఏడాది రూ.52,000 కోట్లు దాటుతుందని అంచనాగా చెప్పారు. ఫైనాన్స్ కంపెనీల జీరో ఫైనాన్స్ పథకాలతో అమ్మకాలకు బూస్ట్నిస్తుందన్నారు. వ్యాపార అవకాశాలు ఉన్న దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు పరిశ్రమకు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే మేక్ ఇన్ ఇండియా విజయవంతం అవుతుందని చెప్పారు. -
ఎందుకో ఏమో..!
పర్సనల్ మైలేజ్ తగ్గుతుందనో... అసలు వేరే బ్రాండింగే అవసరం లేదనో... బాలీవుడ్ బాద్షా షారూఖ్‌ఖాన్ తాను చేయబోయే ‘ఫ్యాన్’లో మెగా హీరోయిన్ అక్కర్లేదంటున్నాడు. యష్‌రాజ్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న 48 ఏళ్ల కింగ్ ఖాన్... ఓ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. బ్యాండ్ బాజా బారాత్ దర్శకుడు మనీష్ శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఓ మూవీ స్టార్ అభిమాని కథ ఇది. నా ఇరవయ్యేళ్ల కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదు. నాకిదో పెద్ద చాలెంజ్. ఇద్దరమ్మాయిలుండే ఈ చిత్రంలో బిగ్ లేడీ స్టార్ అవసరం లేదు’ అన్నాడు షారుఖ్. -
ఏకధాటిగా 15 గంటలు...
వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం లాంటివి పాత తరం నటీనటుల్లో పుష్కలం. ఈ తరం నటీనటుల్లో కూడా కొందరు తమ పూర్వీకులకు తాము తక్కువేమీ కాదని నిరూపిస్తున్నారు. తాజాగా హిందీ చలనచిత్ర సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ ఆ పనే చేశారు. ఆదిత్యా చోప్రా నిర్మాతగా, మనీశ్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యాన్'సినిమా కోసం ఆ పాత్రను పండించడానికి తన శాయశక్తులా శ్రమిస్తున్నారు. పేరుకు తగ్గట్లే ఈ సినిమాలో వీరాభిమాని పాత్రను పోషిస్తున్నారాయన. తాజాగా ఈ చిత్రం కోసం ఒక రోజు ఏకధాటిగా 15 గంటలు షూటింగ్లో పాల్గొని, చెమటోడ్చారు. ఆ సంగతి ఆయనే వెల్లడించారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం తన నిజజీవిత ఫ్యాన్స్‌కు అంకితమంటూ షారుఖ్ ప్రకటించారు కూడా! ఈ ఏడాది దీపావళికి ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం ద్వారా అభిమానుల్ని పలకరించనున్న షారుఖ్ ఆ తరువాత ‘ఫ్యాన్’తో అలరిస్తాడన్న మాట! ఎంతైనా, పడ్డ కష్టం వృథా పోదు కదా!