![Telangana University Vice Chancellor Dance After Ganesh Immersion - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/11/DANCE.jpg.webp?itok=qw-2Umdv)
సాక్షి, తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ గుప్తా క్యాంపస్‌లోని విద్యార్థినులతో కలిసి గురువారం రాత్రి చేసిన డ్యాన్సులు వివాదాస్పదంగా మారాయి. ఒక వీసీ.. అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ, క్యాబరే తరహాలో డబ్బులు వెదజల్లడమేంటంటూ శనివారం ఉదయం నుంచి టీవీలు, సామాజిక మాధ్యమాల్లో కథనాలు ప్రసారం అయ్యా యి. వీసీ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు గర్ల్స్ హాస్టల్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌పై వీసీ రవీందర్ గుప్తా శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో స్పందించారు. గణేశ్ నిమజ్జనం రోజు విద్యార్థినుల కోరిక మేరకే హాస్టల్ వద్దకు వెళ్లానని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని, డ్యాన్సులు చేస్తూ డబ్బులు వెదజల్లానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. అనవసరమైన, అవాస్తవమైన వార్తలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలుంటాయని, గణేశ్ నిమజ్జనంలో వీసీ ఒక భక్తుడిగా మాత్రమే పాల్గొన్నారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్ధిని పేర్కొన్నారు.
చదవండి: (మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం)
Comments
Please login to add a commentAdd a comment