నల్లగా ఉన్నావంటూ వేధించి జైలుపాలు | Sales man arrested for harassing woman colleague in hyderabad | Sakshi
Sakshi News home page

నల్లగా ఉన్నావంటూ వేధించి జైలుపాలు

Published Sat, Jul 19 2014 8:04 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

నల్లగా ఉన్నావంటూ వేధించి జైలుపాలు - Sakshi

నల్లగా ఉన్నావంటూ వేధించి జైలుపాలు

హైదరాబాద్ : నల్లగా, అందవికారంగా ఉన్నావంటూ తోటి ఉద్యోగినిని వేధించడమే కాకుండా ఆమె మనోభావాలను దెబ్బతీసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఉన్న లుస్కో ఇటాలియా ఫర్నిచర్లో విశాఖపట్నానికి చెందిన కొండల్ రావు సేల్స్ మెన్.

 

ఇదే షోరూంలో పని చేస్తున్న యువతని నీవు నల్లగా అందవికారంగా ఉన్నావంటూ కొండల్ రావు కొంతకాలంగా వేధిస్తున్నాడు. చెప్పుకోలేని భాష వాడుతూ ఆమెను అవమానిస్తున్నాడు. రెండు రోజుల క్రితం తనను ఎందుకు వేధిస్తున్నావని నిలదీసిన ఆమె ఛాతిపై చేయివేసి బలంగా తోశాడు. దీంతో కిందపడిపోయిన ఆమెకు గాయలయ్యాయి. దీంతో బాధితులురాలు పోలీసులను ఆశ్రయించగా...దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐపీసీ 354,323, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement