హైదరాబాద్: విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అప్పారావును బుధవారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. యూనివర్సిటీ స్టాఫ్ క్వార్టర్స్లో ఉంటున్న అప్పారావు ఇంటికి ఒంటిగంట ప్రాంతంలో పదిమంది దుండగులు వచ్చారు. అప్పారావుతో మాట్లాడాలని ఇంట్లోకి వెళ్లిన దుండగులు ఆయన్ను బలవంతంగా కారులో తీసుకుని వెళ్లారు.
కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావును సిరిపురం వైపు తీసుకెళ్లినట్టు సమాచారం. తెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అప్పారావుకు ఎలాంటి గొడవలు లేవని కుటుంబ సభ్యులు చెప్పారు. డబ్బుల కోసమా లేక మరే ఇతర కారణంతో కిడ్నాప్ చేశారా అన్న విషయం పోలీసు విచారణలో తెలియాల్సివుంది.