
తిరువనంతపురం : రోజు ఏదో ఒక చోట కులం, మతం పేరిట గొడవ పడే రోజుల్లో కేరళ విద్యార్థులు కుల, మత, రహిత సమాజం వైపు తొలి అడుగు వేశారు. బుధవారం ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఈ విషయాలను బహిర్గతం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌లో మంత్రి సి రవీంద్రనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ఇప్పటి వరకూ కేరళ వ్యాప్తంగా 1.24 లక్షల మంది విద్యార్థులు తాము ఏ కులానికి, మతానికి చెందమని పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఒకటో తరగతి నుంచి 10 తరగతి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 9వేల పాఠశాలల్లో సేకరించిన సమాచారం ప్రకారం పాఠశాల అడ్మిషన్లలో 1,23,630 మంది కులం, మతం పేరును నింపలేదని మంత్రి తెలియచేశారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ చదువుతున్న వారిలో మొదటి సంవత్సరంలో 278 మంది, ద్వితీయ సంవత్సరంలో 239 మంది తాము ఏకులానికి మతానికి చెందిన వారిమి కాదంటూ తమ అడ్మిషన్లలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment