భార్యా బిడ్డలకు దూరంగా ఉన్నానన్న మనస్తాపంతో ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నారు.
భార్యా బిడ్డలకు దూరంగా ఉన్నానన్న మనస్తాపంతో ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గిరిధర్ అనే వ్యక్తి తన ప్రాణాలు తీసుకున్నారు.
ఆయన స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట కాగా, వృత్తిరీత్యా అనంతపురంలోని వైద్య కళాశాలలో ఉండాల్సి వస్తోంది. అయితే భార్యాబిడ్డలు మాత్రం ఆయన సొంత ఊళ్లోనే ఉన్నట్లు సమాచారం. ఆ మనోవేదనతోనే గిరిధర్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.