
పేపర్ లీకేజి కేసు.. అసోసియేట్ ప్రొఫెసర్ అరెస్టు
పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజి రాకెట్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) ఈ దాడి చేసింది. మహేష్ చంద్ర గుప్తా అనే వ్యక్తి కామర్స్ డిపార్టుమెంటులో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
బికనీర్ యూనివర్సిటీ ఎంకాం ఫైనల్ పేపర్, రాజస్థాన్ యూనివర్సిటీలో ఎంఏ కోర్సులోని ఏబీఎస్టీ పేపర్, బీఏ పార్ట్ 3లోని జాగ్రఫీ పేపర్ 1, 2.. ఇవన్నీ గత రెండు నెలల్లో లీకయ్యాయి. ఏప్రిల్ 13వ తేదీన నిర్వహించిన అకౌంటెన్సీ అండ్ బిజినెస్ స్టాటస్టిక్స్ (ఏబీఎస్టీ) పేపర్ లీకేజి కేసులో గుప్తాను అరెస్టు చేశారు.