తెయూ (డిచ్‌పల్లి) : యువ న్యాయవాదులు నిబద్ధతతో, నిజాయితీతో కఠోరంగా శ్రమించినప్పుడే వృత్తిలో రాణిస్తారని సీబీఐ విశ్రాంత న్యాయమూర్తి కె.రఘునాథరావు సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ లా కళాశాల ఆధ్వర్యంలో బుధవారం నేషనల్ లా డే వేడుకలను సెమినార్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరావు లా విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. విజయానికి దగ్గర దారులుండవని, అంకిత భావంతో కూడిన శ్రమయే మార్గమని వివరించారు. దేశంలో అన్ని రకాల క్రిమినల్ కేసులలో పడే శిక్షలు నాలుగు శాతం ఉంటే, ఏసీబీ కేసులలో 40 శాతం ఉందన్నారు.
సీబీఐ కేసులలో 70 శాతం పైనే ఉంటుందన్నారు. సమాజంలో నైతిక విలువల పతనమే దేశంలో అవినీతి పెరుగుతుండడానికి ప్రధాన కారణమని అభిప్రాయం వ్యక్తం చేశా రు. అవినీతి అంతానికి, అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ నగరాన్ని త్వరలోనే స్మార్ట్ సిటీగా మలచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
యువ న్యాయవాదులు సమాజ హితానికి తమ వి ద్యను ఉపయోగించాలని సూచించారు. లాక ళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా జాతీ య న్యాయ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. మన రాజ్యాంగం ఆఫ్రికన్, లాటిన్ అ మెరికా దేశాలకు ఆదర్శప్రాయమైందన్నారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లాభాయ్ పటేల్ కృషి అమోఘమని కొనియాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌ఎల్ శాస్త్రి, మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపా ల్ సత్యనారాయణాచారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శివకుమార్, డాక్టర్ శోభారాణి, డాక్టర్ ప్రసన్న, స్రవంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.
విజయానికి దగ్గర దారులుండవు
Published Thu, Nov 27 2014 4:03 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
Advertisement