నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఓనం పండుగ ఉత్సాహంగా జరిగింది. స్థానిక తిరుమల నర్సింగ్ కళాశాలలో చదువుకునే కేరళకు చెందిన విద్యార్థినులు బుధవారం సంప్రదాయ బద్ధంగా ఓనం పండుగను జరుపుకున్నారు. వారితో మణిపూర్ విద్యార్థినులు జతకట్టారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన బలి చక్రవర్తి కథా రూపకం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థినులంతా కలసి ఆడిపాడారు. ఈ కళాశాలలో ఓనం ఉత్సవం ఏటా ఘనంగా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
నిజామాబాద్, ఓనం, కేరళ విద్యార్థినులు,
డిచ్‌పల్లిలో ఉత్సాహంగా ఓనం పండుగ
Published Wed, Sep 14 2016 5:13 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement