సినీ ఫక్కీలో బ్యాగు చోరీ | Shop Owners Bag Stolen By Thieves In Dichpally | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ షాపు యజమాని బ్యాగు దొంతగనం

Jan 16 2020 2:34 PM | Updated on Jan 16 2020 3:38 PM

Shop Owners Bag Stolen By Thieves In Dichpally - Sakshi

సాక్షి, డిచ్‌పల్లి: నిజామాబాద్‌లోని డిచ్‌పల్లి మండల కేంద్రంలో చోరీ జరిగింది. డిచ్‌పల్లికి చెందిన శివసాయి అనే వ్యాపారి ఎప్పటిలానే గురువారం తన బంగారు ఆభరణాల దుకాణాన్ని తెరిచేందుకు వెళ్లాడు. ఈ సమయంలో బ్యాగును తన బైక్‌పై పెట్టి దుకాణం తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే అదనుగా భావించిన దొంగలు సినీ ఫక్కీలో మరో బైక్‌పై వచ్చి బ్యాగును ఎత్తుకెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగు తిన్న షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో రూ.15 లక్షల విలువ చేసే నగలు, నగదు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement