kerala students
-
కోవిడ్‌ను జయించిన కేరళ విద్యార్థిని
తిరువనంతపురం: కేరళకు చెందిన వైద్య విద్యార్థిని భారత్‌లో కోవిడ్ సోకిన తొలివ్యక్తి. 39 రోజుల పాటు ఆమెను విడిగా నిర్బంధంలో ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతురాలై డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ బట్టబయలైన చైనాలోని వూహాన్ యూనివర్సిటీ వైద్య విద్యార్థిని, 20 ఏళ్ల వయసున్న ఆమె ఎన్డీటీవీతో పంచుకున్న మనోగతం ఆమె మాటల్లోనే. ‘నాకు కోవిడ్ సోకిందని జనవరి 30న వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. వెంటనే నాతో పాటు ప్రయాణించిన నా స్నేహితులందరికీ ఫోన్లు చేసి ఆరోగ్య శాఖ అధికారుల్ని సంప్రదించాలని చెప్పాను. ఆ తర్వాత వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నా. నేను చైనాలో ఉన్నప్పుడు చూశాను. ఈ వ్యాధి నుంచి బయటపడడం అంత కష్టం కాదు. అందులోనూ నేను శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాను. కానీ అందరికీ దూరంగా, ఎవరితోనూ సంబంధాలు లేకుండా అన్ని రోజులు ఏకాంతంగా ఉండడం అంత సులభం కాదు. అయితే ఈ అంశంలో నాకు వైద్యులు బాగా సహకరించారు. అత్యుత్తమమైన చికిత్స ఇచ్చారు. ఇంటికి వచ్చాక నేను మానసికంగా దెబ్బ తినకుండా కౌన్సెలర్లు తరచూ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ఎప్పటికప్పుడు నాలో ధైర్యాన్ని నింపారు. ఆమె మా అమ్మతో స్వయంగా మాట్లాడి భరోసా నింపారు. చైనాలో జనవరి 13 నుంచి మా విశ్వవిద్యాలయంకు దాదాపు నాలుగు వారాల పాటు సెలవులు ఇచ్చారు. అప్పుడంతా బాగానే ఉంది. కానీ మూడు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. వీధుల్లో స్థానికులు అందరూ మాస్క్‌లు ధరించి కనిపించారు. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది. భారత రాయబార కార్యాలయం మా అందరినీ వెనక్కి తీసుకువచ్చింది. మా క్లాస్‌లో 65 మంది విద్యార్థులు ఉంటే అందులో 45 మంది భారతీయులమే. ప్రస్తుతం మేమంతా ఆన్లైన్లో క్లాస్‌లకు అటెండ్ అవుతున్నాం’ అని ఆ విద్యార్థిని తన అనుభవాలను వివరించారు. -
భారత్‌లో... తొలి కరోనా కేసు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గురువారం భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ యువతిని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. తదుపరి పరీక్షల అనంతరం శుక్రవారం పేషెంట్‌కి సంబంధించిన తుది నివేదికను వెల్లడిస్తామని ఐసీఎంఆర్ – ఎన్ఐవి పూణె డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి దేశంలోని పలు నగరాల్లో అనుమానిత కేసులు నమోదయ్యాయి. కానీ వైరస్ సోకినట్లు ధ్రువీకరించిన తొలి కేసు ఇదే. కేరళ వైద్యాధికారులు బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం 800 మందిని పలు ఆసుపత్రుల్లో పరిశీలనలో ఉంచారు. చైనా నుంచి భారతీయులు వెనక్కి చైనాలోని వుహాన్ నుంచి భారతీయులను తిరిగి వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న హ్యుబయి రాష్ట్రం నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించేందుకు రెండు విమానాలకు అనుమతినివ్వాలని చైనాను భారత్ కోరింది. అందుకు చైనా ఓకే చెప్పిందని వూహాన్‌లోని భారత ఎంబసీ తెలిపింది. చైనా నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామని తెలిపింది. భారీగా నిధులు వెచ్చిస్తోన్న చైనా చైనాలో కరోనా వైరస్ బారినపడి 170 మంది మరణించారు. మరో 7,711 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల నిధులను చైనా ప్రభుత్వం కేటాయించింది. ఈ వైరస్‌పై యుద్ధానికి ఆర్థిక వనరుల లోటు రాకూడదని చైనా భావిస్తోంది. అలాగే వైరస్‌ని నివారించే వాక్సిన్ని కనుగొనే ప్రయత్నంలో భాగంగా పరిశోధనలకు సైతం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. -
