Rajasthan University
-
40 మంది మహిళా ప్రొఫెసర్లకు అసభ్యకర కాల్స్
జైపూర్ : ఇంటర్నెట్ సహాయంతో 40 మంది మహిళా ప్రొఫెసర్లకు అసభ్యకర కాల్స్ చేస్తున్న ఓ టీనేజర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని హిస్సార్‌కు చెందిన నిందితుడు రాజస్తాన్ యూనివర్సిటీలో తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో యూనివర్సిటీ వైఫై పాస్వర్డ్ తెలుసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులకు చిక్కకుండా ఈ దారుణానికి వైఫై సహాయంతో ఇంటర్నెట్ కాల్స్‌ను ఉపయోగించాడు. పైగా యూనివర్సిటీ వెబ్సైట్ నుంచే మహిళా ప్రొఫెసర్ల మొబైల్ నెంబర్లు తీసుకొని అసభ్యకర పదజాలంతో వేధించాడు. జూలై 3న ఓ మహిళా ప్రొఫెసర్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. నిందితుడు ఎలాంటి ఆధారం లేకుండా జాగ్రత్త పడటంతో ఇబ్బంది పడ్డారు. చివరకు ఫోన్‌కాల్స్ వస్తున్న ఐపీ అడ్రస్ ఆధారంగా కూపి లాగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
పేపర్ లీకేజి కేసు.. అసోసియేట్ ప్రొఫెసర్ అరెస్టు
పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజి రాకెట్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) ఈ దాడి చేసింది. మహేష్ చంద్ర గుప్తా అనే వ్యక్తి కామర్స్ డిపార్టుమెంటులో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బికనీర్ యూనివర్సిటీ ఎంకాం ఫైనల్ పేపర్, రాజస్థాన్ యూనివర్సిటీలో ఎంఏ కోర్సులోని ఏబీఎస్టీ పేపర్, బీఏ పార్ట్ 3లోని జాగ్రఫీ పేపర్ 1, 2.. ఇవన్నీ గత రెండు నెలల్లో లీకయ్యాయి. ఏప్రిల్ 13వ తేదీన నిర్వహించిన అకౌంటెన్సీ అండ్ బిజినెస్ స్టాటస్టిక్స్ (ఏబీఎస్టీ) పేపర్ లీకేజి కేసులో గుప్తాను అరెస్టు చేశారు. -
47 ఏళ్ల తర్వాత సాధించాడు!
జైపూర్: మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటుంటారు. రాజస్థాన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 81 ఏళ్ల అజిత్ సింగ్ సింఘ్వి విషయంలో ఇదే జరిగింది. ఎల్ఎల్ బీలో సాధించిన గోల్డ్ మెడల్ 47 ఏళ్ల తర్వాత ఆయన అందుకున్నారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి 1969లో ఆయన ఎల్ ఎల్ బీ చేశారు. పరీక్షల్లో అందరికంటే ఆయన ఎక్కువ మార్కులు సాధించారు. అయితే ప్రతిభాసామర్థ్యాల ఆధారంగా ఆయన రెండో స్థానంలో నిలిచినట్టు యూనివర్సిటీ ప్రకటించింది. మార్కులు ఒకటే కొలమానం కాదని తెలిపింది. యూనివర్సిటీ నిర్ణయంపై కోర్టుకెక్కారు. అత్యధిక మార్కులు సాధించిన తనకు మొదటి స్థానం ఇవ్వాలని, దీనికి అనుగుణంగా ఫలితాన్ని తిరిగి ప్రకటించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. చివరకు రాజస్థాన్ హైకోర్టులో కేసు గెలిచారు. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో సింఘ్వికి రాజస్థాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జేపీ సింఘాల్ గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేశారు.