ఇటానగర్: కులం, మతం ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ విడగొడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగుపెట్టిన సందర్భంగా దోయ్‌ముఖ్‌లో రాహుల్ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ దేశంలో విద్వేషం చిమ్మడమే బీజేపీ పని. తమ కులం, మతం గొప్పదంటూ దేశ ప్రజలు తమలో తాము ఘర్షణలుపడేలా బీజేపీ కుట్రలు చేస్తోంది. కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసమే బీజేపీ పనిచేస్తోంది.
జనం కష్టాలు ఆ పారీ్టకి పట్టవు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే వారి ఐక్యత కోసం కాంగ్రెస్ కృషిచేస్తోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర మార్గమధ్యంలో శనివారం పాపుం పరే జిల్లా గుండా అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగుపెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ నబాం టుకీ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. శనివారం ఒక్కరోజు మాత్రమే అరుణాచల్‌లో యాత్ర కొనసాగి ఆదివారం మళ్లీ అస్సాంలోకి అడుగుపెట్టనుంది
Comments
Please login to add a commentAdd a comment