
టి20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం సూపర్-12లో బంగ్లాదేశ్, టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఉత్కంఠగా సాగిన పోరులో ఐదు పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ సందర్భంగా ఒక వ్యక్తి తన చర్యలతో అందరిని మాట్లాడుకునేలా చేశాడు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో సదరు వ్యక్తి పదే పదే మైదానంలోకి వస్తున్నాడు పోతున్నాడు. ఇలా ఎందుకు చేశాడనేది మొదట ఎవరికి అర్థం కాలేదు. కానీ అతను ఎందుకు వచ్చాడన్న దానిపై క్లారిటీ వచ్చాకా మాత్రం అందరు ప్రశంసల్లో ముంచెత్తారు. ఇంతకీ ఆ వ్యక్తి చేస్తున్న పనేంటో తెలుసా.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మైదానం ఔట్‌ఫీల్డ్ కాస్త చిత్తడిగా మారింది. ఆటగాళ్ల షూస్‌కు బురద అంటుతుండడంతో ఫీల్డింగ్ చేసే సమయంలో జారి పడితే ఇబ్బంది అని భావించిన సదరు వ్యక్తి ప్రతీసారి మైదానంలోకి వచ్చి వారి షూస్ క్లీన్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి.
అలా టీమిండియా ఆటగాళ్ల షూస్ క్లీన్ చేసి అందరి మనుసుల దోచేసిన ఆ వ్యక్తి పేరు రాఘవేంద్ర(రఘు). టీమిండియాకు సైడ్‌ఆర్మ్ బాల్ త్రోయర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. క్రికెట్‌పై ఉన్న ప్రేమతో ఆటగాడిగా మారాలన్న రఘు కోరిక నెరవేరలేదు. అందుకే గత ఆరేళ్లుగా టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో సైడ్ ఆర్మ్ త్రోయర్‌గా పనిచేస్తూ ఆటగాళ్లకు చాలా దగ్గరయ్యాడు.
చదవండి: వర్షం రాకపోయుంటే.. టీమిండియా గెలిచేదా!
IND Vs BAN: బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం.. సెమీస్ బెర్త్ ఖాయం..!
Comments
Please login to add a commentAdd a comment