associate professor
-
వాడిన విరులూ పరిమళిస్తాయి
అమ్ముడుపోని పూలు ఏమవుతాయి? కొనేవాళ్ల కోసం ఎదురు చూసే సహనం పూలమ్మాయికి ఉంటుంది, కానీ పూలకు ఉండదు. రెక్కలు విచ్చుకోవడం, ఆ రెక్కలు వాలిపోవడంలో అవి వాటి సమయాన్ని క్రమం తప్పనివ్వవు. మార్పుకు నాంది పూలసాగు రైతుల జీవితాలను సువాసనభరితం చేస్తోందా? మొక్కనాటి, నీరు పెట్టి, ఎరువు వేసి పెంచిన మొక్కలు మొగ్గతొడిగితే ఆనందం. ఆ మొగ్గలు విచ్చేలోపు కోసి మార్కెట్‌కు చేర్చాలి. తెల్లారేటప్పటికి నగరంలోని మార్కెట్‌కు చేరాలంటే పూలను కోసే పని అర్ధరాత్రి నుంచి మొదలవ్వాలి. ఆ సమయంలో ΄పొలంలో పనికి వచ్చే వాళ్లు ఉండరు. వచ్చినా రెండింతల కూలి ఇవ్వాలి. సాగు ఖర్చులు, రవాణా ఖర్చులు, తన శ్రమ కలిపి ధర నిర్ణయించుకోవాలి. చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. మార్కెట్లో పూలు ఎక్కువై΄ోయి డిమాండ్ తగ్గిన రోజుల్లో పూలు కోయడానికిచ్చే కూలి కూడా గిట్టదని ఆ పూలను చెట్లకే వదిలేస్తుంటారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పరిమళాలను మట్టిపాలు కాకుండా కాపాడుతున్నారు కేజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ సంయుక్త. తక్కువ ఖర్చులో ఆటోమేటిక్ ఇన్సెన్స్ మేకింగ్ మెషీన్‌కు రూపకల్పన చేశారామె. ఇంజనీర్ సమాజంలో మార్పు తీసుకువచ్చే చేంజ్‌మేకర్ కావాలనే ఆశయాన్ని ఆచరణలో పెట్టారామె. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో పరిశోధన చేస్తున్న సంయుక్త పర్యావరణహితమైన ఆవిష్కరణ కోసం గ్రామాల బాట పట్టారు. ఈ మెషీన్ రూపకల్పనకు దారి తీసిన కారణాలను సాక్షితో పంచుకున్నారామె.మహిళలతో ముందడుగు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ‘‘2020లో స్థాపించాం. సమాజంలో అవసరమైన ఇంజనీరింగ్ ఆవిష్కరణల గురించి అధ్యయనం చేయడానికి 72 గ్రామాల్లో పర్యటించాం. మహిళలు, మగవాళ్లు, రైతులు, ఇతర వృత్తుల్లోని వారు, పిల్లలు, వృద్ధులు... ఇలా అన్ని కేటగిరీల వ్యక్తులతో మాట్లాడాం. అక్కడి సమస్యలు తెలిశాయి, అవసరాలు అర్థమయ్యాయి. వాటిని పరిష్కరించడానికి ఏం చేయాలనే స్పష్టత కూడా వచ్చింది. అన్నింటినీ మేం పరిష్కరించలేం, ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగిన వాటిని వదిలేసి, మా స్థాయిలో పరిష్కరించగలిగే పన్నెండు ప్రాజెక్టుల జాబితా తయారు చేసుకున్నాం. వాటిలో మొదటిది అగరువత్తి తయారీ యంత్రం. అప్పటికి మార్కెట్లో ఉన్న అగరువత్తి మేకింగ్ మెషీన్ల ధర నాలుగైదు లక్షల్లో ఉంది. మేము అరవై వేలలో తయారు చేశాం. రైతుల దగ్గర వృథా అయ్యే పూలు, ఆలయాల దగ్గర అమ్ముడు కానివి, దేవునికి పెట్టి తీసిన పూలను సేకరించి అగరువత్తి, సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తున్నాం. స్థానిక మహిళలకు శిక్షణనిచ్చాం. వారే స్వయంగా నిర్వహించుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే శిక్షణనిచ్చి, వాళ్లకు తగినట్లు మెషీన్ తయారు చేసిస్తాం’’ అన్నారు ్ర΄పొఫెసర్ సంయుక్త.తయారీ ఇలాగ...సేకరించిన పూల నుంచి రెక్కలను వేరు చేసి ఉప్పు నీటిలో కడిగి ఓ గంటసేపు ఎండలో పెడతారు. ఆ పూలను ΄పొడి చేస్తారు. పది కేజీల పూల నుంచి కేజీ ΄పొడి వస్తుంది. ఆటోమేటిక్ మెషీన్ కాబట్టి మెటీరియల్ పెట్టి సెట్ చేసి ఆ మహిళలు మరొక పని చేసుకోవచ్చు. గంటకు అగరువత్తులు 900, సాంబ్రాణి కడ్డీలైతే మూడు వందల వరకు చేయవచ్చు. రా మెటీరియల్ లభ్యత, మార్కెట్ అవసరాలను బట్టి ఇప్పుడు ఈ మహిళలు రోజుకో గంట పని చేస్తున్నారు. వర్షాకాలంలో పూలను ఎండబెట్టడం కష్టం, కాబట్టి ఆ రోజుల్లో గోమయం కడ్డీలను చేస్తారు. గ్రామాల్లో మహిళలు గోమయాన్ని వేసవిలో సేకరించి ఎండబెట్టి నిల్వ చేసి ఉంచుతారు. ఆసక్తి ఉన్న మహిళలు ఇంట్లోనే రోజుకో గంటసేపు పని చేసుకుని తాము ఉంటున్న అపార్ట్మెంట్, ఇరుగు΄పొరుగు ఇళ్లు, దగ్గరున్న ఆలయాలకు సప్లయ్ చేయవచ్చు. ఇందులో భారీ లాభాలను ఇప్పుడే ఆశించలేం. కానీ పర్యావరణహితమైన పని చేస్తున్నామనే సంతోషం ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాపకంతో ఎకో వారియర్‌గా గుర్తింపు ΄పొందవచ్చు. – సంయుక్త, ఇన్సెన్స్ స్టిక్స్ మెషీన్ ఆవిష్కర్త -
Paragamanjari: పుప్పొడి నేత..పరాగ మంజరి
పూల అందాలను చూసి మైమరచిపోవడం మనకు తెలిసిందే! వాటిలో దాగున్న పరాగ రేణువుల అందం చూస్తే... ప్రకృతి ఒడిలో మనకు తెలియని ఇన్ని అద్భుతాలు దాగున్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే! అత్యంత సంక్లిష్టంగా ఉండే ఆ పరాగ రేణువుల నిర్మాణపు అందాన్ని చూడటమే కాదు, వాటిని టెక్స్టైల్ డిజైన్స్‌లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ ఎమ్మెస్సీ విద్యార్థిని శివాని నేత చిలుకూరి. అత్యంత సూక్ష్మంగా కనిపించే ఈ అద్భుతాలను ‘పరాగ మంజరి’గా మనకు పరిచయం చేస్తున్నది. ‘దేశానికి గుర్తింపు తెచ్చే లక్షలాది యునిక్ డిజైన్స్‌ని పరిచయం చేయబోతున్న ఆనందంలో ఉన్నాను’ అంటున్న శివాని నేత తనప్రాజెక్ట్ విశేషాలను ఇలా మన ముందుంచింది..‘‘పరాగ అంటే పుప్పొడి – మంజరి అంటే డిజైన్. సంస్కృతం నుంచి తీసుకున్న ఈ పదాలను మాప్రాజెక్ట్కు పెట్టాం. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుని, కుదరక బోటనీ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ బోటనీ చేస్తున్నాను. నాకు డ్రాయింగ్ కూడా తెలుసు అని మా బోటనీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి సర్ నాకు ఈ డిజైనింగ్ టాపిక్ ఇచ్చారు. దానిని ఇలా మీ ముందుకు తీసుకు రాగలిగాను.లక్షలాది మోడల్స్పరాగ రేణువులను రెండు విధాలుగా మైక్రోస్కోప్ చేశాను. లైట్ మైక్రోస్కోపీలో ఫ్లవర్ స్ట్రక్చర్, సెమ్(స్కానింగ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్)లో పుప్పొడి రేణువులను స్కాన్ చేశాను. భూమిపైన లక్షలాది మొక్కలు, వాటి పువ్వులు వేటికవి భిన్నంగా ఉంటాయి. ఇక వాటిలోని పరాగ రేణువులు మరింత భిన్నంగా ఉంటాయి. మందార, వేప, తులసి, తిప్పతీగ, తుమ్మ, అర్జున, ఉల్లిపాయ, కాకర, ఆరెంజ్, జొన్న, మొక్కజొన్న, ఖర్జూరం, దోస పువ్వు... ఇలా దాదాపు 70 రకాల పుప్పొడి రేణువులను స్కాన్ చేసి, ఆ స్కెలిటిన్ నుంచి మోటిఫ్స్‌ను వెలుగులోకి తీసుకువచ్చాను. ఈ అందమైన పరాగ రేణువుల నుంచి మోటిఫ్స్ డిజైన్స్‌గా తీసుకు రావడానికి నాలుగు నెలల సమయం పట్టింది.పేటెంట్ హక్కుఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్‌లోనే టెక్స్టైల్ ΄్యాటర్న్ని తీసుకున్నాను. క్లాత్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మాది నేత కుటుంబమే. నేను చేసిన ఈ ప్రింట్స్ క్లాత్స్ మీదకు తీసుకురావచ్చని నిర్ధారణ చేసుకున్నాం. కాటన్, పట్టు, సీకో మెటీరియల్ మీదకు మోటిఫ్స్ ప్రింట్స్ చేయచ్చు. నేతలోనూ డిజైన్స్ తీసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ కూడా చేయచ్చు. మేం ముందు టీ షర్ట్ పైన ప్రింటింగ్ ప్రయత్నం చేశాం. ఇంకా మిగతా వాటి మీదకు ప్రింట్స్ చేయాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మద్దతు అవసరం అవుతుంది. బ్లాక్ ప్రింట్ చేయాలన్నా .. అందుకు తగిన వనరులన్నీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా పేటెంట్ హక్కు ΄÷ందేవరకు వెళ్లింది. దీనిని ఒక స్టార్టప్‌గా త్వరలోప్రారంభించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.టెక్స్టైల్ రంగం మద్దతుతో...ప్రకృతిలో కళ్లకు కనిపించేవి లైట్ మైక్రోస్కోపిక్ ద్వారా నలభై వరకు పిక్చర్స్ తీసుకుంటే, స్టెమ్ ద్వారా మరికొన్ని సాధించాం. కంప్యూటర్లో వియానా దేశం నుంచి పోలెన్ గ్రెయిన్స్ స్కెలిటన్ స్ట్రక్చర్ నుంచి కొన్ని తీసుకున్నాం. మన దేశానికి వేల సంవత్సరాల నుంచి అద్భుతమైన టెక్స్టైల్ డిజైనింగ్ కల్చర్ ఉంది. కలంకారీ, ఇకత్ పోచం పల్లి, గొల్లభామ, రాజస్థాన్‌లో బాందినీ, గుజరాతీలో లెహెరియా, కాశ్మీర్ ఎంబ్రాయిడరీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ‘పరాగ మంజరి’ మన దేశానికే వన్నె తెచ్చేలా తీసుకురావాలన్నది నా ప్రయత్నం. దీనిని తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ శాఖకు అందించి, వారి సపోర్ట్ తీసుకొని, ఈ వర్క్‌ను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని శివాని నేత చిలుకూరి తెలియజేశారు. లక్ష ΄్యాటర్న్స్ఒక్కో చెట్టు పువ్వుకు ఒక్కో ప్రత్యేకమైన పరాగ రేణువులు ఉంటాయి. ఈ పరాగ రేణువుల మోడల్స్ నుంచి కొన్ని లక్షల ΄్యాటర్న్స్ టెక్స్టైల్ రంగంలోకి తీసుకురావచ్చు. వీటిని పట్టు, కాటన్, సిల్క్, బెడ్ షీట్స్.. ఇలా ప్రతి క్లాత్ మీదకు తీసుకురావచ్చు. ఈప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఇలా చేశారా.. అని శోధించాను. కానీ, ఎక్కడా మాకు ఆ సమాచారం లభించలేదు. అందుకే, పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశాం. ఈ ΄్యాటర్న్స్ వస్త్ర డిజై¯Œ పరిశ్రమల్లో గణనీయమైన ప్రభావం చూపుతాయి. – డాక్టర్ అల్లం విజయ భాస్కర్‌రెడ్డి, అసోసియేట్ప్రొఫెసర్, బోటనీ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్శిటీ – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
భారత సంతతి ప్రొఫెసర్‌పై అమెరికాలో జాతి వివక్ష!
