అవినీతికి మాతృస్థానం రెడ్‌ టేపిజం | kondal rao writes on red tapism | Sakshi
Sakshi News home page

అవినీతికి మాతృస్థానం రెడ్‌ టేపిజం

Published Sun, Jan 29 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

అవినీతికి మాతృస్థానం రెడ్‌ టేపిజం

అవినీతికి మాతృస్థానం రెడ్‌ టేపిజం

సందర్భం
రెడ్‌ టేపిజం (కాలాయాపన)కు మరో పేరు అవినీతి. రెడ్‌ టేపిజమ్‌ (కాలాయాపన) అనేది అవినీతికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
నేనొకనాడు డీహెచ్‌ఈ. ఈ ఆఫీస్‌లో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నపుడు అచ్చట "క్రియేటివ్‌ వర్క్"(సృజనాత్మక పని) అట్టే కనిపించక ఆ ఆఫీస్‌ ముందరి చింత చెట్టును ఆధారం చేసుకొని "ది టామరిండ్‌ ట్రీ" అను ఒక  ఆంగ్లేయ దీర్ఘకవిత ఆ ఆఫీస్‌కే కాక అలాంటి ఎన్నో ఆఫీసులకు వర్తించేది రాశాను. అదే రోజుల్లో "పైర వీకారీ" అను ఒక కవిత ప్రొ||జి.హరగోపాల్‌ కూడా వ్రాశారు. ఈ రెండూ కలిపి చదివితే "మజా" వస్తుంది. మన రాష్ట్ర పరిపాలన గురించి ఎవరెన్ని బహద్దూరీలు చెప్పినా, ప్రపంచంలోనే మన రాష్ట్రం ఎన్నింటిలోనో ప్రధానంగా ఉందని ప్రగల్భాలు పలికినా, అది రెడ్‌టేపిజమ్‌లో, బ్యూరోక్రసీలో అంతకన్నా ఎంతో ముందుందని చూపడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.

అప్పట్లో జె.ఎమ్‌.గ్రిగలానీ అనే ఒక ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌ రిటైర య్యాక ఆయనంతటివాడే ఒక పెన్షనర్‌ పడే బాధలు ఎలా పడ్డాడో, భరించాడో తన పుస్తకంలో ఒక "లిమ్మరిక్" (Lymm-erick) ద్వారా వ్రాశాడు. అది అప్పటికే కాదు ఇప్పటికీ, ఎప్పటికీ వర్తిస్తుంది. నేను, హరగోపాల్, గ్రిగలానీ రాసింది కలిపి చదివితే మన పరిపాలకులు, ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల గురించిన ఎన్నో విషయాలు బోధపడతాయి.

నేను జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌గా పని చేసేటప్పుడు నాకు కలిగిన రెండు అనుభవాలు. ఒకటి నేను రిటైర్‌ కాకముందు, రెండవది నేను రిటైర్‌ అయ్యాక జరిగాయి. ఆనాడు సీనియర్‌ని. కానీ డైరెక్టర్‌గా పదోన్నతి చేస్తున్నపుడు స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో పనిచేసేవారిని కూడా కలిపి సీనియారిటీ నిర్ణయించి, (అలాంటి పద్ధతిని ప్రవేశపెట్టి నా సీనియారిటీని స్కూల్‌ వారి సీనియారిటీతో పోల్చి) నాకు డైరెక్టర్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌గా పదోన్నతి ఇవ్వడానికి బదులు ఏదో ఒక డైరెక్టర్‌గా ఉన్నతి కల్పించి డిప్యుటేషన్‌పై తెలుగు అకాడమీకి పంపించారు.

తమాషా ఏమిటంటే, నేను గవర్నమెంట్‌ ఉద్యోగిని. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నుండి కేవలం ఒక సొసైటీగా స్థాపితమైన తెలుగు అకాడమీకి డిప్యుటేషన్‌పై వచ్చినవాడిని అని డీహెచ్‌ఈ నుండి నాకొక ఉత్తరం రాస్తూ కూడా ముచ్చటైన మూడు క్రింది ప్రశ్నలు వేస్తూ  నన్నీమధ్య జవాబులు అడిగారు నా తల్లికి చెందిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల గురించి నన్ను వివరణ కోరుతూ. (అందులో కొంత తగ్గించి ‘పేమెంట్‌’ చేస్తారు మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌వారు. అదెందుకో తెలియదు.)

వాళ్లు నన్నడిగిన ప్రశ్నలివి. నా రిటైర్మెంట్‌ తర్వాత ఏ ఆఫీసు నుంచి నా íపింఛను ప్రతిపాదనలను ఏజీ, ఏపీ హైదరాబాద్‌ వారికి ఫార్వర్డ్‌ చేశారు? నా రిటైర్మెంట్‌ తర్వాత ఏ ఆఫీసు నుంచి అనుమతి తీసుకున్నారు, ఆర్జిత సెలవును ఎక్కడి నుంచి నగదుగా తీసుకున్నారు? తెలుగు అకాడమీ, హైదరాబాద్‌ డైరెక్టర్‌గా పదో న్నతి పొందాక, నాకు రావలసిన ప్రయోజనాలు (ఉదా.మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, పెంచిన ఫించను వగైరాలు) క్లెయిమ్‌ చేసుకో వడానికి ఈ ఆఫీసు తగినదేనా?

నేను పనిచేసిన మాతృ శాఖే, నన్ను ఇలాంటి ప్రశ్నలడిగినం దుకు నాకు నవ్వొచ్చింది.. ఇలాంటి ప్రశ్నలు వేసేకదా ప్రభుత్వోద్యోగులు కావాలని కాలాయాపన చేస్తారని. నేను వీటికి మీ ఆఫీస్‌లోనే నేను పనిచేశాను కదా? మీరే కదా మీ ఆఫీస్‌ నుంచే తెలుగు అకాడమీకి  డిప్యుటేషన్‌పై వచ్చానని మీ లెటర్‌లోనే రాశారు. నా డిప్యుటేషన్‌ ఆర్డర్స్, రిటైర్‌ మెంట్‌ ఆర్డర్స్, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ ఆర్డర్స్, పెన్షన్‌ ఆర్డర్స్‌ వంటివి అన్నీ కూడా ఇతరులకు లాగే నాకూ నా మాతృ శాఖవే కదా వరిస్తాయి? ఆమాత్రం తెలియక నాలాంటి రిటైరైన హయ్యర్‌ ఆఫీసర్‌కి కూడా మీ ఆఫీస్‌కు చెందిన ఒక కింది ఆఫీసరెవరో "జౌట" అని పై ఆఫీసర్‌కు బదులు సంతకం పెట్టి ఒక అప్రస్తుత మెమో రాయడం బాగుందా? అది మీ తెలియనితనం తప్ప మరేమీ కాదని తిరిగి నేను రాస్తే బాగుండదని రాయలేదు. బహుశ అది నా తప్పు కావచ్చు. అదేమి బాగుంటుంది "మీరు తెలియనివారు" అని సూటిగా రాయడం.

ఇలా రాసేవాళ్లు కూడా ఒకరోజు రిటైర్‌ అయ్యేవారమే కదా అని గ్రహించాలని వ్రాశారు గ్రిగలానీ వారి Lymm-erick. ఇలాంటివి ఉద్యోగులు కావాలని కూడా చేస్తారు ఒక్కొక్కతూరి.  అదే "పైరవీ"కి దారితీస్తాయి. ఒక్కోసారి అవినీతికి కూడా. కానీ అవి పైవారి "for" అను సంతకాలతో రాకూడదు కదా మరి.

ఇలా రాయడం వలననే బ్యూరోక్రసీ పెరుగుతుందని, రెడ్‌ టేపిజమ్‌ పెరుగుతుందని. వాటి రెండింటి వలననే అవినీతి ఎక్కువ పెరుగుతుందని. దేశాభివృద్ధి తరుగుతుందని మరి వేరే చెప్పనక్కరలేదేమో? కరప్షన్‌ గురించి మాట్లాడేవాళ్లు మొదట మన  బ్యూరోక్రసీ, మన రెడ్‌ టేపిజమ్‌ (అంటే కాలాయాపన) గురించి మాట్లాడాలన్నదే నా అభిప్రాయం. వ్యవస్థ గురించి రాస్తున్నాను కానీ వ్యక్తుల గురించీ రాయడం లేదు. నేనెప్పుడు రాసినా సిస్టమ్‌ గురించే రాస్తాను. వ్యక్తులు సిస్టమ్‌లో పావులే కదా మరి? వ్యక్తులు మారాలంటే వ్యవస్థలు, విధానాలు మారాలి కదా మరి? అవెంత నిదానంగా మారితే ఇవి కూడా అంతే నిదానంగా మారుతాయి.


వ్యాసకర్త గౌరవాధ్యక్షులు, తెలుగు భాషా పరిరక్షణ సమితి, తెలంగాణ రాష్ట్రం | మొబైల్‌ : 98481 95959
డాక్టర్‌ వెల్చాల కొండలరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement