ఏకధాటిగా 15 గంటలు... | continuously 15 hours | Sakshi
Sakshi News home page

ఏకధాటిగా 15 గంటలు...

Published Wed, Sep 10 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

ఏకధాటిగా 15 గంటలు...

ఏకధాటిగా 15 గంటలు...

వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం లాంటివి పాత తరం నటీనటుల్లో పుష్కలం. ఈ తరం నటీనటుల్లో కూడా కొందరు తమ పూర్వీకులకు తాము తక్కువేమీ కాదని నిరూపిస్తున్నారు. తాజాగా హిందీ చలనచిత్ర సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ ఆ పనే చేశారు. ఆదిత్యా చోప్రా నిర్మాతగా, మనీశ్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యాన్'సినిమా కోసం ఆ పాత్రను పండించడానికి తన శాయశక్తులా శ్రమిస్తున్నారు. పేరుకు తగ్గట్లే ఈ సినిమాలో వీరాభిమాని పాత్రను పోషిస్తున్నారాయన. తాజాగా ఈ చిత్రం కోసం ఒక రోజు ఏకధాటిగా 15 గంటలు షూటింగ్‌లో పాల్గొని, చెమటోడ్చారు. ఆ సంగతి ఆయనే వెల్లడించారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం తన నిజజీవిత ఫ్యాన్స్‌కు అంకితమంటూ షారుఖ్ ప్రకటించారు కూడా! ఈ ఏడాది దీపావళికి ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం ద్వారా అభిమానుల్ని పలకరించనున్న షారుఖ్ ఆ తరువాత ‘ఫ్యాన్’తో అలరిస్తాడన్న మాట! ఎంతైనా, పడ్డ కష్టం వృథా పోదు కదా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement