ఓనం పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: కేరళ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే ఓనం పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా దేశంలో శాంతి, సామరస్యాలు మరింతగా వెల్లివిరియాలని ఆకాంక్షించారు. 'అందరికీ ఓనం శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పర్వదినం మన దేశమంతటా సంతోష, సామరస్యాలను మరింతగా నింపాలని ప్రార్థిస్తున్నా' అని మోదీ ట్వీట్ చేశారు.
కేరళవాసులు అత్యంత భక్తిశ్రద్ధలతలో ఓనం పండుగను జాతి, కుల, మత భేదాలకు అతీతంగా జరుపుకొంటారు. వామనుడు అణచివేసిన బలి చక్రవరి తిరిగి పాతాళం నుంచి భూమిపైకి వచ్చి.. పంటలను, సుఖసంతోషాలను ఇస్తాడనే నమ్మకంతో ఈ పండుగను జరుపుకొంటారు. కేరళతోపాటు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనూ ఈ పండుగను ప్రజలు సంతోషంగా నిర్వహిస్తున్నారు.