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన లక్ష్మీ బాలచంద్ర అనే అసోసియేట్ ప్రొఫెసర్ మసాచుసెట్స్‌లో తాను పని చేస్తున్న బాబ్సన్ కాలేజీపై జాతి, లింగ వివక్ష ఆరోపణలు చేశారు. వీటి కారణంగా కెరీర్ అవకాశాలను కోల్పోయానంటూ కాలేజీపై కేసు కూడా పెట్టారు. అంతేగాక ఆర్థిక నష్టానికి, మానసిక కుంగుబాటుకు లోనయ్యానంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కాలేజీ ఎంట్రప్రెన్యూర్షిప్ డివిజన్‌కు సారథ్యం వహించిన ప్రొఫె సర్ ఆండ్రూ కార్బెట్ ఇందుకు ప్రధాన బాద్యుడు. దీన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా విచారించి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. బాబ్సన్ కాలేజీ శ్వేత జాతీయులకు, అందులోనూ పురుషులకు మాత్రమే పెద్దపీట వేస్తుంది. వారికే ప్రివిలేజీలన్నీ కల్పిస్తుంది’’ అని ఆరోపించారు. ఆమె 2012 నుంచి కాలేజీలో పని చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలను తాము చాలా సీరియస్‌గా తీసుకుంటామని కాలేజీ ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిపై విచారణ జరిపి తప్పిదాలను సరిదిద్దేందుకు పకడ్బందీ వ్యవస్థ అమల్లో ఉందని చెప్పుకొచ్చింది. -
పేపర్ లీకేజి కేసు.. అసోసియేట్ ప్రొఫెసర్ అరెస్టు
పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజి రాకెట్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) ఈ దాడి చేసింది. మహేష్ చంద్ర గుప్తా అనే వ్యక్తి కామర్స్ డిపార్టుమెంటులో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బికనీర్ యూనివర్సిటీ ఎంకాం ఫైనల్ పేపర్, రాజస్థాన్ యూనివర్సిటీలో ఎంఏ కోర్సులోని ఏబీఎస్టీ పేపర్, బీఏ పార్ట్ 3లోని జాగ్రఫీ పేపర్ 1, 2.. ఇవన్నీ గత రెండు నెలల్లో లీకయ్యాయి. ఏప్రిల్ 13వ తేదీన నిర్వహించిన అకౌంటెన్సీ అండ్ బిజినెస్ స్టాటస్టిక్స్ (ఏబీఎస్టీ) పేపర్ లీకేజి కేసులో గుప్తాను అరెస్టు చేశారు. -
‘పిలిచి ఉన్నపళంగా రాజీనామా చేయమన్నారు’
న్యూఢిల్లీ: బెంగళూరులో ఆంగ్ల సబ్జెక్టును బోధించే అసోసియేట్ ప్రొఫెసర్(స్వలింగ సంపర్కుడు)ను విధుల్లో నుంచి తప్పించారు. అతడి వల్ల విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతుందనే కారణంతో ఆయనను బలవంతంగా ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ఈ విషయాన్ని ఆ ప్రొఫెసరే స్వయంగా చెప్పాడు. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ అనే కాలేజీ ఉంది. అందులో ఆంగ్ల విభాగంలో ఆష్లే టెలీస్ అనే వ్యక్తి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఓ స్వలింగ సంపర్కుడు. పైగా ఎల్జీబీటీ హక్కుల ఉద్యమకారుడిగా కూడా ఉన్నాడు. కొన్ని విషయాలతో అతడికి వ్యక్తిగతంగా భిన్నమైన అభిప్రాయాలుండేవి. వాటిని అతడు విద్యార్థులపై రుద్దుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని రాజీనామా చేయాలని కాలేజీ యాజమాన్యం ఆదేశించింది. ఈ విషయాన్ని అతడే తన మాటల్లో ఎలా చెప్పారంటే.. ‘మార్చి 9, 2017న నేను బీకామ్ సెకండియర్ విద్యార్థులకు పాఠం చెబుతున్నాను. ప్రిన్సిపాల్ పిలుస్తున్నారంటూ పాఠం మధ్యలోనే పిలిచారు. అక్కడికి వెళ్లాక పది నిమిషాలు ఎదురుచూడమన్నారు. ఆ తర్వాత పిలిచి ‘నీ వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతోంది. వెంటనే నీ బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్లిపో.. ఇది ఇప్పుడే జరగాలి’ అని చెప్పారు. వాస్తవానికి విద్యార్థులు నిజంగానే డిస్ట్రబ్ అయితే.. అలా చేయడం కూడా బోధకుల పనే. అలా చేయలేకుంటే విద్యార్థులు ఎలా ఆలోచిస్తారు? ఎప్పుడు ఈ ప్రపంచం మారుతుంది? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన తన అనుభవాలను ఫేస్బుక్లో పంచుకున్నారు. -
తెయూ సీఓఈ సస్పెన్షన్
తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి (సీఓఈ) డాక్టర్ మామిడాల ప్రవీణ్‌ను సస్పెండ్ చేస్తూ గత ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చే సిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వర్సీటీవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, 2014 జనవరి నాలుగున కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు వర్సి టీలో పలువురు శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరారు. వారితోపాటు ఎంపికైన ప్రవీణ్ పది రోజుల తర్వాత తెయూ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనను పరీక్షల నియంత్రణాధికారిగా నియమిస్తూ జూలై ఎనిమిదిన అప్పటి ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధర్మరాజు ఉత్తర్వులు జారీ చేశారు. తెయూలో చేరక ముందు డాక్టర్ ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పని చేశారు. ఇక్కడ చేరిన తర్వాత ఓయూలో వెంటనే రాజీ నామా చేయలేదని సమాచారం. ఇక్కడా, అక్కడా వేతనం పొందినట్లు తెలిసింది. ఒకే సమయంలో రెండు యూనివర్సిటీల్లో వేతనాలు పొందినట్లు అందిన ఫిర్యాదు మేరకు గత నెల 16న ప్రవీణ్‌ను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి శనివారం వెలుగు చూశాయి. అప్పటి నుంచి సెలవులో వెళ్లిన ప్రవీణ్, సస్పెన్షన్ ఉత్తర్వులు ఉపసంహరింపజేసుకునేందుకు ఉన్నత విద్యామండలితోపాటు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ప్రొబేషనరీ సమయంలో ఉన్న ప్రవీణ్ ఉద్దేశ పూర్వకంగా రెండు చోట్ల వేతనాలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు భావిస్తే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. పీహెచ్డీ తెలుగు అడ్మిషన్లు రద్దు తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన పీహెచ్డీ తెలుగు విభాగం అడ్మిషన్లను రద్దు చేస్తూ గత ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యార్ డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా ఆల స్యంగా వెలుగు చూసింది. అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు అప్పుడు ఫిర్యా దు చేశారు. దీంతో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఏక సభ్య కమిటీగా నియమించారు. ఆయన విచారణ జరిపి నివేదికను ఇన్చార్జి వీసీకి అందజేశారు. అనంతరం అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చిన వీసీ, ఆర్ట్స్ డీన్ ధర్మరాజు, తెలుగు హెచ్ఓడీ కనకయ్యలకు చార్జ్ మెమో లు జారీ చే శారు. అడ్మిషన్లను రద్దు చేశారు. ఈ విషయమై వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ లింబాద్రిని సంప్రదించగా ఉత్తర్వులు అందిన మాట వాస్తమేనని తెలిపారు. -
