T20 World Cup 2022 Ind Vs Ban: KL Rahul Smashes-14 Runs On 1-Delivery - Sakshi
Sakshi News home page

IND Vs BAN: ఒక్క బంతికే 14 పరుగులు బాదిన కేఎల్‌ రాహుల్‌

Published Wed, Nov 2 2022 4:06 PM | Last Updated on Wed, Nov 2 2022 9:41 PM

KL Rahul Smashes-14 Runs On 1-Delivery Vs BAN T20WC 2022 - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నిరోజులుగా ఫామ్‌లో లేని రాహుల్‌ బంగ్లాతో మ్యాచ్‌లో మాత్రం తన మునుపటి ఆటను ప్రదర్శించాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సరిగ్గా 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే షోరిఫుల్‌ ఇస్లామ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో రాహుల్‌ ఒక్క బంతికే 14 పరుగులు బాదడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఆ ఓవర్‌లో నాలుగో బంతిని లాంగాన్‌ దిశగా భారీ సిక్స్‌ బాదాడు. అయితే అది నోబాల్‌ అని తేలడంతో ఫ్రీహిట్‌ లభించింది. నోబాల్‌ గనుక బంతి కౌంట్‌ కాదు కాబట్టి.. మొత్తం ఏడు పరుగులు(సిక్స్‌తో కలిపి) వచ్చాయి. మరుసటి బంతి వైడ్‌ వేయడంతో ఫ్రీ హిట్‌ అలానే కంటిన్యూ అయింది. అనంతరం ఫ్రీహిట్‌ను సద్వినియోగం చేసుకున్న రాహుల్‌ రిస్ట్‌ పవర్‌ ఉపయోగించి డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా మరోసారి భారీ సిక్సర్‌ బాదాడు. అలా ఒక్క బంతికే 14 పరుగులు వచ్చాయి.

చదవండి: అగ్రపీఠంపై సూర్య భాయ్‌.. కోహ్లి తర్వాత తొలి భారతీయుడిగా రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement