Cases dropped
-
డయాగ్నస్టిక్ కంపెనీలకు ఇబ్బందే
ముంబై: వ్యాధి నిర్ధారణ సేవల్లోని కంపెనీల (డయాగ్నస్టిక్స్) ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం తగ్గొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా పరీక్షలు గణనీయంగా తగ్గిపోవడం ఆదాయాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున ఉండడంతో కంపెనీలు ఆదాయంలో 30 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. వైరస్ ప్రభావం క్షీణించడం, స్వయంగా పరీక్షించుకునే కిట్లకు ప్రాధాన్యం ఇస్తుండడం డయాగ్నస్టిక్స్ కంపెనీల ఆదాయాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సంరలో ప్రభావితం చేస్తుందన్నది క్రిసిల్ విశ్లేషణగా ఉంది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో కంపెనీల లాభాల మార్జిన్లు దశాబ్ద గరిష్టమైన 28 శాతానికి చేరుకోగా, అవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 24–25 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ తెలిపింది. ఆదాయం తగ్గడానికితోడు అధిక నిర్వహణ వ్యయాలు, ప్రకటనలు, మార్కెటింగ్‌పై అధిక వ్యయాలు లాభాల మార్జిన్లపై ప్రభావం చూపిస్తాయని వివరించింది. అయినప్పటికీ మెరుగైన నగదు ప్రవాహాలు, పటిష్ట మూలధన వ్యయ విధానాలు (ఎక్విప్మెంట్ తదితర), రుణ భారం తక్కువగా ఉండడం వంటివి ఈ రంగంలోని కంపెనీల బ్యాలన్స్ షీట్లను ఆరోగ్యంగానే ఉంచుతాయని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ఈ రంగంలోని 11 సంస్థల బ్యాలన్స్ షీట్లను క్రిసిల్ విశ్లేషించింది. పెరిగిన పోటీ.. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా టెస్ట్‌ల ద్వారా ఆదాయం మొత్తం ఆదాయంలో 20 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైనట్టు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కాకపోతే ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షల రూపంలో ఆదాయం 12–14 శాతం మేర పెరగడంతో ఈ ప్రభావాన్ని చాలా వరకు అవి అధిగమిస్తాయని చెప్పారు. ఆన్లైన్ ఫార్మసీ సంస్థలు ల్యాబ్ టెస్ట్‌లను కూడా ఆఫర్ చేస్తుండడంతో ఈ రంగంలో పోటీ పెరిగినట్టు క్రిసిల్ వెల్లడించింది. కాకపోతే వైద్యులు సూచించే పరీక్షలకు ఆన్లైన్ సంస్థల నుంచి పోటీ ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ‘‘ఆన్లైన్ సంస్థలు సొంతంగా సదుపాయాలపై పెట్టుబడులు పెట్టుకుండా, స్థానిక వ్యాధి నిర్ధారణ కేంద్రాలతో టైఅప్ పెట్టుకుని కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే మార్కెట్లో నిలదొక్కుకున్న సంప్రదాయ డయాగ్నస్టిక్ సంస్థలు డిజిటల్ సదుపాయాలు, రోగి ఇంటికి వెళ్లి నమూనాల సేకరణకు పెట్టుబడులు పెంచాల్సిన పరిస్థితులను కల్పిస్తోంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. భవిష్యత్తులో మరోసారి కరోనా వైరస్ మరింత తీవ్రరూపం దాల్చడం, ఆన్లైన్ సంస్థల నుంచి పెరిగే పోటీ, మార్కెట్ వాటా పెంచుకోవడాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. -
అసోంలో 15 నుంచి కరోనా ఆంక్షల ఎత్తివేత
గౌహతి: రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఫిబ్రవరి 15 నుంచి ఎత్తేయాలని అసోం నిర్ణయించింది. కరోనా విజృంభణ, కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం హిమంత బిశ్వశర్మ సోమవారం మీడియాకు వెల్లడించారు. వచ్చే రెండు నెలల వ్యవధిలో స్కూలు బోర్డు పరీక్షలు, మున్సిపల్ తదితర ఎన్నికలు షెడ్యూల్ మేరకే జరుగుతాయని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్లంతా వ్యాక్సిన్ రెండు డోసులు విధిగా వేసుకోవాలన్నారు. ‘‘ఇక రాత్రి కర్ఫ్యూలుండవు. షాపింగ్, సినిమా మాల్స్ పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. పెళ్లిళ్లు, వేడుకలను రాత్రిళ్లు కూడా జరుపుకోవచ్చు. వాటిలో పాల్గొనే వాళ్లంతా విధిగా రెండు డోసులూ వేసుకోవాలి. మాస్కు ధరించాలి.’’ అని వివరించారు. దేశంలో 83,876 కేసులు దేశవ్యాప్తంగా సోమవారం 83,876 కొత్త కరోనా కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో 515 కేరళలో, 66 మహారాష్ట్రలో జరిగాయి. ఒమిక్రాన్ విజృంభణ తర్వాత గత 32 రోజుల్లో రోజువారీ కరోనా కేసులు లక్ష కంటే తగ్గడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,2,72,014కు, మరణాలు 5,02,874కు చేరాయి. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 11,08,938కి తగ్గాయి. కోవిడ్ రికవరీ రేటు 96,19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది. -
పండుగలపై పానసోనిక్ ఆశలు
కోల్‌కతా: కరోనా కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పండుగ సీజన్లో అమ్మకాలు మెరుగ్గా ఉండగలవని పానసోనిక్ ఇండియా ఆశిస్తోంది. గతేడాది జూన్–సెపె్టంబర్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో విక్రయాలు 18 శాతం పెరిగాయని సంస్థ చైర్మన్ మనీష్ శర్మ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో తమ గ్రూప్ సంస్థ పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా నెలకొల్పిన ఎలక్ట్రికల్ పరికరాలు, వైరింగ్ డివైజ్‌ల ఉత్పత్తి ప్లాంటు త్వరలో అందుబాటులోకి రాగలదని ఆయన పేర్కొన్నారు. -
Andhra Pradesh: 10 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత రెండు వారాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. చాలా జిల్లాల్లో కేసుల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. ఒకానొక దశలో 24 వేలకుపైగా కేసులు వచ్చిన విషయం తెలిసిందే. గురువారం ఆ సంఖ్య 16 వేలకు తగ్గిందంటే వైరస్ తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయడం, కోవిడ్ నిబంధనలు పాటించడం వంటి వాటితో 10 జిల్లాల్లో కోవిడ్ తగ్గుముఖం పట్టింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు మినహా మిగతా 10 జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు 7 వారాల సగటు లెక్కిస్తే.. ఈ 10 జిల్లాల్లో కరోనా వైరస్ దాదాపు అదుపులోకి వచ్చినట్టు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు 104 కాల్‌సెంటర్‌కు వచ్చే కాల్స్ తగ్గడం, ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకల లభ్యత పెరగడం వంటివి కోవిడ్ తగ్గుముఖాన్ని సూచిస్తున్నాయి. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 6వ వారం (మే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు)తో పోలిస్తే 7వ వారం (మే 17 నుంచి 23 వరకు) కేసులు బాగా తగ్గాయి. ఒకదశలో ఎక్కువగా కేసులు నమోదైన గుంటూరు జిల్లాలో గత 3 వారాలతో పోల్చినా తక్కువ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో మే 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వచ్చిన కేసులతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గాయి. శ్రీకా>కుళం జిల్లాలో గత వారంతో పోలిస్తే కేసులు కొద్దిగా పెరిగినా.. నాలుగు వారాల కేసులను పరిగణనలోకి తీసుకుంటే భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రకాశం జిల్లాలో మే 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వచ్చిన కేసులను పోలిస్తే ఇప్పుడు నిలకడగా ఉన్నట్టు తేలింది. నెల్లూరులో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మూడు వారాలుగా (ఏప్రిల్ 26 నుంచి మే 16 వరకు) నమోదైన కేసులతో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గాయి. కృష్ణాజిల్లాలో తగ్గుముఖం పట్టకపోయినా కేసులు నిలకడగా ఉన్నట్టు తేలింది. కర్నూలు జిల్లాలో 5వ వారం (మే 3 నుంచి 9 వరకు) భారీగా కేసులు నమోదయ్యాయి. దీంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గాయి. వైఎస్సార్ కడప జిల్లాలో గత వారంతో పోలిస్తే మే 17 నుంచి 23 వరకు ఏ జిల్లాలోనూ లేనంతగా కేసులు తగ్గాయి. విజయనగరం జిల్లాలో కేసులు గత రెండు వారాలతో పోలిస్తే నిలకడగా ఉన్నాయి 7వ వారంలో ఈ మూడు జిల్లాలోనూ తగ్గిన కేసులు ప్రస్తుతం మూడు జిల్లాలోనే కేసులు బాగా కొనసాగుతున్నాయి.తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. కానీ మే 20 నుంచి 26 మధ్య కాలంలో నమోదైన కేసులపరంగా చూస్తే ఈ మూడు జిల్లాలోనూ కేసులు తగ్గాయి. 6వ వారంతో పోలిస్తే ఈ మూడు జిల్లాల్లోను 7వ వారంలో కేసులు తగ్గాయి. దీన్నిబట్టి చూస్తే దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్టు భావిస్తున్నారు. గ్రామాల్లోనే కేసులు తక్కువ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయి. టెస్టుల సంఖ్యను బట్టి చూసినా, జనాభాను బట్టి చూసినా గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణాల్లోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 57 రోజుల్లో (ఏప్రిల్ 1 నుంచి మే 27 వరకు) గ్రామీణ ప్రాంతాల్లో 23.98 లక్షలకుపైగా టెస్టులు చేశారు. 4.09 లక్షల మందికి (17.1 శాతం) పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో పట్టణాల్లో 14.10 లక్షల టెస్టులు జరిగాయి. 3.31 లక్షల (23.5 శాతం) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 70.54 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 29.46 శాతం మంది పట్టణాల్లో ఉన్నారు. జనాభా లెక్కన చూసినా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో పాజిటివిటీ రేటు 6.4 శాతం ఎక్కువగా నమోదైంది. గ్రామాల్లో ఫీవర్ సర్వే, టెస్టులు ఎక్కువగా చేస్తున్నారు. జనాభాతో పోల్చుకుంటే పల్లెల్లో వచ్చిన కేసులు ఎక్కువేమీ కాదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. -
మనోడైతే నో కేస్
-
మనోడైతే నో కేస్
-
మనోడైతే నో కేస్
♦ టీడీపీ నేతలపై కేసుల ఎత్తివేత ♦ పాతకేసులు ఎత్తేస్తూ మూడేళ్లలో 132 జీవోలు ♦ కేసులు తొలగినవారిలో స్పీకర్ కోడెల ♦ మండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కూడా.. ♦ మంత్రులు దేవినేని, కొల్లు, అచ్చెన్నాయుడుకు ఊరట ♦ ప్రతిపక్షంలో ఉండగా కేసు.. పార్టీ మారితే ఉపసంహరణ సాక్షి, అమరావతి : ప్రతిపక్షం చేస్తున్న ప్రజా పోరాటాలను కర్కశంగా అణచివేయడం చూస్తున్నాం.. ప్రత్యేకహోదా సాధన కోసం జరిగే కొవ్వొత్తుల ర్యాలీకి సంఘీభావం తెలపడానికి వెళుతున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టులో రన్‌వేపైనే అడ్డగించడం చూశాం.. మహిళా పార్లమెంటు కు హాజరుకానీయకుండా ఎమ్మెల్యే రోజాను మాయమాటలు చెప్పి విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుని దారులు మార్చి హైదరాబాద్‌కు తరలించడం చూశాం.. ప్రయాణీకుల తరఫున మాట్లాడి వారి సమస్యలు తీర్చడం కోసం ప్రయత్నించిన ఎంపీ మిథున్ రెడ్డి విమానాశ్రయ మేనేజర్‌పై దాడి చేసినట్లు అక్రమ కేసు బనాయించడం చూశాం... కృష్ణాజిల్లా బస్సు ప్రమాద మృతులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్షనేత అక్కడ అవకతవకలపై నిలదీస్తే కలెక్టర్‌కు అడ్డుతగిలారంటూ బూటకపు కేసులు పెట్టడం చూశాం.. అదేసమయంలో మరోవైపు టీడీపీ నేతలు అధికారులపై దాడులు చేసినా.. ఇసుక, మట్టి వంటి సహజవనరులను దోచుకుంటూ అధికారులను బెదిరించినా, ఏర్పేడు వంటి ఘటనల్లో ఎంతో మంది మరణానికి కారకులైనా.. బాలసుబ్రహ్మణ్యం వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులపై నడిరోడ్డుపైనే దాడి చేసి బెదిరించినా కనీసం కేసులు పెట్టని పరిస్థితి. వనజాక్షి నుంచి బాలసుబ్రహ్మణ్యం వరకు అధికారులపై ఎలాంటి దాడులకు దిగుతున్నారో చూశాం. కానీ అధికారపక్షం ఇంతటితో ఆగడం లేదు... మనోడేనా అయితే కేసూ గీసూ లేదు.. తీసేయమంటూ బరితెగిస్తోంది. అందుకోసం ప్రత్యేక జీవోలు జారీ చేస్తోంది. మూడేళ్లలో ఏకంగా 132 జీవోలు జారీ చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కేసుల తొలగింపు ఈ స్థాయిలో జరగడం ఎప్పుడూ ఎరగమని అధికారు లంటున్నారు. ఎందరో ప్రముఖులు.. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై నరసారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన మూడు కేసులు, శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యంపై ఉన్న కేసు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై ఉన్న రెండు కేసులు, మంత్రులు దేవినేనిపై ఐదు కేసులు, కొల్లు రవీంద్రపై మూడు కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవోలిచ్చింది. వారితోపాటు మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులను ఎత్తివేశారు. పోలింగ్ నిలిపేసిన దేవినేని మూలపాడు పంచాయతీ ఎన్నికల్లో ఆందోళనకు దిగి రెండు గంటలపాటు పోలింగ్ నిలిచిపోయేలా వ్యవహరించి, ఉద్రిక్తత పరిస్థితికి కారణమైన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై 2013లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నమోదైంది. దీనితోపాటు విజయవాడ పటమట, భవానీపురం, గన్నవరం పోలీస్ స్టేషన్లలో 178/2014, 959/2012, 403/2013, 93/2005 క్రైమ్ నెంబర్లతో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తూ 2015 జూన్ 4న జీవో నెంబర్ 647 జారీ చేసింది. టీడీపీలోకి ఫిరాయిస్తే: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గా ఉన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో పాటు మరో 20 మందిపై 2014 జూన్ 30న గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కుట్రపూరి తంగా గుమిగూడి, ప్రభుత్వ ఆస్తులను, తగలబెట్టడం కారణాలు చూపి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మరో 20 మందిపై గిద్దలూరు పోలీసులు వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ఆయన టీడీపీలో చేరడంతో ప్రభుత్వం కేసును ఉపసంహరించు కుంటూ జీవో.379ను జారీ చేశారు. పోలీసులపై దాడి చేసిన కోడెల ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన అనుచరులతో నరసరావుపేటలో 2009లో ధర్నా చేయడంతో అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కోడెల అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను నెట్టడం, పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వడం, విధులకు ఆటంకం కల్పించిన అభియోగాలపై కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్లతోపాటు 353 నాన్‌బెయిలబుల్ సెక్షన్‌పై కేసు పెట్టడంతోఅప్పట్లో కోడెల గుంటూరు సబ్‌జైలులో కొద్ది రోజులు రిమాండ్‌లో ఉన్నారు. ఆ కేసులను బాబు అధికారంలోకి వచ్చాక ఎత్తేసింది. ఇలాంటి ఉదాహరణలెన్నో.. మహిళపై దాడి చేసిన అచ్చెన్నాయుడు 2008 ఆగస్టు 11న కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సర్పంచ్ కింజరాపు గణేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులు దీన్ని అడ్డుకున్నారు. పాఠశాల ఆవరణలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని పట్టుబట్టారు. ఘర్షణ చోటు చేసుకో వడంతో సర్పంచ్ గణేశ్వరరావు కుమార్తె మేనకపై అచ్చెన్నాయుడు దాడి చేసి అవమానపరిచారు. ఆయనపై ఎఫ్ఐ ఆర్ నంబర్ 150/2008 ప్రకారం 354, 323, 506(1) అండ్ (2) రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం మహిళను అవమానపరచే విధంగా ప్రవర్తించడం, శారీరకంగా గాయపరచడం, బెదిరించి చనిపోయే విధంగా దాడి చేయడం ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. -
మంత్రా.. మజాకా!
► గంటాపై ‘తుంపాల షుగర్ ఫ్యాక్టరీ’ కేసుల ఎత్తివేత ► ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ► రైతులపై మాత్రం కొనసాగుతున్న కేసులు సాక్షి, విశాఖపట్నం: మొన్న మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు.. నేడు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు. గతంలో తమపై నమోదైన కేసుల నుంచి విజయవంతంగా బయటపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా అచ్చెన్నాయుడుపై నమోదైన కేసులను మూడు నెలల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేసింది. తాజాగా రాష్ర్ట మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావుపై తుంపాల షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన ఆందోళనలో నమోదైన కేసులనూ ఎత్తివేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి మన్మోహన్సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో ఉన్న రైతు నాయకులు, రైతులు మాత్రం ముందస్తు బెయిల్‌పై ఉండటం గమనార్హం. గంటా పిలుపుతో రైతుల ఆందోళన గంటా 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొద్ది కాలానికి రైతులకు బకాయిల చెల్లింపు, క్రషింగ్ విషయంలో తుంపాల షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. పెద్దసంఖ్యలో హాజరైన రైతులు ఫ్యాక్టరీ ఆవరణలో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి కోరగా...అందుకు అప్పటి ఫ్యాక్టరీ ఎండీ సత్యనారాయణ నిరాకరించారు. గంటా గేట్లు తోసుకుంటూ ముందుకువెళ్లగా ఆయన వెంట మిగిలిన రైతులంతా కదిలారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బయటనుంచి కొంతమంది రాళ్లు విసిరిన ఘటనలో అనకాపల్లి రూరల్ ఎస్ఐ విద్యాసాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ ఫిర్యాదుతో గంటాతో పాటు 27 మందిపై అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో (క్రైం నం.15/2009) హత్యాయత్నం (307) సహా 147, 148, 332, 333, 447, 188, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్టు 1984 కింద కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మెల్యే కావడంతో గంటాను ఏ-11 ముద్దాయిగా చేర్చారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన గంటా మంత్రి పదవి చేపట్టారు. తొలినుంచీ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సాహసించని పోలీసులు చార్జిషీట్లో అబ్స్కాండింగ్ (తప్పించుకుని తిరుగుతున్నట్టు)గా పేర్కొంటూ వచ్చారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ సహా మొత్తం 13 మందిని విడతల వారీగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించగా బెయిల్‌పై విడుదలయ్యారు. ఒకరు మృతి చెందగా గంటాతో పాటు మిగిలిన వారిని రెండు నెలల క్రితం వరకు అబ్స్కాండింగ్గానే చూపించారు. వీరిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించడంతో గంటా మినహా మిగిలిన రైతులంతా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని కోర్టులో సరెండర్ అయ్యారు. టీడీపీలో మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి తనపై ఉన్న కేసులను ఎత్తి వేయించుకునేందుకు గంటా కృషి కొనసాగించారు. ఆయనపై కేసులను ఎత్తి వేయాలంటూ హోం మంత్రి చినరాజప్ప 2015 ఆగస్టు 28న డీఐజీకి సిఫారసు చేశారు. ఎల్ఆర్ఆర్‌సీ నం. 89/సీ1/2015తో 2015 నవంబర్ 11న గంటాపై కేసులు ఎత్తివేసేందుకు డీజీపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. డీజీపీ సిఫారసు మేరకు మంత్రి గంటాపై ఉన్న కేసులను ఎత్తివేస్తూ.. ఆయనపై ఇక ఎలాంటి ప్రాసిక్యూషన్ జరపరాదంటూ ప్రిన్సిపల్ కార్యదర్శి శుక్రవారం జీఓ.ఆర్టీ నం.143ను జారీ చేశారు. రగిలిపోతున్న రైతులు గంటాపై కేసుల ఎత్తివేతతో ఇదే కేసులో ఉన్న మిగిలిన రైతులు మండిపడుతున్నారు. ఆయన పిలుపుతోనే నాటి ఆందోళనలో తామంతా పాల్గొన్నామని, ఇప్పుడు తమను వదిలేసి తనపై ఉన్న కేసులను మాత్రమే ఉపసంహరింప చేయించుకోవడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు. ప్రజాప్రతినిధికొక రూల్...సామాన్యులకు మరో రూలా? అని ప్రశ్నిస్తున్నారు. తమపై కూడా కేసులను పూర్తిగా ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.