భార్యకు దూరంగా ఉన్నానని.. ప్రొఫెసర్ ఆత్మహత్య
భార్యా బిడ్డలకు దూరంగా ఉన్నానన్న మనస్తాపంతో ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గిరిధర్ అనే వ్యక్తి తన ప్రాణాలు తీసుకున్నారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట కాగా, వృత్తిరీత్యా అనంతపురంలోని వైద్య కళాశాలలో ఉండాల్సి వస్తోంది. అయితే భార్యాబిడ్డలు మాత్రం ఆయన సొంత ఊళ్లోనే ఉన్నట్లు సమాచారం. ఆ మనోవేదనతోనే గిరిధర్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. -
ఏఎన్‌యూ నియూమకాల్లో అంతులేని జాప్యం
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెగ్యులర్ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల నియామకాల్లో అంతులేని జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించినప్పటికీ నోటిఫికేషన్ కోసం ఆశావహులు సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయటంతో అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మిగతా ప్రక్రియ ఎపుడు పూర్తవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుుతే తాజా పరిణామాలు వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. సర్వీస్‌పై నూటా అల్టిమేటం.. సర్వీస్ నిబంధనలపై ఏఎన్‌యూ అధ్యాపక సంఘం(నూటా) తాజాగా ఉన్నతాధికారులకు అల్టిమేటం జారీ చేసింది. ప్రస్తుతం ఏఎన్‌యూ, వివిధ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న చాలామంది అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేశారు. వీరిలో ఎక్కువమంది 2006వ సంవత్సరం తరువాత రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులైనవారే. ఈ సర్వీసు ప్రకారం అయితే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ఉండదు. దీంతో రెగ్యులర్ నియామకాలకు ముందు తాము చాలా ఏళ్లు ఇదే యూనివర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించామని, ఆ సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వెలవడక ముందు కూడా నూటా నేతలు ఉన్నతాధికారుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. వర్సిటీని నమ్ముకుని దశాబ్దాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు తమను కాకుండా కొత్తవారిని ఎలా నియమిస్తారని కూడా వారు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించకుండా నియూమకాలు జరపటానికి వీల్లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. నియామకాల్లో వికలాంగులకు న్యాయం చేయకపోతే న్యాయపోరాటానికి సిద్ధమని ఏఎన్‌యూ డిఫరెంట్లీ ఏబుల్ట్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఎంఏ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో ఎప్పటినుంచో ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టును భర్తీ చేయకుండా రెగ్యులర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవటంపై ఎస్టీ విద్యార్థి సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. దీంతో ఎంఏ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో ఎస్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు సక్రమంగా లేవంటూ ఆ విద్యార్థి సంఘం ఆందోళనకు సిద్ధమవుతోంది. పోటీ తీవ్రం.. ఫిర్యాదులకు సిద్ధం కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యూక తొలిసారిగా ఏఎన్‌యూ అధ్యాపక నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు పోటీ పడుతున్నారు. నియామక ప్రక్రియలో చోటు చేసుకుంటున్న లోపాలపై రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నియామకాల్లో వర్సిటీకి ఉన్న నిర్ణయాధికారాన్ని సాకుగా చూపుతూ నోటిఫికేషన్ ప్రకటించిన పది రోజుల తర్వాత ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలను నిర్ణయించటం, డిజాస్టర్ మెంటిగేషన్ సెంటర్ పోస్టుకు ఎంఏ పొలిటికల్ సైన్స్‌ను విద్యార్హతగా నిర్ణయించటం, అన్ని యూనివర్సిటీలకంటే భిన్నంగా ఎంఏ రూరల్ డెవలప్మెంట్ పోస్టుకు ఎంఏ ఎకనామిక్స్ అర్హత తీసివేయటం, ఈ ఏడాది మే నెలలో ప్రకటించిన బ్యాక్లాగ్ నోటిఫికేషన్లో ఎంఏ రూరల్ డెవలప్మెంట్లో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టును చేర్చకుండా ఇటీవల విడిగా నోటిఫికేషన్ విడుదల చేయటం, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేసి వర్సిటీ వెబ్సైట్లో కొన్నిరోజులు ఎస్సీ పోస్టుగా పేర్కొని తర్వాత సవరించటం వంటి అంశాలపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీ ప్రక్రియ సజావుగా జరుగుతుందా అన్న సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. -
ప్రొఫెసర్ కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ!
-
అసోసిమేట్ ప్రొఫెసర్ కిడ్నాప్
-
అసోసియేట్ ప్రొఫెసర్ కిడ్నాప్
హైదరాబాద్: విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అప్పారావును బుధవారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. యూనివర్సిటీ స్టాఫ్ క్వార్టర్స్‌లో ఉంటున్న అప్పారావు ఇంటికి ఒంటిగంట ప్రాంతంలో పదిమంది దుండగులు వచ్చారు. అప్పారావుతో మాట్లాడాలని ఇంట్లోకి వెళ్లిన దుండగులు ఆయన్ను బలవంతంగా కారులో తీసుకుని వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావును సిరిపురం వైపు తీసుకెళ్లినట్టు సమాచారం. తెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అప్పారావుకు ఎలాంటి గొడవలు లేవని కుటుంబ సభ్యులు చెప్పారు. డబ్బుల కోసమా లేక మరే ఇతర కారణంతో కిడ్నాప్ చేశారా అన్న విషయం పోలీసు విచారణలో తెలియాల్సివుంది. -
750 సీట్లకు తనిఖీల గండం!
నవంబర్‌లో ఎంసీఐ అధికారుల రాక ఇరు రాష్ట్రాల్లోని వైద్య కాలేజీల్లో వసతుల పరిశీలన అదనంగా ఎంబీబీఎస్ సీట్లిచ్చినా సౌకర్యాల కల్పనలో ఉదాశీనత అధ్యాపక సిబ్బంది నియమించకుంటే సీట్లు రద్దయ్యే అవకాశం {పభుత్వానికి లేఖ రాసిన వైద్య విద్యాశాఖ ఇప్పటివరకూ స్పందించని సర్కారు హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఇటీవల కేటాయించిన అదనపు ఎంబీబీఎస్ సీట్లను కాపాడుకోవడం ఇరు రాష్ట్రాలకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో తనిఖీల కోసం రానున్నారు. ఎలాంటి లోపాలున్నా సీట్లను రద్దు చేసేందుకు వెనుకాడరు. దీంతో రెండు రాష్ట్రాల అధికారుల్లో గుబులు మొదలైంది. రెండు రాష్ట్రాలకు కలిపి సుమారు 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా కేటాయించారు. వీటిని మంజూరు చేసే సమయంలోనే ఎంసీఐ పలు నిబంధనలు విధించింది. తాము తనిఖీలకు వచ్చే నాటికి విధిగా వసతులు కల్పించాలని, అధ్యాపక సిబ్బంది కొరత లేకుండా చూడాలని స్పష్టం చేసింది. లేదంటే సీట్లను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇందుకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నతాధికారులు అంగీకరించి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అధ్యాపకుల కొరతపై ఆందోళన చాలా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు బోధించేందుకు అధ్యాపకులు లేరు. అనాటమీ, ఫిజియాలజీ తదితర సబ్జెక్టులు చెప్పే దిక్కు లేదు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు రెండు రాష్ట్రాల్లోనూ ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళం, ఒంగోలు, ఆదిలాబాద్ రిమ్స్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత భారీగా ఉంది. ఇప్పటివరకూ ఓ కళాశాలలో తనిఖీలు జరుగుతుంటే మరో కళాశాల నుంచి అధ్యాపకులను తెచ్చి చూపుతున్న సంఘటనలున్నాయి. వీరికి అప్పటికప్పుడు గుర్తింపు కార్డులు కొత్తగా సృష్టిస్తున్నారు. దీనిపై ఎంసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అలాంటివి కుదరదని కఠినంగా హెచ్చరించింది. తెలంగాణలో ఒక్క పోస్టూ భర్తీ కాలేదు ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కాలేజీల్లో 120 ప్రొఫెసర్ పోస్టులు, మరో వందకు పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం 245 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు. మరో 300కు పైగా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ జరగలేదు. అనుమతించాలని అధికారుల మొర భారతీయ వైద్య మండలి అధికారులు త్వరలో తనిఖీలకు వస్తున్న నేపథ్యంలో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్య విద్యాశాఖ అధికారులు నాలుగు రోజుల క్రితం లేఖ రాశారు. దీనికి సంబంధించి అనుమతిస్తే సుమారు 250 పోస్టులను భర్తీ చేస్తామని వివరించారు. సకాలంలో నియామకాలు చేయకుంటే అదనంగా కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే ప్రమాదముందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే వీలైనంత త్వరగా భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నా ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకు లేదు. ఎంసీఐ తనిఖీల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ నెల్లూరు, పద్మావతి కళాశాలలు కొత్తవి కాబట్టి ఉదారంగా వ్యవహరించి ఒక అవకాశం ఇచ్చినా, మిగతా పాత కళాశాలల్లో వసతులు కల్పించలేకపోతే సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. తనిఖీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు భారతీయ వైద్యమండలి సభ్యుడు ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ఉద్యోగాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అసోసియేట్ ప్రొఫెసర్ వయసు: 45 ఏళ్లు దాటకూడదు. విభాగం: ఇంగ్లిష్ జర్నలిజం అర్హతలు: మీడియా స్టడీస్/ కమ్యూనికేషన్/ జర్నలిజంలో పీహెచ్‌డీతో పాటు 12 ఏళ్ల అనుభవం ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.iimc.nic.in భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అర్హతలు: బీఈ/ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ వయసు: 27 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: గేట్-2014 స్కోరు ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వెబ్సైట్: www.bbnl.nic.in -
Try to bear in mind the three P's
Many graduates today are choosing government jobs over the IT sector, as the IT industry is always gripped in the fear of recession. The youth are looking forward to a job in banking sector as it offers job security. The primary thing which is very important is that the candidates who want to take the exam should get familiarized with the syllabus and the pattern of the exam. There is every possibility that the syllabus may change periodically. Staying focused in their preparation is the key to success. In this modern age sources of information pertaining to any competitive exam are aplenty, but the candidates should have a clear understanding in discriminating and segregating the large chunks of data that is available, in order to reach their goal. Appropriate kind of data will guide them in a proper way to turn their dreams into reality. Try to bear in mind the three P's that can be put to use by the aspirants. They are: 1. Planning 2. Preparing & 3. Practicing. Planning essentially: Planning essentially involves knowing the pattern of syllabus and time management. Preparation depends on considering the weightage of each section and concentrating on the topics under each category. "Practice makes a man perfect". Once you are familiarized with the syllabus and pattern of examination chalk out a plan of action. Regular practice will boost the confidence levels and makes you to perform well in the exam. Fluent in English: You need not be fluent in English to crack this competitive exam because spoken English is different from the English for competitive exams. Primary thing is to be familiarized with the basics in grammar and language. Make sure you have adequate knowledge of English and its usage, basically grammar, verbs, adverbs, noun, pronouns, etc in order to crack the exam. As the minimum qualification for taking this exam is graduation obviously all of you who are graduates are already having these basics. Only thing is you need to brush them up based on the topics prescribed for this examination. Always be positive and optimistic and start your preparation well in advance which helps you to crack the exam with better score. Grasp the subject: To answer the sections pertaining to cloze test, sentence completion and Para completion it is essential to read the sentence or passage which is given before choosing the correct answer from the given choices. Grasp the subject, tone, and scale and pay attention to the continuity of the idea in order to pick the correct answer choice. Use the elimination technique in order to eliminate the options and thus finalize the answer. In order to answer the questions based on vocabulary regular reading is essential. Try to practice by answering sample papers, model papers and previous years question papers. Let us take a sample paper as a practice session. Directions: Read the following passage carefully and answer the questions given below it. The roots of the tree were rapidly losing their hold. The birds must have known that something was wrong, because they kept flying up and circling the tree, reluctant to settle in it and reluctant to fly away. As long as the nest was there, the birds would remain flapping about and cawing in alarm. Sarita's wet cotton dress clung to her thin body. The rain ran down from her long black hair. It poured from every leaf of the tree. The birds, too, were drenched and groggy. 1. When the roots of the tree were rapidly losing their hold the birds were a) Unwilling to fly away b) Unable to fly away c) Indifferent to fly away d) To groggy to fly away 2. The birds were reluctant to settle in the tree because a) they had instinctive sense of the tree's impending fall b) their nest had been wiped out c) It was drenched and groggy d) It was pouring hard 3. Sarita couldn't move away because a) The tree was still standing b) There was no other shelter c) She felt friendship with the birds d) She was nervous 4. The birds were reluctant to fly away because a) their nest was in the tree b) they felt friendship with Sarita c) they felt loyal to Sarita d) they could not fly far away 5. The roots of the tree were rapidly losing their hold because a) there was heavy rainfall b) It was very old c) there was a fierce storm d) It was on the edge Directions: Each of the following questions contains a main word in capital letters followed by four words. Select the word that is most similar in meaning to the main word in capital letters. 6. MISOGYNISM a) hate for mankind b) hate for womankind c) love for the reasonable d) love for woman kind 7. OBSTREPEROUS a) sullen b) unruly c) lazy d) awkward 8. LUCRATIVE a) good b) profitable c) excellent d) significant 9. AMBIGUITY a) clarity b) uncertainty c) rationality d) perversity 10. ELUDED a) avoided b) jumped c) crossed d) jilted Directions: The following sentences consist of a word or a phrase which is written in italicized letters. Each of them is followed by four words or phrases. Select the word or the phrase which is closest to the opposite in meaning of the italicized word or phrase. 11. No one can admire a deceitful boy. a) dull b) sincere c) mischievous d) aggressive 12. He gave a shallow argument in defense of his case. a) unpretentious b) learned c) complicated d) considered 13. His health appeared to have further deteriorated because of his exasperating routine at college. a) augmented b) thrived c) improved d) enhanced 14. The remarks made by the advocate in the court were effectively concise. a) obscure b) verbose c) perspicuous d) piquant 15. We have carefully read your explanation and it sounds plausible. a) credible b) reasonable c) desirable d) improbable Directions: Re-arrange the following six sentences A, B, C, D, E and F in proper sequence to form a meaningful paragraph than answer the questions given below them so as to produce the correct sequence. A. The Indian elephant is usually smaller than African elephant. B. The elephants in India prefer to live in places where there is plenty of forest. C. At the beginning of the rains they come out into the open places to eat the green grass. D. But during the rains they move about from forest to forest, always travelling in a single file. E. It is usually about three meters in height and 3000 kg. in weight. F. The African elephant on the other hand, is about 3 and half metres in height and 6000 kg. in weight. 16. The proper sequence should be a) ABCDEF b) ACDBFE c) ADEFBC d) AEFBCD 17. The fifth sentence should be a) B b) C c) D d) E 18. The second sentence in the sequence is a) E b) C c) B d) D 19. The fourth sentence in the sequence should be a) D b) C c) B d) A 20. The third sentence in the sequence should be a) A b) D c) B d) F Directions: Read each sentence to find out whether there is any grammatical error or idiomatic error in it. The error if any will be in one part of the sentence. The number of that part will be the answer. If there is no error, mark (5) as your answer. (Ignore punctuation errors if any.) 21. The young (a) child (b) singed (c) a very sweet song. (d) No error (e) 22. We worked (a) very hard (b) through out (c) the season. (d) No error (e) 23. Neither of (a) these trees (b) have (c) green leaves. (d) No error (e) 24. Among the daughters (a) of Ram (b) Kamala is inferior than Sita (c) in intelligence. (d) No error (e) 25. I am sorry I wasn't at home when you come; (a) I had gone to congratulate (b) for his success in (c) the election. (d) No error (e) Directions: Four alternatives a, b, c and d are given under each sentence, you are required to select the most suitable alternative to fill in the blank/blanks in the sentence to make it meaningful. 26. There is no question of my ____ in examination. a) pass b) failing c) taking d) getting 27. We apologize to all our ____ for the changes in our T.V. programmes this evening. a) viewers b) observers c) spectators d) congregation 28. It was essential to ____ all the initial problems before any progress is made. a) overcome b) overwhelm c) overtake d) overlook 29. Credit card companies ____ hundreds of cards every year. a) take b) give c) issue d) order 30. We are ____ an advertisement to announce our new product. a) printing b) publishing c) giving d) making ANSWERS: 1) A; 2) A; 3) B; 4) A; 5) A; 6) B; 7) B; 8) B; 9) B; 10) A; 11) B; 12) D; 13) C; 14) B; 15) D; 16) D; 17) B; 18) A; 19) C; 20) D; 21) C; 22) E; 23) C; 24) C; 25) A; 26) B; 27) A; 28) A; 29) C; 30) B -
He asked me what I was doing?
Sequence of Sentences Directions: In the following items, some parts of the sentence have been jumbled up. You are required to re-arrange these parts which are labeled as A, B, C, D, E and F to produce the proper sequence. 1. A. Science improves our living conditions but B. There are sufficient reasons for doing so C. Rejecting or accepting anything provided D. And not be afraid of E. Teach us to think straight F. It should also a) ABCDEF b) AFBDEC c) AFEDCB d) BDFCAE 2. A. The girl was holding into piece of wood, but the river was deep and it was carrying her away B. At the same moment, a boy ran up to him and pointed towards the river C. He took off his coat at once, jumped into the water and saved the girl's life. D. It is clear that such a large scale operation E. The young man heard a cry and tuned round but could not see any body F. Are yet to be ascertained. a) ACBDEF b) EDFBAC c) EFBADC d) BDFCAE 3. A. If you want to film a scene in slow motion you run the camera twice as fast as usual which sounds ridiculous but isn't. B. On the screen everything appears at half the speed at which the camera recorded it. C. If you are filming in slow motion, however, the camera runs at twice the normal speed yet, in spite of this, the projector which shows the film will be run at the normal speed and this means that the projector will show the film at half the speed at which it was photographed. D. This is because the camera which took the pictures and the projector which shows them run at the same speed. E. When a film camera is running at normal speed, it takes twenty-four pictures a second. F. When the film is run through the film projector in the camera twenty-four pictures a second appear on the screen a) AEFDCB b) AFBDEC c) FAEDCB d) BDFCAE 4. A. We are living in an age in which technology has suddenly annihilated distance. B. Are we going to let this consciousness of our variety make us fear and hate each other C. Physically we are now all neighbours, but psychologically we are still strangers to each other. D. We have never been so conscious of our variety as we are now that we have come to such close quarters. E. In that event, we should be dooming ourselves to wipe each other out. F. How are we going to react? The proper sequence should be a) ACDFBE b) AFBDEC c) AFEDCB d) BDFCAE 5. A. Widowhood in India used to be especially miserable. B. There were widows even in ages ranging from five to ten. C. A widow was a widow always. D. She could not marry again however tender in age she might be. E. Today nobody looks upon remarriage of widows with disgust or disapproval. F. However, several communities began to rebel against the ill-treatment of widows The proper sequence should be a) ABCDEF b) ACDBFE c) AFEDCB d) BDFCAE 6. A. A country's Freedom can be preserved only by her own strength and self-reliance. B. We must learn to depend on ourselves and not look to others for help every time we are in trouble. C. We should not forget that those who lean too much on others tend to become weak and helpless. D. Certainly we want to make friends with the rest of the world. E. We welcome help and co-operation from every quarter but we must depend primarily on our own re-sources. F. We also seek the good-will and cooperation of all those who reside in this country whatever their race or nationality. The proper sequence should be : a) ABCDEF b) BDFECA c) AFEDCB d) BDFCAE 7. A. Then a chance customer would come. B. Young Lincoln's way of keeping shop was entirely unlike anyone else C. Lincoln would jump up and attend to his needs and then revert to reading. D. He used to lie full length on the counter of the shop eagerly reading a book. E. For some time in his youth, Abraham Lincoln was manager of a shop. F. Never before Lincoln had so much time for reading as he had then. The proper sequence should be: a) ABCDEF b) AFBDEC c) EBDACF d) BDFCAE 8. A. In developing countries like India, where gold is used mainly for ornaments, a distance change in attitude is in the offing. B. Slowly, the use of gold in the form of ornaments will be on the decline and even if gold prices shoot up, women folk would not like to sell off their ornaments. C. The yellow metal will soon be treated as an investment instrument. D. The maxim, "Large the gold reserves, Richer the country" will not hold good for a long time now. E. Again, it would not be an economic proposition to buy and sell gold ornaments as an instrument of investment as buying would be costlier and selling will be at a discount. F. The role of the precious yellow metal is undergoing a dramatic change. The proper sequence should be : a) ABCDEF b) AFBDEC c) AFEDCB d) FDABCE 9. A. The low unit gas is a real temptation to any choosing between gas and electronic processes. B. BY contrast, electricity harnesses a unique range of technologies unavailable with gas. C. With benefits in terms of product quality and overall cleanliness, it can so often be the better and cheaper choice. D. These drawbacks negate the savings many businesses believe they make. E. But gas fired processes are often less efficient, require more floor space, take longer and produce more variable product quality. F. And many electric processes are well over 90% efficient, so far less energy is wasted. a) ABCDEF b) AFBDEC c) AEDBFC d) BDFCAE 10. A. In Haiti, when they make statues of Christ and Satan, they make Christ black and Satan white. B. Aristotle and Plato considered Greeks so innately superior to barbarians that slavery was justified so long as the master was Greek and the slave barbarian. C. Until very recently, it was universally believed that men are congenitally more intelligent than women. D. Among white men, it is held that white men are by nature superior to men of other color, and especially to black men E. Even so enlightened a man a Spinoza decided against votes for women on this ground. F. In Japan, on the contrary, it is thought that yellow is the best color. a) ABCDEF b) AFBDEC c) AEDBFC d) CEDFAB ANSWERS: 1. c; 2. b; 3. a; 4. a; 5. b; 6. b; 7. c; 8. d; 9. c; 10. d. Look at the underlined part of each sentence. Below each sentence are given three possible substitutions for the underlined part. If one of them (a), (b), or (c) is better than the underlined part, indicate your response on the Answer Sheet against the corresponding letter (a),(b),or (c), If none of the substitutions improves the sentence, indicate (d) as your response on the Answer Sheet. Thus a 'No improvement' response will be signified by the letter (d). 1. In the modern world it is difficult to live through one's ideals. a) to live up to b) to live by c) to live for d) No improvement 2. It took a mere five minutes for the world champion to dispose of his opponent. a) dispose to b) disposed c) dispose by d) No improvement 3. It is a common belief that familiarity dispenses with the necessity of politeness. a) dispenses up b) dispenses from c) dispenses of d) No improvement 4. Every human advance carries with it not only automatic benefits but also a new responsibility, and we must remain constantly aware for the dangers that lie in the possible misuse of our enormous skills. a) aware about b) aware of c) aware to d) No improvement 5. Let's buy a new sari with the annual bonus, can we? a) can't we b) shall we c) don't we d) No improvement 6. None of the guests were introduced to the bride. a) was introduced b) introduced c) have been introduced d) No improvement 7. The patients are waiting for the arrival of the doctor for the last two hours. a) were waiting b) have been waiting c) waiting d) No improvement 8. Not only the fans but also the team's head coach were shocked to be in the championship game. a) was b) had c) had being d) No improvement 9. The rules of chess require that one made only one move at a time a) makes b) make c) will make d) No improvement 10. Neither the children in the class nor Tom seem to be upset about failing the lab exam. a) seemed b) seems c) were seem d) No improvement 11. Scarcely had the people retired then the earthquake shook the whole area. a) that b) when c) while d) No improvement 12. No sooner had we arrived at the station when the announcement started. a) than b) then c) while d) No improvement 13. Susheela availed herself of all the leave to her credit. a) availed of b) availed c) availed for d) No improvement 14. If I had won the lottery, I have bought a plane. a) would have b) had c) could d) No improvement 15. He asked me what I am doing a) that what I was doing b) what I was doing c) what was I doing d) No improvement 16. We have read that book, haven't we? a) isn't it ? b) didn't we? c) have we ? d) No improvement ANSWERS: 1. a; 2. d; 3. d; 4. b; 5. b; 6. a; 7. b; 8. a; 9. a; 10. b; 11. b; 12. a; 13. d; 14. a; 15. b; 16. d -
All of the features added to....
Sentence completion is a tricky and important part in every competitive examination. Let us see what kind of strategies you can use to master sentence completion. When it comes to sentence completion, the word that does not appear is the key to the meaning of the sentence. The words that appear offer clues to the missing word. If you can find out how the words that appear are connected, you can find the correct answer. This means that you must know more than just the meaning of the words involved. You must also understand the logic of the sentence. Follow this procedure: 1. Read the entire sentence saying 'blank' for the blank(s). 2. This gives you an overall sense of the meaning of the sentence and helps you figure out how the parts of the sentence relate to each other. 3. If an answer occurs to you before you even look at the choices, you may have a synonym for the answer or the answer itself. 4. Pay special attention to structure words- but, although, however, yet, even though-because they are key to forming the logical structure of the sentence. 5. Be sure your choice is both logical and grammatically correct. Tips: 1. If you don't know some words use elimination. 2. Eliminate one or more of the choices as definitely wrong. 3. Remember, you'd rather look for reasons to eliminate choices than look for reasons to justify a correct answer. 4. While answering dual blanks both words in the choice must be correct in order for you to pick it - if one choice is wrong, the whole choice is wrong. So if you can eliminate a choice based on one of the words, it doesn't matter even if you don't know the other word! 5. Guess the answer choice. 6. Guessing from context is the appropriate way as words can best be understood in context. PRACTICE SET PRACTICE SET 1. She hadn't eaten all day, and by the time she got home she was -------. a. blighted b. brazen c. ravenous d. ostentatious e. blissful 2. The movie offended many of the parents of its younger viewers by including unnecessary ------- in the dialogue. a. vulgarity b. verbosity c. vocalizations d. garishness e. tonality 3. His neighbors found his ------- manner bossy and irritating, and they stopped inviting him to backyard barbeques. a. insentient b. magisterial c. soothing d. restorative e. modest 4. Pramod is always ------- about showing up for work because he feels that tardiness is a sign of irresponsibility. a. Legible b. Tolerable c. Punctual d. Literal e. Belligerent 5. Being able to afford this luxury car will ------- getting a better paying job. a. maximize b. recombinant c. reiterate d. necessitate e. reciprocate 6. Shakespeare, a(n) ------- writer, entertained audiences by writing many tragic and comic plays. a. numeric b. obstinate c. dutiful d. prolific e. generic 7. I had the ------- experience of sitting next to an over-talkative passenger on my flight home from Germany. a. satisfactory b. commendable c. galling d. acceptable e. acute 8. After making ------- remarks to the President, the reporter was not invited to return to the pressroom. a. hospitable b. itinerant c. enterprising d. chivalrous e. irreverent 9. Her ------- display of tears at work did not impress her new boss, who felt she should try to control her emotions. a. maudlin b. meritorious c. precarious d. plausible e. schematic 10. It is difficult to believe that charging 30% on an outstanding credit card balance isn't -------! a. bankruptcy b. usury c. novice d. kleptomania e. flagrancy 11. The ------- weather patterns of the tropical island meant tourists had to carry both umbrellas and sunglasses. a. impertinent b. supplicant c. preeminent d. illustrative e. kaleidoscopic 12. The city council formed a committee to simplify several dozen ------- city ordinances that were unnecessarily complicated and out-of-date. a. feckless b. empirical c. byzantine d. slovenly e. pedantic 13. After a brief and violent ------- that ousted the president, the General declared himself the dictator of the country. a. Nuance b. Coup c. Solicitation d. Upbraiding e. Lament 14. Most people felt the punishment was far too ------- for the crime: what the culprit did was so despicable, even -------, as to warrant a far more severe reprimand. a. permissive ... dormant b. regal ... august c. tolerant ... pompous d. draconian ... nefarious e. lenient ... heinous 15. All of the features added to the new model of the automobile seemed totally ------- and did not add anything of import or practicality to the car. a. obnoxious b. superfluous c. pretentious d. mundane e. prescient 16. Though the play was only two hours long, it was so ------- that it seemed to last eons. a. erroneous b. tedious c. enthralling d. enigmatic e. tantalizing 17. One might think that a great actor's death would be surrounded by much -------, but the man actually died in -------. a. equanimity… obeisance b. publicity… obscurity c. fanfare… scandal d. balderdash… uncertainty e. surprise… penitence 18. My neighbor is both ------- and -------; he keeps himself and has great fear of anyone who isn't from our town. a. callous… predisposed b. misanthropic… tolerant c. insular… xenophobic d. ignorant… biased e. prejudiced… obstinate 19. Practical applications of computer programs are ------- and include sorting numbers, maintaining records, and directing email. a. restricted b. infrequent c. widespread d. enormous e. holistic 20. Almost all measures of the efficiency of a government are linked to national economic ------- and to the prosperity of the public. a. derogation b. ennui c. physiognomy d. proficiency e. fusillade 21. He was raised in a ------- religious home, and so he found ------- in prayer and personal meditation. a. zealously --- confusion b. obsessively --- distraction c. devoutly --- peace d. retentive --- enjoyment e. compassionate --- anger 22. One of the most effective ways to resolve conflict is to seek an outside mediator, someone who can hear both sides of the argument and attempt to ------- the angered parties. a. inflame b. pacify c. outwit d. bolster e. entice 23. Almost every nation in the world has a holiday to ------- its birth, and the U.S. A is no exception. a. disparage b. sacrifice c. malign d. worship e. observe 24. The helicopter ------- over the scene of the accident and lingered at a low altitude. a. soared b. hovered c. excelled d. collided e. stormed 25. Harish's mother and father both had to ------- him from his sleep because he had slept through his alarm. a. fluctuate b. deliver c. lull d. tremble e. rouse Answers: 1) c; 2) a; 3) b; 4) c; 5) d; 6) d; 7) c; 8) e; 9) a; 10) b; 11) e; 12) c; 13) b; 14) e; 15) b; 16) b; 17) b; 18) c; 19) e; 20) d; 21) c; 22) b; 23) e; 24) b; 25) e -
అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్ ఎల్లోసా
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా ఢిల్లీ యూనివర్సిటీ న్యాయవిభాగంలో మార్చి 21 నుంచి 23 వరకు నిర్వహించనున్న రెండు అంతర్జాతీయ సమావేశాల్లో పత్ర సమర్పణకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ హక్కులు, మేథో సంపత్తి హక్కులు తదితర చట్టసంబంధ అంశాలపై ఈ సదస్సులో ఆయన చర్చిస్తారు. ఈ సమావేశాల్లో సుమారు 20 దేశాలకు చెందిన న్యాయ విభాగం నిపుణులు పాల్గొనబోతున్నారని ఎల్లోసా తెలిపారు.