తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం పీ హెచ్‌డీ కోర్సుల ప్రవేశాలలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదులపై ఏకసభ్య కమిటీ మంగళవా రం విచారణ జరిపింది. తెయూ గత ఇన్‌చార్జి వీసీ శైలజా రామయ్యర్ తనకు అందిన ఫిర్యాదుల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఏకసభ్య విచారణ కమిటీగా నియమించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ఆర్ట్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ ధర్మరాజుతో కలిసి నాగేశ్వరరావు విచారణ నిర్వహించారు.
ఆయన రాకను తెలుసుకున్న పీహెచ్‌డీ ప్రవేశాలు పొందిన అభ్యర్థులు రిజిస్ట్రార్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. తమకు మెరిట్ వచ్చినా అడ్మిషన్ ఇవ్వకుం డా అక్రమాలకు పాల్పడ్డారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు అల్లాడి రమేశ్, వి.గాయత్రితోపాటు టీఆర్‌ఎస్‌వీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ధాత్రిక స్వప్న విచారణ కమిటీ సభ్యుడికి వినతి పత్రం అందజేశారు. కొందరు విద్యార్థి సంఘాల నాయకులకు పీహెచ్‌డీలో అడ్మిషన్లు ఇవ్వడానికి కటాప్ మార్కులు తగ్గిం చారని, అనర్హులకు అడ్మిషన్లు ఇచ్చి, అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు.
దీంతో అక్కడే ఉన్న అడ్మిషన్ పొందిన పీహెచ్‌డీ స్కాలర్స్, బాధితులతో వాగ్వివాదా నికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి పోలీసులు వెంటనే వర్సిటీకి చేరుకుని అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చే పట్టారు. మూడు నెలల నుంచి తెలుగు హెచ్‌వోడీ, డీన్‌ల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్‌డీ సీట్లను డబ్బులు తీసుకుని అనర్హులకు అమ్ముకున్నారని ఆరోపించారు.
ఇంటర్వూ కమిటీ, నిపుణుల సం తకంతో కూడిన మెరిట్ జాబితాను ప్రకటించలేదన్నారు. మెరిట్ జాబితాను ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. ఇంట ర్వూ కమిటీ సభ్యులు, నిపుణులు ఎంపిక చేసిన జాబితాను మార్చి తమకు అనుకూలంగా ఉన్న వారికి అక్రమంగా అడ్మిషన్లు ఇచ్చారని ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
విచారణ కమిటీని రద్దు చేయాలి
తెయూ పీహెచ్‌డీ అడ్మిషన్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తెలుగు విభాగంలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై నియమించిన ఏకసభ్య కమిటీని వెంటనే రద్దు చేయాలని అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ చాంబర్‌లో బైఠాయించి నిరసన తెలి పారు. కొందరు అధ్యాపకులు తెలంగాణ యూనివర్సిటీ పరువు తీయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మెరిట్ జాబితాను పరిశీలించి న్యాయం చేస్తాం..
ఎంపిక కమిటీ, సబ్టెక్టు నిపుణులు ఇంటర్వ్యూలు నిర్వహించి విడుదల చేసిన జాబితాను పరిశీలిస్తామని విచార ణ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ నా గేశ్వరరావు విలేకరులకు తెలిపారు. సబ్జెక్టు నిపుణుడిగా ప్రొఫెసర్ చెన్నప్ప వ్యవహరించారని, తనకు బాధితులు అందజేసిన జాబితాపై ఆయన సం తకం లేదన్నారు. వర్సిటీ అధికారుల వద్ద అసలైన మెరిట్ జాబితా తీసుకుని రెండింటినీ పరిశీలించి అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయా లేదో తేలుస్తానన్నారు. అడ్మిషన్లలో అర్హులకు అన్యాయం జరిగినట్లు తేలితే న్యా యం జరిగేలా చూస్తానని, అనర్హులకు అడ్మిషన్లు ఇచ్చినట్లు తేలితే చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని ఆయన స్పష్టం చేశారు.
‘పీహెచ్‌డీ’ వివాదాలపై విచారణ
Published Wed, Nov 19 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement