kondal rao
-
డీఆర్డీఎల్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌కు కొండలరావు అవార్డు
సాక్షి, హైదరాబాద్: క్షిపణులు, వైమానిక వ్యవస్థల అభివృద్ధిలో కీలకమైన పరిశోధనలు చేసినందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్) ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషీకి ప్రతిష్టాత్మక డాక్టర్.ఎన్. కొండలరావు స్మారక అవార్డు లభించింది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డును శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన డాక్టర్ జోషీ.. పూణే యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ సైన్సెస్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లోనే పీహెచ్డీ సంపాదించారు. దేశంలోనే దిగ్గజ శాస్త్రవేత్తలు ఆర్.చిదంబరం, అనిల్ కాకోద్కర్, డాక్టర్ జి.సతీష్ రెడ్డి వంటి వారు కూడా ఎన్.కొండలరావు స్మారక అవార్డు అందుకున్నారు. -
కొండల్రావ్... ఆనప్పాదా?
అక్షర తూణీరం ఆయన పేరు చెప్పగానే తెలుగు మేస్టారు ఆయన మాటలు గుర్తొచ్చి నవ్వు తెప్పిస్తాయి. రావి కొండల్రావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్నిటికీ మించి ప్రఖ్యాత నటి రాధాకుమారిని కట్టుకున్న భర్త. కొండల్రావు నాటక రచయిత, స్టేజ్ నించి వెండితెరకెక్కిన నటుడు, పత్రికా రచయిత, పత్రికా సంపాదకులు, దర్శకులు, ప్రయోక్త ఎందరో ప్రముఖులకు తలలో నాలుక, కళాప్రపూర్ణ బిరుదుని సార్థకం చేసుకున్న విలక్షణ వ్యక్తి మొన్న జూలై 28న 88వ ఏట కాలధర్మం చెందారు. కొండల్రావ్ శ్రీకాకుళం నించి వస్తూ వస్తూ తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన తెలుగు మేస్టారిని భుజాల మీద ఎక్కించుకు వచ్చారు. మేస్టారి మేనరిజమ్స్‌ని రకరకాలుగా ప్రదర్శిస్తూ దర్శింపచేస్తూ తెలుగు మేస్టారిని మద్రాసు, ఆంధ్రా, రాష్ట్రాలలో ప్రాచుర్యం తెప్పించి, ఆ పాత్రని చిరంజీవిగా కొండల్రావ్ నిలబెట్టారు. ఇంతకుమించిన గొప్ప గురుదక్షిణ మరొకటి ఉండదు. నాలుగిళ్ళ సావిడి, కుక్కపిల్ల దొరికింది కొండల్రావుకి పేరు తెచ్చిన నాటకాలు. తెలుగు మేష్టారు ఓ రోజు శిష్యుడి ఇంటిముందు ఆగారు. ఇంటిమీద ఆనప్పాదు ఆనూపంగా అల్లుకుని వుంది. తెరచాప చూసి ‘కొండల్రావ్..! ఆనప్పాదా?’ అని ప్రశ్నించారు. శిష్యుడు క్షణం తడబడకుండా ‘కాయట్లేదు మేష్టారూ’ అని వినయంగా స్పష్టంగా జవాబు యిచ్చాడు. దాంతో తెలుగు మేస్టారు తోక తొక్కిన త్రాచులా లేచారు. రాస్కెల్ నేనడిగిందేమిటి, నువ్ చెప్పేదేమిటి? కొండల్రావ్ ఆనప్పాదా అని అడిగినపుడు అది ఆనప్పాదైతే ఆనప్పాదని లేదూ బీరపాదైతే బీరపాదని, కాదూ చిక్కుడైతే చిక్కుడనీ లేదూ నాశార్థం పాదైతే నాశార్థం పాదు, నీ శార్ధం పాడైతే ఆ పాదూ అని చెప్పి అఘోరించాలి. కాయట్లేదు మేష్టారూ ఏమిట్రా బటాచోర్ ! ఏవిరా, నీ ఇంటికాయలు తినే ఇంతవాణ్ణి అయానా దొంగరాస్కెల్! అసలు నేనేమడిగాను, నువ్వేం చెప్పావ్! అయ్యారండి కొంచెం మీరు జడ్జిమెంటింగ్ ఉండాలి... వీడు నా క్లాసు మీటు (తెలుగు మేస్టారు ఇంగ్లిష్‌లో పరమపూర్, ఇంగ్లిష్ మీద చాపల్యం మెండ్. క్లాస్‌మీట్ అంటే స్టూడెంట్ అని భావించాలి) వీడిని కొండల్రావ్ ఆనప్పాదా అని అడిగినపుడు వాడేం చెప్పాలండీ... అని మేస్టారు మళ్ళీ మొత్తం లూప్ వేస్తారు. ఇలాగే మనిషి మనిషికీ చెప్పి వేష్టపడడంతో యీ ఫార్స్ వినోదాన్ని పంచుతుంది. విషాదం కూడా తొంగి చూస్తుంది. ఈ మహత్తర సన్నివేశాన్ని సంగీత కోవిదుడు ప్రతి సభలోనూ ఎలాగ సరికొత్త సంగతులతో కొత్త మెరుపులు అద్దు తాడో.. రావి కూడా అలాగే మనోధర్మంతో పలుకులకి నగిషీలు చెక్కేవారు. ఈ సంకీర్తన గంటసేపు జనరంజకంగా నడిచేది. మన కథల మేష్టారు కాళీపట్నం రామారావు. రావి కొండల రావు ఒకే ప్రాంతం వారు. ఒకే బడి విద్యార్థులు కూడా ‘ఆ తెలుగు మేస్టారు నాకూ అయ్యవారే. కానీ కొండల్రావ్ భూత ద్దంలోంచి చూపిస్తూ వేదిక లెక్కించి హాస్యం జోడించి మేష్టా రుని నవ్వుతాలు చేశారు’ అని కాళీపట్నం ఒకసారి చాలా సౌమ్యంగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. కళాకారుడు కళా ప్రపూర్ణుడు అయినవాడు అంతమాత్రం చనువు చొరవ తీసుకోవడంలో తప్పేముంది? గురుభక్తితోనే యింతటి అక్షరా భిషేకం చేశాడని అనుకోవచ్చు. 1965లో ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్తవారలే, కొత్త తారలే అంటూ తేనెమనసులు సినిమా తీశారు. హీరో కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి రావి కొండల్రావ్ ఆ వరదలో వచ్చినవారే! చందమామ ఆవరణలో రచన నించి నిర్మాణ నిర్వహణలు దాకా రక్తి కట్టించారు. డాల్టన్ ప్రెస్ నుంచి వచ్చిన ‘‘విజయచిత్ర’’ సినిమా పత్రిక ఎవర్ గ్రీన్ సినిమా మ్యాగజైన్. గాసిప్స్ గాలి కబుర్లు లేకుండా మల్టీకలర్లో చక్కని ఘుమఘుమలతో వచ్చేది. విజయచిత్రకి దాదాపు పాతికేళ్లు ఎడిటర్‌గా పనిచేసిన ఘనత కొండల్రావ్ది. బాపు రమణలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి నడిపిన జ్యోతి మాసపత్రిక, సంపాదక వర్గంలో రావి వున్నారు. ‘సుకుమార్’ ఆయన కలం పేరు. బాపురమణ, వీఏకే, శ్రీశ్రీ, ఆరుద్ర, నండూరి ఇత్యాదులందరికీ సుకుమార్ చాలా ఆత్మీయులు. మద్రాస్ తెలుగు సాంస్కృతిక సంస్థలకు లోగోగా ఉండేవారు రావి కొండల్రావ్. అయన సినిమా కబుర్ల పుట్ట. కడదాకా ఆయన జ్ఞాపకశక్తి, నలుగురికీ చెప్పాలనే చాపల్యం సడలలేదు. కెరీర్లో లెక్కకి 500 సినిమాలలో కనిపించినా, ఒక పాతిక వేషాలు ఎన్నదగినవి. ఆయన రాసిన తెలుగు సినిమా చరిత్ర, నాగావళి నించి మంజీరా దాకా జ్ఞాపకాల కబుర్లు వాసి కెక్కాయి. అది మద్రాస్ ఎయిర్‌పోర్టు. అన్నగారు ఎదురుపడితే నమస్కరించారు కొండల్రావ్. ఆయన చిరునవ్వు నవ్వి ‘బ్రదర్! దుర్యోధనుడు లాంటి నెగెటివ్ క్యారెక్టర్‌కి ఎవరైనా శృంగార భరిత డ్యూయెట్ పెడతారా’ అని సూటిగా అడిగారు. వెంటనే తడుముకోకుండా ‘ఛీ.. ఛీ ఎవరూ పెట్టరండీ’ అన్నారు రావు కరాఖండిగా. యన్టీఆర్ విశాలంగా నవ్వి ‘మేం పెట్టాం బ్రదర్.. వినండి’ అంటూ చేతిలో ఉన్న టేప్‌రికార్డర్ మీట నొక్కారు. ‘చిత్రం... విభళారే చిత్రం’ (పాట) ఇవ్వాళే రికార్డ్ చేశాం. మన రెడ్డిగారు రాశారంటూ వినిపించారు. కొండల్రావుకి మొహం ఎట్లా పెట్టాలో అర్థం కాలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో చెబుతుండేవారు. అన్ని రంగాలలో సత్కీర్తి గడించిన కొండల్రావ్ ధన్యజీవి. ఆయనతో ఉన్న వేల వేల జ్ఞాపకాలకు అంజలి ఘటిస్తూ.... (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
కరోనా: రెండో దశలోనే తీవ్రంగా ఉంది
సాక్షి, నల్గొండ: జిల్లాలో తొలిసారిగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డిఎంహెచ్ఓ డాక్టర్ కొండల్ రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండలో అయిదుగురు మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ కరోనా వైరస్ బారిన పడినట్లు ఆయ తెలిపారు. అయితే వీరంతా ఢిల్లీలోని మార్కజ్‌కు వెళ్లిన వారేనని కూడా పేర్కొన్నారు. కాగా పాజిటివ్ వచ్చిన వీరికి ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబ సభ్యులను ఉదయం జిల్లా కేంద్ర ఆసుపత్రి క్వారంటైన్‌కు తరలించామని, వారి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌కు పంపించామన్నారు. (క్షణక్షణం.. అప్రమత్తం) కాగా వారి రిపోర్ట్సు వచ్చాక అవసరమైన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఇక పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ఎవరెవరూ సన్నిహితంగా ఉన్నారో వారి వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇంకా 82 మంది క్వారంటైన్లో ఉన్నారని, ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. జిల్లాలో మహమ్మారి విజృంభన రెండో దశలోనే తీవ్రంగా ఉందని, ప్రజలంతా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఇక వైద్య సిబ్బంది కూడా తగు జాగ్రత్తలతో విధులు నిర్వర్తించాలని ఆయన చెప్పారు. (నల్లగొండలో 17 మంది బర్మా దేశీయులు) -
రంగస్థలంపై ‘కొండంత’ అభిమానం
ఆ రోజుల్లో నాటకాలంటే భలే క్రేజ్.. ఎక్కడ నాటకాలు వేసినా గుంపులుగా జనం వెళ్లేవారు.. దాంతో అతడికి నాటకాలపై మక్కువ పెరిగింది. ఎలాగైనా నాటకాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. చివరకు అనుకున్నది సాధించి నాటక రంగంలో దూసుకుపోయాడు. తను ఏ పాత్ర వేసినా జనంలోంచి విజిల్స్ చప్పుడు.. కేకలు.. అరుపులు.. అవే అతడిలో మరింత ఆసక్తి పెంచాయి. నాటకాన్నే జీవనోపాధిగా మార్చుకున్నాడు. ఆరోజుల్లో నాటకాలకు ఉన్న ఆదరణ ప్రస్తుతం లేకపోవడంతో బతుకు భారమైంది. కల నుంచి బయటకు వచ్చి.. కళను వదిలిపెట్టి.. పొట్టనింపుకునేందుకు దర్జీ పని మొదలు పెట్టారు. మార్కెట్లో రెడీమేడ్ దుస్తుల పోటీని తట్టుకోలేక బతుకును భారంగా వెళ్లదీస్తున్నారు కొండల్రావు. రహమత్‌నగర్: రహమత్‌నగర్ డివిజన్లోని ఎన్ఎస్బీ నగర్‌కు చెందిన కొండల్రావు(75)కు భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్నతనం నుంచే నాటకాలపై ఉన్న మక్కువతో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగస్థల సంస్థలతో సంబంధాలు పెంచుకొని రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు వేసి శెభాష్ అనిపించుకున్నారు. ఈయన వేసిన క్రిష్ణార్జున యుద్దం, మాయాబజార్, చింతామణి, çసత్యహరిచంద్ర, నాటకాలు బహుమతులు అందుకొని ప్రశంసలు అందుకున్నారు. 2011 ఫిబ్రవరిలో రవీంద్రభారతిలో నంది నాటకోత్సవం ప్రశంస పత్రం అందుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మశంకర్ బస్తీలో టైలర్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఓవైపు వృద్ధాప్యం.. మరోవైపు ఆర్థిక పరిస్థితులు ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏళ్లుగా నాటక రంగంలో ఉన్నా కనీసం ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కళాకారులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఏసీబీ దాడులు.. కోట్లలో అక్రమాస్తులు గుర్తింపు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆదిలాబాద్ మున్సిపల్ డీఈ కొండల్రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెంలలో పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 6 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం జిల్లా రామానుజ కాలనీలోని మున్సిపల్ డీఈ మామ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం వరంగల్‌లో మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
అవినీతికి మాతృస్థానం రెడ్ టేపిజం
సందర్భం రెడ్ టేపిజం (కాలాయాపన)కు మరో పేరు అవినీతి. రెడ్ టేపిజమ్ (కాలాయాపన) అనేది అవినీతికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. నేనొకనాడు డీహెచ్ఈ. ఈ ఆఫీస్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నపుడు అచ్చట "క్రియేటివ్ వర్క్"(సృజనాత్మక పని) అట్టే కనిపించక ఆ ఆఫీస్ ముందరి చింత చెట్టును ఆధారం చేసుకొని "ది టామరిండ్ ట్రీ" అను ఒక ఆంగ్లేయ దీర్ఘకవిత ఆ ఆఫీస్‌కే కాక అలాంటి ఎన్నో ఆఫీసులకు వర్తించేది రాశాను. అదే రోజుల్లో "పైర వీకారీ" అను ఒక కవిత ప్రొ||జి.హరగోపాల్ కూడా వ్రాశారు. ఈ రెండూ కలిపి చదివితే "మజా" వస్తుంది. మన రాష్ట్ర పరిపాలన గురించి ఎవరెన్ని బహద్దూరీలు చెప్పినా, ప్రపంచంలోనే మన రాష్ట్రం ఎన్నింటిలోనో ప్రధానంగా ఉందని ప్రగల్భాలు పలికినా, అది రెడ్టేపిజమ్లో, బ్యూరోక్రసీలో అంతకన్నా ఎంతో ముందుందని చూపడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అప్పట్లో జె.ఎమ్.గ్రిగలానీ అనే ఒక ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ రిటైర య్యాక ఆయనంతటివాడే ఒక పెన్షనర్ పడే బాధలు ఎలా పడ్డాడో, భరించాడో తన పుస్తకంలో ఒక "లిమ్మరిక్" (Lymm-erick) ద్వారా వ్రాశాడు. అది అప్పటికే కాదు ఇప్పటికీ, ఎప్పటికీ వర్తిస్తుంది. నేను, హరగోపాల్, గ్రిగలానీ రాసింది కలిపి చదివితే మన పరిపాలకులు, ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల గురించిన ఎన్నో విషయాలు బోధపడతాయి. నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌గా పని చేసేటప్పుడు నాకు కలిగిన రెండు అనుభవాలు. ఒకటి నేను రిటైర్ కాకముందు, రెండవది నేను రిటైర్ అయ్యాక జరిగాయి. ఆనాడు సీనియర్ని. కానీ డైరెక్టర్‌గా పదోన్నతి చేస్తున్నపుడు స్కూల్ ఎడ్యుకేషన్‌లో పనిచేసేవారిని కూడా కలిపి సీనియారిటీ నిర్ణయించి, (అలాంటి పద్ధతిని