ఉత్సాహంగా ఓనం సంబరాలు | onam celebrations | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఓనం సంబరాలు

Published Wed, Sep 14 2016 5:58 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

ఉత్సాహంగా ఓనం సంబరాలు

ఉత్సాహంగా ఓనం సంబరాలు

కేరళ సాంప్రదాయ ఓనం వేడుకలను మంగళవారం పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులోని సెవెన్‌డేస్‌ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. రంగవల్లులతో వేదిక ప్రాంతాన్ని చూడముచ్చటగా అలంకరించారు. కేరళ సాంప్రదాయ దుస్తులు ధరించిన స్త్రీలు, పురుషులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. వేడుకల నిర్వాహకుడు సునీల్‌ నాయర్‌ మాట్లాడుతూ కేరళలో ఈ ఉత్సవాలను పది రోజులపాటు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. కేరళలో మంగళవారం ఓనం వేడుకలు ప్రారంభమవుతాయని, చాలామంది అక్కడికి వెళ్లారని, ఇక్కడ ఉన్నవారి కోసం ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం కేరళ సాంప్రదాయ వంటకాలతో భోజనాలు చేశారు.  సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో నంబియార్, పంకజా„ì , మధుస్వామితోపాటుగా అధిక సంఖ్యలో కేరళకు చెందినవారు పాల్గొన్నారు.      – విజయవాడ (మొగల్రాజపురం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement