భారతదేశానికి ‘కులం’ అనేది ఓ శాపం లాంటిది. కుల వ్యవస్థ... తద్వారా వచ్చిన సామాజిక అంతరాల వల్ల ఉత్పత్తి శక్తుల ప్రతిభ నిర్వీర్యమైంది. మని షిని మనిషిగా చూడ లేని దుర్మార్గ వ్యవస్థ వేల ఏండ్లుగా కొనసాగు తోంది. అంబేడ్కర్ లాంటి ప్రపంచ మేధా వియే కుల వ్యవస్థ దుర్మార్గం వల్ల విపరీత మైన వేదనకు గురయ్యారు. ఈ కులవ్యవస్థ పొడగింపు ప్రజాస్వామ్య ప్రభుత్వాల కాలంలోనూ కొనసాగడం గమనార్హం. కులవ్యవస్థ భారత జాతిని నిర్వీర్యం చేసింది. దేశంలోని 85 శాతం ప్రజలను సేవ కులుగా మార్చింది. అందుకే కుల రహిత భారతాన్ని కోరుకున్నారు అంబేడ్కర్.
భారత దేశం కుల రహితంగా మారేంత వరకూ, ఆ వ్యవస్థ వల్ల వచ్చిన సామాజిక అంతరాలు పోయే వరకూ శూద్రులకు, అతిశూద్రులకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడి రాజ్యాంగంలో పొందుపరిచారు. కుల నిర్మూలన సిద్ధాంతాన్ని అందించారు. కులరహిత భార తాన్నీ, సెక్యులర్ భారతాన్నీ అంబేడ్కర్ కోరు కున్నారు. కానీ, రాజ్యాధికారంలో ఉంటు న్నదీ, రాజ్యాంగాన్ని అమలుపరిచే స్థానంలో ఉంటున్నదీ కుల వ్యవస్థ వల్ల లాభపడుతున్న వారే కావడం వల్ల కుల నిర్మూలన జరుగడంలేదు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు కూడా అమలు కావడం లేదు.
ఏది ఏమైనా దేశాన్ని అంధకార యుగంలోకి తీసుకు వెళ్ళే కులవ్యవస్థ అంతరించాల్సిందే. కులవ్యవస్థ అంతరించడమంటే వృత్తి పనులు అంతరించడం కాదు. అన్ని దేశా ల్లోనూ వివిధ వృత్తులకు సంబంధించిన పనులున్నాయి, కానీకులాలు లేవు. కులవృత్తులు లేవు. అయితే కులవ్యవస్థ లేనిచోట అన్ని సమస్యలూ పరిష్కారమైనాయా అంటే కాక పోయి ఉండవచ్చుగాక. కాని, కులవ్యవస్థ వల్ల వచ్చే పుట్టుకతోనే దఖలుపడే అధి కారాలు, ఆస్తులు, వివక్ష, పేదరికం, సామా జిక అంతరాలు అక్కడ లేవు. దేశంలోని కోట్లాది మందిని అస్పృశ్యులుగా ముద్ర వేయడం ఏ దేశంలోనూ లేదు. ఒక్క భారత్‌లో తప్ప. కుల రహిత భారతం ఏర్పడితే భారత జాతి అంతా ఒక్క టవుతుంది. సామాజికఅంతరాలు దూరమవుతాయి. ఎ
వరికిష్టమైన పనిని, వృత్తిని వారు స్వీకరిస్తారు. ఇది తక్కువ పని, అది ఎక్కువ పని అనే భేద భావాలు తొలగిపోతాయి. విదేశాల్లోలా కులాల బట్టి కాకుండా ఎవరికి ఏ పనిలో నైపుణ్యముంటుందో ఏ పని చేయడానికి ఇష్ట పడుతారో ఆ పని చేస్తారు. అందరూ అన్ని పనులూ చేస్తుంటే సామాజిక అంతరాలు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. కులాలను కాపాడుతున్నవారు కులాలతో సామాజిక గౌరవం, ఆస్తులు, రాజ్యధికారం అనుభవిస్తున్నారు. వీళ్ళు కులనిర్మూలనకు సహకరించకపోగా కులాలను పెంచి పోషిస్తు న్నారు. వీరి స్థానంలో కుల బాధితులూ,కులంలో అత్యంత హీనస్థితిలో ఉన్నవారూ, మూలజాతుల వారూ రాజ్యాధికారంలోకి వస్తే మంచి ఫలితం ఉంటుంది. వీరు కనీసం యాభై ఏళ్లు పరిపాలన చేస్తే కుల నిర్మూలన జరుగుతుంది.
నిచ్చెన మెట్ల కుల సమాజంలో అట్ట డుగున ఉన్నవారు రాజ్యాధిరారంలోకి వస్తే పై మెట్టుపై ఉన్న వారు మాకీ కులాలు వద్దని మొత్తుకుంటారు. కుల నిర్మూలనకు సహక రిస్తారు. ఎలాగూ వేల ఏండ్లుగా బాధితులైన మూలజాతుల వారు తాము పాలకులై తమను ఇన్నేండ్లుగా బాధలో ఉంచిన కులాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ఇలా అటు ఆగ్రకులాల వారూ, ఇటు శూద్ర, అతిశూద్ర కులాలవారూ కులనిర్మూలనకు సహకరిస్తే ఓ యాభై అరవై ఏళ్లల్లో దేశం లోంచి కులం మాయమైపోతుంది.
- వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత మొబైల్: 91829 18567
- డా‘‘ కాలువ మల్లయ్య
Comments
Please login to add a commentAdd a comment