భారత్‌లోకి ప్రవేశించిన ‘కరోనా’
తిరువనంతపురం : ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. ఆ విద్యార్థి కి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆ విద్యార్థికి కేరళోని ఓ హాస్పిటల్లో ప్రత్యేక విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది. అయితే ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అబ్జర్వేషన్లో ఉంచి పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఆ విద్యార్థి చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నారు. మరోవైపు చైనాలో చదువుకుంటున్న 23వేలకు పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే చైనా నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించటానికి ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేకంగా థర్మల్ స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వారి వివరాలు నమోదు చేసుకుని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి బారినపడి చైనాలో 170 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. చదవండి : కరోనా.. పెరుగుతున్న అనుమానితుల సంఖ్య కరోనా పరీక్షలు ఇక ‘గాంధీ’లోనే -
నీట్ రాయడానికి లోదుస్తులు విప్పించారు
పాలక్కడ్: వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌కు హాజరైనప్పుడు లోనికి అనుమతించే ముందు తన లోదుస్తులు విప్పించారని కేరళ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 6న కొప్పాలోని లయన్స్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. బాధితురాలితో పాటు మరికొందరు లోదుస్తుల్లో కూడా లోహపు భాగాలున్నాయంటూ వాటిని విప్పించటం వివాదాస్పదమైంది. పరీక్ష రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్ వ్యవహరించిన తీరు కూడా తీవ్ర ఇబ్బందికి గురిచేసిందని ఆమె ఆరోపించింది. ‘ఇన్విజిలేటర్ చాలాసార్లు ఆమె ముందు నిలబడి ముఖాన్ని కాకుండా ఛాతీని చూస్తూ ఉన్నాడు. ఆమె ప్రశ్నా పత్రంతో కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పరీక్ష రాయడం తనకు ఇబ్బందిగా మారింది’ అని బాధితురాలి సోదరి మీడియాకు వెల్లడించింది. కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించామని, ఇదే పాఠశాలలో పరీక్షకు హాజరైన ఇతర విద్యార్థులతో మాట్లాడుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సీబీఎస్ఈ ప్రాంతీయ అధికారి తరుణ్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా మే 6న నీట్‌ను సీబీఎస్ఈ నిర్వహించింది. -
ఒకటికి ఏడు పనులు చేసే యంత్రం
వరి సాగులో నాటు దగ్గరి నుంచి వివిధ దశల్లో అనేక పనులను ఒకే ఒక్క చిన్నపాటి యంత్రంతో చేయగలిగితే? అది నిజంగా అద్హుతమే. వరి సాగు ఖర్చులు తలకు మించిన భారంగా పరిణమిస్తున్న ఈ తరుణంలో రైతుకు నిజంగా వరమే అవుతుంది. కన్నూరు(కేరళ)లోని సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఒకటికి ఏడు పనులను చేసే ఇటువంటి అద్భుత యంత్రాన్ని ఇటీవల ఆవిష్కరించారు. వరి పొలంలో దమ్ము చేయటం, వరి నాట్లు వేయడం నుంచి పొలంలోకి నీరు తోడటం, వరి కోతలు కోయడం, ధాన్యం నూర్పిడి చేయడం, తూర్పారబట్టడం, ధాన్యాన్ని బియ్యంగా మార్చడం.. వంటి ఏడు రకాల పనులను ఈ ఒక్క యంత్రం చేసేస్తుంది. మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు అభిషై, లిపిన్, రిజున్, అక్షయ్ బృందం ఈ యంత్రానికి రూపకల్పన చేసింది. అభిషై బృందం స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేసి పేటెంట్ కోసం ధరఖాస్తు చేసింది. ఈ బహుళ ప్రయోజనకర వ్యవసాయ యంత్రం బ8రువు మొత్తం కలిపితే 624 కిలోలు మాత్రమే. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తేగల పారిశ్రామికవేత్త కోసం వెదుకుతున్నామని అభిషై ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఏదేమైనా 4 నెలల్లో రైతులకు అందుబాటులోకి తేవాలని ఆశిస్తున్నామన్నారు. వరి రైతుకు ఖర్చు తగ్గి నికరాదాయం మూడు రెట్లు పెరుగుతుందన్నారు. వానపాముల మాదిరిగా రైతుకు ఎంతో మేలు చేసే ఈ యంత్రానికి ‘మన్నిర’(మళయాళంలో వానపాము) అని పేరు పెట్టామని అభిషై(80758 36523, 94951 24870) ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 15 హెచ్‌పి సామర్థ్యం గల పాత ఇంజిన్‌ను ఉపయోగించి ప్రొటోటైప్‌ను రూపొందించారు. కొత్త ఇంజిన్‌తో తయారు చేస్తే ఈ డీజిల్ యంత్రం ఖరీదు రూ. 2.5 లక్షల వరకు ఉండొచ్చట. రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ యువ ఇంజినీర్లకు ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది! యంత్రాన్ని ఆవిష్కరించిన విద్యార్థుల బృందం -
కేరళ విద్యార్థుల సంచలన నిర్ణయం
తిరువనంతపురం : రోజు ఏదో ఒక చోట కులం, మతం పేరిట గొడవ పడే రోజుల్లో కేరళ విద్యార్థులు కుల, మత, రహిత సమాజం వైపు తొలి అడుగు వేశారు. బుధవారం ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఈ విషయాలను బహిర్గతం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌లో మంత్రి సి రవీంద్రనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ఇప్పటి వరకూ కేరళ వ్యాప్తంగా 1.24 లక్షల మంది విద్యార్థులు తాము ఏ కులానికి, మతానికి చెందమని పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఒకటో తరగతి నుంచి 10 తరగతి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 9వేల పాఠశాలల్లో సేకరించిన సమాచారం ప్రకారం పాఠశాల అడ్మిషన్లలో 1,23,630 మంది కులం, మతం పేరును నింపలేదని మంత్రి తెలియచేశారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ చదువుతున్న వారిలో మొదటి సంవత్సరంలో 278 మంది, ద్వితీయ సంవత్సరంలో 239 మంది తాము ఏకులానికి మతానికి చెందిన వారిమి కాదంటూ తమ అడ్మిషన్లలో పేర్కొన్నారు. -
డిచ్‌పల్లిలో ఉత్సాహంగా ఓనం పండుగ
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఓనం పండుగ ఉత్సాహంగా జరిగింది. స్థానిక తిరుమల నర్సింగ్ కళాశాలలో చదువుకునే కేరళకు చెందిన విద్యార్థినులు బుధవారం సంప్రదాయ బద్ధంగా ఓనం పండుగను జరుపుకున్నారు. వారితో మణిపూర్ విద్యార్థినులు జతకట్టారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన బలి చక్రవర్తి కథా రూపకం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థినులంతా కలసి ఆడిపాడారు. ఈ కళాశాలలో ఓనం ఉత్సవం ఏటా ఘనంగా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్, ఓనం, కేరళ విద్యార్థినులు, -
నర్సింగ్ కాలేజీలో ఓనమ్ ఉత్సవాలు
డిచ్పల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా ఓనమ్ ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక కళాశాలలో కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో.. తోటి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ఓనమ్ పండగ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.