ప్రవేశపెట్టి నా సీనియారిటీని స్కూల్ వారి సీనియారిటీతో పోల్చి) నాకు డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌గా పదోన్నతి ఇవ్వడానికి బదులు ఏదో ఒక డైరెక్టర్‌గా ఉన్నతి కల్పించి డిప్యుటేషన్‌పై తెలుగు అకాడమీకి పంపించారు. తమాషా ఏమిటంటే, నేను గవర్నమెంట్ ఉద్యోగిని. హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి కేవలం ఒక సొసైటీగా స్థాపితమైన తెలుగు అకాడమీకి డిప్యుటేషన్‌పై వచ్చినవాడిని అని డీహెచ్ఈ నుండి నాకొక ఉత్తరం రాస్తూ కూడా ముచ్చటైన మూడు క్రింది ప్రశ్నలు వేస్తూ నన్నీమధ్య జవాబులు అడిగారు నా తల్లికి చెందిన మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల గురించి నన్ను వివరణ కోరుతూ. (అందులో కొంత తగ్గించి ‘పేమెంట్’ చేస్తారు మెడికల్ డిపార్ట్‌మెంట్‌వారు. అదెందుకో తెలియదు.) వాళ్లు నన్నడిగిన ప్రశ్నలివి. నా రిటైర్మెంట్ తర్వాత ఏ ఆఫీసు నుంచి నా íపింఛను ప్రతిపాదనలను ఏజీ, ఏపీ హైదరాబాద్ వారికి ఫార్వర్డ్ చేశారు? నా రిటైర్మెంట్ తర్వాత ఏ ఆఫీసు నుంచి అనుమతి తీసుకున్నారు, ఆర్జిత సెలవును ఎక్కడి నుంచి నగదుగా తీసుకున్నారు? తెలుగు అకాడమీ, హైదరాబాద్ డైరెక్టర్‌గా పదో న్నతి పొందాక, నాకు రావలసిన ప్రయోజనాలు (ఉదా.మెడికల్ రీయింబర్స్మెంట్, పెంచిన ఫించను వగైరాలు) క్లెయిమ్ చేసుకో వడానికి ఈ ఆఫీసు తగినదేనా? నేను పనిచేసిన మాతృ శాఖే, నన్ను ఇలాంటి ప్రశ్నలడిగినం దుకు నాకు నవ్వొచ్చింది.. ఇలాంటి ప్రశ్నలు వేసేకదా ప్రభుత్వోద్యోగులు కావాలని కాలాయాపన చేస్తారని. నేను వీటికి మీ ఆఫీస్‌లోనే నేను పనిచేశాను కదా? మీరే కదా మీ ఆఫీస్ నుంచే తెలుగు అకాడమీకి డిప్యుటేషన్‌పై వచ్చానని మీ లెటర్‌లోనే రాశారు. నా డిప్యుటేషన్ ఆర్డర్స్, రిటైర్ మెంట్ ఆర్డర్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఆర్డర్స్, పెన్షన్ ఆర్డర్స్ వంటివి అన్నీ కూడా ఇతరులకు లాగే నాకూ నా మాతృ శాఖవే కదా వరిస్తాయి? ఆమాత్రం తెలియక నాలాంటి రిటైరైన హయ్యర్ ఆఫీసర్‌కి కూడా మీ ఆఫీస్‌కు చెందిన ఒక కింది ఆఫీసరెవరో "జౌట" అని పై ఆఫీసర్‌కు బదులు సంతకం పెట్టి ఒక అప్రస్తుత మెమో రాయడం బాగుందా? అది మీ తెలియనితనం తప్ప మరేమీ కాదని తిరిగి నేను రాస్తే బాగుండదని రాయలేదు. బహుశ అది నా తప్పు కావచ్చు. అదేమి బాగుంటుంది "మీరు తెలియనివారు" అని సూటిగా రాయడం. ఇలా రాసేవాళ్లు కూడా ఒకరోజు రిటైర్ అయ్యేవారమే కదా అని గ్రహించాలని వ్రాశారు గ్రిగలానీ వారి Lymm-erick. ఇలాంటివి ఉద్యోగులు కావాలని కూడా చేస్తారు ఒక్కొక్కతూరి. అదే "పైరవీ"కి దారితీస్తాయి. ఒక్కోసారి అవినీతికి కూడా. కానీ అవి పైవారి "for" అను సంతకాలతో రాకూడదు కదా మరి. ఇలా రాయడం వలననే బ్యూరోక్రసీ పెరుగుతుందని, రెడ్ టేపిజమ్ పెరుగుతుందని. వాటి రెండింటి వలననే అవినీతి ఎక్కువ పెరుగుతుందని. దేశాభివృద్ధి తరుగుతుందని మరి వేరే చెప్పనక్కరలేదేమో? కరప్షన్ గురించి మాట్లాడేవాళ్లు మొదట మన బ్యూరోక్రసీ, మన రెడ్ టేపిజమ్ (అంటే కాలాయాపన) గురించి మాట్లాడాలన్నదే నా అభిప్రాయం. వ్యవస్థ గురించి రాస్తున్నాను కానీ వ్యక్తుల గురించీ రాయడం లేదు. నేనెప్పుడు రాసినా సిస్టమ్ గురించే రాస్తాను. వ్యక్తులు సిస్టమ్‌లో పావులే కదా మరి? వ్యక్తులు మారాలంటే వ్యవస్థలు, విధానాలు మారాలి కదా మరి? అవెంత నిదానంగా మారితే ఇవి కూడా అంతే నిదానంగా మారుతాయి. వ్యాసకర్త గౌరవాధ్యక్షులు, తెలుగు భాషా పరిరక్షణ సమితి, తెలంగాణ రాష్ట్రం | మొబైల్ : 98481 95959 డాక్టర్ వెల్చాల కొండలరావు -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పై మరిన్ని చర్యలు
రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ)లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో కాంట్రాక్టర్ కొండల్రావు, సైట్ ఇంజనీర్ సుధాకర్‌రావు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ బాలరాజులను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం విచారించారు. ఈ ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో ఆదివారం పోర్టికో కూలిన ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. ఇదే ఘటనకు సంబంధించి ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కే.ఎస్.రామారావుతో పాటు కార్యదర్శికి విచారణకు హాజరుకావాలని బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిపై కూడా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేసి విషయం విదితమే. ఎఫ్ఎన్సీసీ కార్యవర్గంపై సెక్షన్ 304(పార్ట్2)..? ఈ ఘటనలో అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యవర్గంపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న సెక్షన్లతో పాటు అదనంగా 304(పార్ట్2) సెక్షన్‌ను నమోదు చేయాలని, దర్యాప్తును ముమ్మరం చేయాలని తలపెట్టారు. ఇందులో భాగంగానే పోర్టికో నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతి ఉందా? రాత్రి పూట శ్లాబ్ వేయాల్సిన అవసరం ఏంటి? అన్నదానిపై ఆరా తీస్తున్నారు. నిర్లక్ష్యంగా శ్లాబ్ నిర్మాణం చేపట్టి ఇద్దరి మరణానికి కారకులయ్యారంటూ ఇప్పటికే ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడిపై కేసు నమోదుకాగా దీని తీవ్రతను పెంచాలని యోచిస్తున్నారు. -
నల్లగా ఉన్నావంటూ వేధించి జైలుపాలు
హైదరాబాద్ : నల్లగా, అందవికారంగా ఉన్నావంటూ తోటి ఉద్యోగినిని వేధించడమే కాకుండా ఆమె మనోభావాలను దెబ్బతీసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఉన్న లుస్కో ఇటాలియా ఫర్నిచర్లో విశాఖపట్నానికి చెందిన కొండల్ రావు సేల్స్ మెన్. ఇదే షోరూంలో పని చేస్తున్న యువతని నీవు నల్లగా అందవికారంగా ఉన్నావంటూ కొండల్ రావు కొంతకాలంగా వేధిస్తున్నాడు. చెప్పుకోలేని భాష వాడుతూ ఆమెను అవమానిస్తున్నాడు. రెండు రోజుల క్రితం తనను ఎందుకు వేధిస్తున్నావని నిలదీసిన ఆమె ఛాతిపై చేయివేసి బలంగా తోశాడు. దీంతో కిందపడిపోయిన ఆమెకు గాయలయ్యాయి. దీంతో బాధితులురాలు పోలీసులను ఆశ్రయించగా...దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐపీసీ 354,323, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.