తెలంగాణ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా
తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా ఢిల్లీ యూనివర్సిటీ న్యాయవిభాగంలో మార్చి 21 నుంచి 23 వరకు నిర్వహించనున్న రెండు అంతర్జాతీయ సమావేశాల్లో పత్ర సమర్పణకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ హక్కులు, మేథో సంపత్తి హక్కులు తదితర చట్టసంబంధ అంశాలపై ఈ సదస్సులో ఆయన చర్చిస్తారు. ఈ సమావేశాల్లో సుమారు 20 దేశాలకు చెందిన న్యాయ విభాగం నిపుణులు పాల్గొనబోతున్నారని ఎల్లోసా తెలిపారు.