
సాక్షి, ఇందల్వాయి: 150 కిలోల టమాటాలకు కిలో మటన్ ఏమిటీ అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజమే. ఇందల్వాయి మండలం నల్లవెల్లికి చెందిన టమాట రైతు నోముల శ్రీనివాస్ రెడ్డి తన పొలంలో పండిన 150 కిలోల టమాటాలను ఇందల్వాయి మార్కెట్లో ఆదివారం హోల్‌సేల్‌గా విక్రయిస్తే అతనికి వచ్చింది కేవలం రూ.500 మాత్రమే వచ్చాయి. ఆదివారం కావడంతో ఇంటికి మటన్ తీసుకెళ్దామని అక్కడే ఉన్న మటన్ దుకాణానికి వెళ్తే కిలో మటన్ రూ.550 ఉండటంతో మరో రూ.50 వేసి కొనాల్సి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా టమాటాలు కొనేవారు కరువయ్యారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. (టమాట రైతులకు కన్నీళ్లే గిట్టుబాటు!)
Comments
Please login to add a commentAdd a comment