T20 WC 2022 IND VS BAN: టీమిండియా నిర్ధేశించిన 185 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. 7వ ఓవర్ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం మొదలు కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం అంతరాయం కలిగించే సమాయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 59, హొస్సేస్ షాంటో ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇదిలా ఉంటే, వర్షం ఎంతకు తగ్గకపోతే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం విజేతను ప్రకటించాల్సి ఉంటుంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చూస్తే బంగ్లాదేశ్ 17 పరుగులు ముందంజలో ఉంది. దీంతో బంగ్లాదేశ్‌నే విజేతగా ప్రకటిస్తారు.
అంతకుముందు భీకరమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి మరోసారి రెచ్చిపోవడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. కోహ్లి ఈ ఇన్నింగ్స్‌లో.. 44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాలాకాలం తర్వాత ఓపెనర్ కేఎల్ రాహుల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రాహుల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment