
సాక్షి, ముంబై: ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. 'పీ95' పేరుతో ఎంట్రీ లెవల్ 4 జీ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. బ్లూ, గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.4,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో జరగనున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను వెయ్యి రూపాయల తగ్గింపు ధరతో వినియోగదారులు అంటే.. 3,999 రూపాయలకే కొనుగోలు చేసుకునే అవకాశం. బడ్జెట్ ధరలో లక్షలమంది వినియోగదారులకు తమ స్మార్ట్‌ఫోన్ ఆకర్షిస్తుందనే విశ్వాసాన్ని పానసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్, పంకజ్ రాణా వ్యక్తం చేశారు.
పానసోనిక్ పీ95 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్
1జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
8 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2300 ఎంఏహెచ్ బ్యాటరీ.
Comments
Please login to add a commentAdd a comment