![Real Anti Nationals Those Misusing Power To Divide Indians Sonia Gandhi - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/14/sonia-gandhi.jpg.webp?itok=OWXnYLjr)
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని పరస్కరించుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రస్తత ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమబద్దమైన దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని ఆమె పేర్కొన్నారు.
అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ది టెలిగ్రాఫ్‌లో వ్యాసం రాశారు సోనియా. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారతీయులను మతం, భాష, కులం, లింగం ఆధారంగా విభజిస్తున్న వారే నిజమైన జ్యాతి వ్యతిరేకులు(యాంటీ నేషనల్స్) అని సోనియా బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
'ఈ రోజు మనం బాబా సాహెబ్ వారసత్వాన్ని గౌరవిస్తున్నప్పుడు, రాజ్యాంగం విజయం.. దాన్ని అమలు చేసే పాలకులను ఎంచుకునే ప్రజలపైనే ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్ ఆనాడే చేసిన హెచ్చరికను గుర్తుంచుకోవాలి.' అని సోనియా అన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసి దాని పునాలుదైన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయాన్ని బలహీనపరుస్తోందని సోనియా ఫైర్ అయ్యారు. కొందరిని లక్ష‍్యంగా చేసుకుని రాజ్యాంగ సంస్థలతో దాడులు చేస్తున్నారని, కొంతమంది స్నేహితులకే ప్రయోజనం చేకూర్చుతున్నారని ఆరోపించారు.
చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్‌పై దాడికి కుట్ర.. అసద్ ఎన్‌కౌంటర్‌కు ముందు ఇంత జరిగిందా?
Comments
Please login to add a commentAdd a comment