సాక్షి, హైదరాబాద్: క్షిపణులు, వైమానిక వ్యవస్థల అభివృద్ధిలో కీలకమైన పరిశోధనలు చేసినందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్) ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషీకి ప్రతిష్టాత్మక డాక్టర్.ఎన్. కొండలరావు స్మారక అవార్డు లభించింది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డును శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన డాక్టర్ జోషీ.. పూణే యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. వరంగల్ ఎన్‌ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లోనే పీహెచ్‌డీ సంపాదించారు. దేశంలోనే దిగ్గజ శాస్త్రవేత్తలు ఆర్.చిదంబరం, అనిల్ కాకోద్కర్, డాక్టర్ జి.సతీష్ రెడ్డి వంటి వారు కూడా ఎన్.కొండలరావు స్మారక అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment