Panasonic India
-
పండుగలపై పానసోనిక్ ఆశలు
కోల్‌కతా: కరోనా కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పండుగ సీజన్లో అమ్మకాలు మెరుగ్గా ఉండగలవని పానసోనిక్ ఇండియా ఆశిస్తోంది. గతేడాది జూన్–సెపె్టంబర్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో విక్రయాలు 18 శాతం పెరిగాయని సంస్థ చైర్మన్ మనీష్ శర్మ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో తమ గ్రూప్ సంస్థ పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా నెలకొల్పిన ఎలక్ట్రికల్ పరికరాలు, వైరింగ్ డివైజ్‌ల ఉత్పత్తి ప్లాంటు త్వరలో అందుబాటులోకి రాగలదని ఆయన పేర్కొన్నారు. -
అతి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. 'పీ95' పేరుతో ఎంట్రీ లెవల్ 4 జీ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. బ్లూ, గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.4,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్లో లభిస్తున్నది. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ సైట్లో జరగనున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను వెయ్యి రూపాయల తగ్గింపు ధరతో వినియోగదారులు అంటే.. 3,999 రూపాయలకే కొనుగోలు చేసుకునే అవకాశం. బడ్జెట్ ధరలో లక్షలమంది వినియోగదారులకు తమ స్మార్ట్‌ఫోన్ ఆకర్షిస్తుందనే విశ్వాసాన్ని పానసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్, పంకజ్ రాణా వ్యక్తం చేశారు. పానసోనిక్ పీ95 ఫీచర్లు 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్ 1జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 2300 ఎంఏహెచ్ బ్యాటరీ. -
బిగ్ డిస్ప్లే, బడ్జెట్ ధరలో పానాసోనిక్ కొత్త ఫోన్
తాజాగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫుల్ స్క్రీన్ మొబైల్ ఫోన్ల హవా బాగా నడుస్తోంది. కంపెనీలూ కూడా ఈ డిస్ప్లే ఫోన్లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. పానాసోనిక్ కంపెనీ కూడా బడ్జెట్ ధరలోనే 18:9 రేషియోతో ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే ఫోన్ ‘పి101’ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 6,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఆఫ్‌లైన్ రిటైలర్ సంగీత మొబైల్స్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను పానాసోనిక్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన తన కస్టమర్లకు ఐడియా సెల్యులార్ 60జీబీ డేటాను అందిస్తోంది. రూ.199 రీఛార్జ్‌పై 28 రోజుల పాటు అందనంగా 10జీబీ డేటా చొప్పున ఆరు సార్లు ఆఫర్ చేయనుంది. అదనంగా ఐడియా యూజర్లకు రూ.2000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది. పానాసోనిక్ పీ101 స్పెషిషికేషన్లు 5.45 అంగుళాల బిగ్ వ్యూ ఐపీఎస్ డిస్ప్లే విత్ 2.5 కర్వ్డ్ స్క్రీన్ డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ 7.1 నోగట్ 1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ 6737 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత స్టోరేజీ 128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీ పెంపు వెనుకవైపు 8 మెగాపిక్సల్ ఆటోఫోకస్ కెమెరా ఫ్లాష్ ముందువైపు 5 మెగా పిక్సల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ 4జీ వోల్టేకు సపోర్ట్ 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ బరువు 145 గ్రాములు -
భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన ధర: కొత్త మొబైల్
సాక్షి,న్యూఢిల్లీ: పానసోనిక్ ఇండియా కొత్త మొబైల్‌లాంచ్ చేసింది. బడ్జెట్ ధర సెగ్మెంట్లో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారతీయులకు అందుబాటులోకి తెచ్చింది. ఎలుగా సిరీస్‌లో భారీ బ్యాటరీతో అందుబాటు ధరలో ‘ఎలుగా ఎ 4’ పేరుతో సోమవారం దీన్ని మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.12,490గా వెల్లడించింది. ‘ఎలుగా ఎ 4’ ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 1.25 గిగి హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాససర్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే అవకాశం 5000 ఎంఏహెచ్‌బ్యాటరీ అత్యాధునిక చిప్‌తో రూపొందించి, సరసమైన ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని పానసోనిక్ ఇండియా బిజినెస్హెడ్ పంకజ్ రానా ప్రకటించారు. త్రీ కలర్ వేరియంట్స్‌లో భారత్ అంతా తమ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. -
పానాసోనిక్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: పానాసోనిక్ ఇండియా తాజాగా ‘ఎలూగ ఐ4’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.8,290గా ఉంది. ఇందులో 5 ఎంపీ సెల్పీ కెమెరా, 8 ఎంపీ రియర్ కెమెరా, మెటల్ యూనీ బాడీ డిజైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్– ఎర్బో, 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్, 4జీ వీవోఎల్టీఈ, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఓటీజీ సపోర్ట్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. -
పానాసోనిక్ పి-సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్
ధర శ్రేణి రూ.7,490-రూ.8,190 న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘పానాసోనిక్ ఇండియా’ తాజాగా తన పి-సిరీస్‌లోనే ‘పి 71’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది వినియోగదారులకు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 1 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.7,490గా, 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.8,190గా ఉంది. వీటిల్లో డ్యూయెల్ సిమ్, 4జీ, 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 1.25 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆండ్రారుుడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.