తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నవాళ్లు కనుమరుగైపోతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం హీరోయిన్‌గా తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. మూవీ సూపర్ హిట్ అయినా అదృష్టం కలిసిరాలేదు. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్వేత అగర్వాల్. ఇలా చెబితే గుర్తురాకపోవచ్చు కానీ అల్లరి నరేశ్ తొలి మూవీ 'అల్లరి' మూవీలో హీరోయిన్ అంటే గుర్తుపడతారేమో! ఒకవేళ ఇది కాదంటే ప్రభాస్ 'రాఘవేంద్ర' సినిమాలో ఓ హీరోయిన్ అంటే గుర్తురావొచ్చు. ఈ రెండు మూవీస్‍తో బాగానే గుర్తింపు తెచ్చుకుందీ ముంబై చిన్నది. కానీ తర్వాత కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది.
(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)
తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మూవీస్ చేసింది కానీ పెద్దగా లక్ కలిసిరాలేదు. దీంతో 2010లో రిలీజైన 'షాపిత్' అనే హిందీ మూవీ తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. 2020లో ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. ఈమెకు ఓ కూతురు కూడా పుట్టింది. ఆ చిన్నారి ఫొటోలని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
అప్పట్లో 'అల్లరి' సినిమాలో అప్పు అనే పాత్రలో ఆకట్టుకున్న శ్వేత.. స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో అని చాలామంది అనుకున్నారు. తర్వాత ప్రభాస్ 'రాఘవేంద్ర' మూవీలో చేసింది. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. 'గమ్యం' మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది కానీ ఈమెని దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు. దీంతో ఫ్యామిలీ ఉమన్‌గా సెటిలైపోయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment