
దక్షిణాది స్టార్ ప్రేమ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ నేడు ఉదయం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన ఓనం పండగ కోసం వీరిద్దరూ ప్రైవేటు జెట్ విమానంలో కొచ్చికి విచ్చేశారు. కాగా సుమారు ఎనిమిది నెలలుగా నయన్, విఘ్నేశ్ చెన్నైలోనే ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఓనం పండగ జరుపుకునేందుకు నయన్ తన ప్రియుడితో కలిసి కొచ్చికి వచ్చారు. ఈ సందర్భంగా అప్పుడే ఫైట్ దిగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: త్రిష పెళ్లి ఫిక్స్ అయ్యిందా..? )
కాగా సమయం దొరికితే చాలు విహార యాత్రలకు వెళ్లే ఈ ప్రేమ పక్షులు ఈ మధ్య గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టే, వైవాహిక జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా సాగాలని కోరుకునేందుకు పూజలు కూడా చేస్తున్నారని భోగట్టా. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ కెరీర్‌పరంగా అనుకున్నది సాధించాకే పెళ్లి పీటలెక్కుతామని తేల్చి చెప్తున్నారు. ఇదిలా వుంటే నయనతార తాజాగా నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'నేత్రికన్'ను ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ స్వయంగా నిర్మిస్తున్నారు. అలాగే ఆమె నటిస్తోన్న 'కాతు వాకుల రెండు కధల్' అనే చిత్రానికి విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: బోర్ కొట్టినప్పుడే పెళ్లి )
Comments
Please login to add a commentAdd a comment