PhD Admissions
-
నెట్ పరిధిలో చేర్చొద్దు
సాక్షి, హైదరాబాద్: పీహెచ్డీ ప్రవేశాలను యూజీసీ నెట్ పరిధిలో చేర్చేందుకు సిద్ధమైన రాష్ట్ర యూనివర్సిటీలు, తాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నాయి. ఎప్పటిలాగే యూనివర్సిటీల అర్హత పరీక్ష ద్వారానే ప్రవేశాలు కలి్పంచాలని నిర్ణయించాయి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు లేఖ రాయనున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే లేఖను సిద్ధం చేసింది. మరోవైపు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ కూడా యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్‌ను కలిసి ఈ విషయం స్పష్టం చేసినట్టు తెలిసింది. యూజీసీ ప్రతిపాదన ప్రకారం పీహెచ్‌డీలను జాతీయ అర్హత పరీక్ష (నెట్) ద్వారా భర్తీ చేయాలన్న ప్రతిపాదన వల్ల ఇబ్బందులున్నాయని చెప్పినట్టు సమాచారం. తీవ్రంగా వ్యతిరేకించిన విద్యార్థులు రాష్ట్రంలో ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీలో అత్యధికంగా పీహెచ్‌డీలు చేస్తుంటారు. ప్రతి ఏటా 200కు పైగా విద్యార్థులకు అవకాశం కలి్పస్తారు. ఈ ప్రవేశాలు రెండు రకాలుగా ఉంటాయి. నెట్, కేంద్ర ప్రభుత్వం నుంచి జూనియర్ రీసెర్చి ఫెలోషిప్‌కు ఎంపికైన వారిని ఒక కేటగిరీగా భావిస్తారు. మొత్తం సీట్లల్లో సగం వీరికి కేటాయిస్తారు. మిగిలిన సగం సీట్లను యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. అయితే ఈ ఏడాది మార్చిలో యూజీసీ కొత్త నిబంధనను తీసుకొచి్చంది. జాతీయ విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా పీహెచ్డీ ప్రవేశాలను జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. దీని అమలుకు రాష్ట్రంలోని వర్సిటీలు కూడా సిద్ధమయ్యాయి. అయితే విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచి్చంది. పలు విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. దీంతో దీనిపై సమీక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. నెట్‌తో అయితే నష్టమేంటి? జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష వల్ల తమకు నష్టం జరుగుతుందనేది విద్యార్థుల ఆందోళన. పాఠశాల స్థాయి నుంచి పీజీ స్థాయి వరకూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అరకొర వసతులతో చదువుతున్నారు. చాలా కాలేజీల్లో జాతీయ స్థాయి ప్రమాణాలు లేవు. రాష్ట్ర స్థాయి సిలబస్‌తోనే విద్యాభ్యాసం ముగిస్తారు. నెట్ పేపర్ పూర్తిగా జాతీయ స్థాయిలో ఉండే సిలబస్ నుంచి ఇస్తారు. యూనివర్సిటీ నిర్వహించే అర్హత పరీక్షతో పోలిస్తే ఇది కఠినంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో పోటీ పడటం, ఎంపిక కావడం కష్టమని వారు భావిస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య నెట్ ద్వారా అర్హత పొంది పీహెచ్డీ చేయడం కష్టమని అంటున్నారు. ఈ వాదనతో ఏకీభవిస్తున్న వర్సిటీలు, అధికారులు విషయం యూజీసీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. -
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా
కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారని, పైగా తాము కొట్టలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సమర్ధించుకోవటంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షలు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు సిద్ధమేనా? అని సీపీకి సవాల్ విసిరారు. ఈ నెల 5న క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్ ఆఫీస్ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తమను పోలీసులు కొట్టారని విద్యా ర్థులు జడ్జి ఎదుట తెలిపారు. కాగా, ఆ విద్యార్థి నాయకులను శుక్రవారం రఘునందన్‌రావు కేయూ దూరవిద్య కేంద్రం ఆవరణలో పరామర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న వీసీపై విచారణ జరపాల్సింది పోయి, ఆయనతో కలసి సీపీ ప్రెస్‌మీట్ నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. వీసీ, పీహెచ్డీ అవకతవకల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల, ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12న వరంగల్ జిల్లా బంద్ చేపట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు తమని అరెస్ట్‌చేసి టాస్క్‌పోర్స్ పోలీసులతో కొట్టించారంటూ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. -
ఓయూలో పీహెచ్డీ పర్యవేక్షణకు ప్రొఫెసర్ల కొరత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పర్యవేక్షణకు (గైడ్) ప్రొఫెసర్ల తీవ్ర కొరత నెలకొంది. గత 10 సంవత్సరాలుగా నియామకాలు చేపట్టకపోవడంతో అధ్యాపకుల సంఖ్య 1254 నుంచి 362కు తగ్గింది. తాత్కాలికంగా అధ్యాపకులను నియమించి బోధనను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్ కాలేజీలతో పాటు అనుబంధ కాలేజీల్లో 362 మంది పర్మనెంట్ అధ్యాపకులు పని చేస్తున్నారు. ఓయూ పరిధిలోని ఐదు జిల్లాల పీజీ కేంద్రాలను కాంట్రాక్టు అధ్యాపకులతోనే నిర్వహిస్తున్నారు. ఓయూలో కాంట్రాక్టు 430, పార్టుటైం అధ్యాపకులు 260 మంది పని చేస్తున్నారు. కాంట్రాక్టు, పార్టుటైం అధ్యాపకులతో పాటు సుమారు 200 మంది పర్మనెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ గైడ్షిప్ అర్హత లేదు. గైడ్షిప్ గల 162 మంది పర్మనెంట్ అధ్యాపకుల వద్ద గతంలో ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్‌డీలో కొనసాగుతుండగా కొత్త వారికి అవకాశం దక్కడం లేదు. ఆరేళ్ల తర్వాత.. ఓయూలో ఆరు సంవత్సరాల తర్వత పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఆరేళ్లలో ఓయూనే పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 50 వేలకు పైగా ఉండగా ఇతర వర్సిటీలకు చెందిన వారు మరో 15 వేల మంది ఉన్నారు. గతంలో ఓయూలో 1254 పర్మనెంట్ అధ్యాపకులు పనిచేయగా వారిలో సగం మందికి పీహెచ్డీ గైడ్షిప్ అర్హత ఉండేది. ఒక్క అధ్యాపకుని వద్ద 8 మంది విద్యార్థులకు పరిశోధనలకు అవకాశం కల్పిస్తారు. దీంతో ఏటా పార్ట్‌టైం, ఫుల్‌టైం పీహెచ్‌డీలో సుమారు 4 వేల మందికి ప్రవేశాలు లభించేవి. అయితే అధ్యాపకుల కొరత కారణంగా ప్రస్తుతం వేయి మందికి కూడా పీహెచ్డీ అవకాశం దక్కేలా లేదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్డీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ తర్వాత కొత్త వారిని నియమించకపోవడంతో బోధనకు, పరిశోధనకు కొరత ఏర్పడింది. 105 ఏళ్ల ఓయూ చరిత్రలో తొలిసారిగా ఈ విద్య సంవత్సరం నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ కోర్సులకు అనుమతినిచ్చారు. ఓయూ పరిధిలోని దరఖాస్తు చేసుకున్న 15 అటానమస్ కాలేజీల్లో పని చేసే అర్హత గల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశాలను కల్పించారు. ఓయూలో పని చేసే పార్టుటైం, కాంట్రాక్టు అధ్యాపకులు బోధనకే పరిమితం. రెండేళ్ల క్రితం వరకు అర్హత గల కాంట్రాక్టు అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశం ఉండేది. అయితే వివిధ కారణాల నేపథ్యంలో వారికి గైడ్షిప్ను రద్దు చేశారు. (క్లిక్: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్!) పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కొనసాగించాలి ఓయూలో పాత పద్దతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలి. కొత్త పద్ధతిలో అడ్మిషన్లకు పీహెచ్డీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కొత్త విధానంలో అడ్మిషన్లతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, యూజీసీ నెట్, జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. వీసీ ప్రొ.రవీందర్ సొంత నిర్ణయాలు పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తాయి. కాకతీయ వర్సిటీ తరహాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేసే అర్హత గల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గైడ్షిప్ ఇవ్వాలి. కొత్త విధానంతో పీహెచ్డీ ప్రవేశాలను చేపడితే అడ్డుకుంటాం. – కొర్ర శరత్‌నాయక్ పరిశోధనలు కుంటుపడతాయి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ చదివితే హాస్టల్ వసతి, ఫెలోషిప్‌లకు అవకాశం ఉండదు. సంపాదించే వయస్సులో పీహెచ్డీ చేయడమే ఎక్కువ.. పరిశోధనలకు రూ.లక్షలు ఖర్చు చేయాలంటే పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక భారం అవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల విద్యార్థులకు సొంతంగా ఖర్చుపెట్టుకుని పీహెచ్డీ చదివే ఆర్థిక స్థోమత ఉండదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్డీ అనుమతితో అధిక శాతం మంది పరిశోధనలు చేయలేరు. దీంతో పరిశోధనలు కుంటుపడతాయి. ఓయూలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో అర్హత గల వారికి గైడ్షిప్కు అవకాశం కల్పించాలి లేదా ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయాలి. – బైరు నాగరాజుగౌడ్ ఓయూ విద్యార్థులపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని ఆందోళన చేస్తున్న ఓయూ జేఏసీ నాయకులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. బుధవారం ఓయూ పాలన భవనం ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు వీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై టాస్క్‌ఫోర్స్ పోటీసులు విరుచుకుపడ్డారు. విద్యార్థులపై దాడి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో నవ తెలంగాణ విద్యార్థి సంఘం (ఎన్టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజుగౌడ్ సృహ తప్పి పడిపోగా అతడిని ఆసుపత్రికి తరలించారు. ధర్నాలో పాల్గొన్న 27 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి మలక్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కొత్త విధానంతో విద్యార్థులు నష్టపోతారని పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. (క్లిక్: హైదరాబాద్ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ) -
OU: 2016కు ముందు పీహెచ్డీ అడ్మిషన్లు రద్దు!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): వచ్చే నెల చివరి నాటికి పీహెచ్డీ పరిశోధనలు పూర్తి చేయకుంటే 2016 కంటే ముందు ప్రవేశం పొందిన విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం పీహెచ్డీ నాలుగేళ్లలో పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని విద్యార్థులకు రెండేళ్ల గడువు పొడిగిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం ఆరేళ్లు దాటిన పీహెచ్డీ విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తామని, ఇంత వరకు పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే థీసిస్‌ను సమర్పించాలని అన్నారు. బయోమెట్రిక్ లేకుంటే జరిమానా సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ గుర్తింపు ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ అధికారులు మరో సారి గుర్తుచేశారు. ఈ నిబంధన అనుసరించని కాలేజీకి రూ.20 వేలు జరిమానా విధిస్తామని, అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేస్తామని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు మొత్తం యూనివర్సిటీకి అనుసంధానమయ్యేలా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూ హెచ్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. బీటెక్ మేనేజ్మెంట్ సీట్ల గడువు 20 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మాకాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కాలేజీలను ఆదేశించింది. వాస్తవానికి యాజమాన్య కోటా సీట్ల భర్తీని గతనెల 30వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కంప్యూటర్ సైన్స్ సీట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
పరిశోధన.. వేదన
హేమలత ఎంబీఏ విభాగంలో ఎగ్జిక్యూటివ్ కోటాలో అడ్మిషన్ పొందడానికి ఎనిమిది నెలల కిందట ఆసక్తి ప్రదర్శించారు. సంబంధిత విభాగం గైడ్ ఆమోదం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు. అయితే అకడమిక్ స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందలేదు. కారణమేమిటంటే పది నెలల నుంచి అకడమిక్ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించలేదు. దీంతో పీహెచ్డీ అడ్మిషన్ పొందని పరిస్థితి నెలకొంది. ఒక్క ఎగ్జిక్యూటివ్ కోటాలోనే కాదు. ఇండస్ట్రీ కోటా.. ఇంటర్నల్ పీహెచ్డీ అడ్మిషన్ల పరిస్థితీ ఇంతే. ఇలా అన్ని కోటాలోనూ పీహెచ్డీ అడ్మిషన్లు జరపని కారణంగా పరిశోధన విద్యార్థులకు దిక్కుతోచని స్థితి నెలకొంది. ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పీహెచ్డీ అడ్మిషన్లలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్థిష్టమైన సమయంలో పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించకపోవడంతో ప్రోగ్రామ్ కాల పరిధి ఆలస్యం అనివార్యం కానుంది. పీహెచ్‌డీలో కనీసం మూడు సంవత్సరాలు, గరిష్టంగా ఐదు సంవత్సరాలు కాల వ్యవధి ఉంటుంది. ఈ నేపథ్యంలో అడ్మిషన్లు ఆలస్యం కావడంతో కాలయాపన తప్పనిసరి. జేఎఆర్ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్)కు ఎంపికైన పరిశోధన విద్యార్థులు పీహెచ్డీ అడ్మిషన్ కాకపోవడంతో ఫెలోషిప్ చేజారే పరిస్థితి నెలకొంది. నిర్థిష్టమైన సమయంలో పీహెచ్డీ పూర్తి చేస్తే పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్) ప్రాజెక్ట్ దరఖాస్తుకు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంటుంది. నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపుకు గీటురాయి. ఈ క్రమంలో ఎస్కే యూనివర్సిటీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అయిన పరిశోధనలను విస్మరించడంతో న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) పాయింట్లలోనూ, గ్రేడింగ్‌లోనూ వెనుబాటుతనం తప్పనిసరి పరిస్థితి ఎదురుకానుంది. గతంలో న్యాక్ గ్రేడింగ్‌లో వెనుకబడడంతో రూ.100 కోట్ల రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) నిధుల స్థానంలో రూ. 20 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. గైడ్ల కొరతతో సతమతం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మొత్తం 120 బోధన పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో భర్తీ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. తాజాగా 70 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. ఒక్కో ప్రొఫెసర్‌కు ఐదుగురు ఫుల్‌టైం, ముగ్గురు పార్ట్‌టైం స్కాలర్లను కేటాయిస్తున్నారు. అరకొరగా ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ అకడమిక్ స్టాండింగ్ కౌన్సిల్, రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు క్రమంగా జరగకపోవడంతో ఆశించిన స్థాయిలో పీహెచ్డీ అడ్మిషన్లు కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు పీహెచ్డీ అడ్మిషన్లకు రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రాలు కఠినంగా ఉండడంతో పాటు మైనస్ మార్కుల నిబంధన ఉండడంతో అర్హత సాధించలేని పరిస్థితి నెలకొంది. దీంతో పీహెచ్డీ అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేవు. కనీసం పార్ట్‌టైం పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించడంలోనూ తాత్సారం చేస్తుండడంతో పరిశోధన పడకేసిందనే వాదన వినిపిస్తోంది. -
గవర్నర్‌కు పీహెచ్డీ వివరాలు
శాతవాహనయూనివర్సిటీ (కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలోని పీహెచ్డీ కోర్సులకు సంబంధించిన వివరాలు నేడు గవర్నర్‌కు చేరనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనిర్సిటీలోని పీహెచ్డీ ప్రవేశాలు, కోర్సులతో పాటు పూర్తి సమాచారాన్ని ఉన్నత విద్యామండలి సేకరిస్తోంది. ఇటీవల గవర్నర్ నరసింహన్, విద్యాశాఖ మంత్రితో కలిసి పాల్గొన్న ఓ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డిని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన పీహెచ్డీ ప్రవేశాలు, పట్టాలు, కోర్సులు, అభ్యర్థుల సంఖ్యతో పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 20లోపు సంబంధిత సమాచారాన్ని అందించాలని అన్ని వర్సిటీలకు లేఖలు రాసారు. నేడు పీహెచ్డీ వివరాలను శాతవాహన యూనివర్సిటీ అధికారులు ఉన్నత విద్యామండలికి పంపించనున్నారు. గతంలో ప్రవేశాలు, కొనసాగుతున్న పరిశోధనల వివరాలు, అభ్యర్థుల సంఖ్య, ఇటీవల పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇచ్చిన నోటిఫికేషన్‌తో సమగ్ర వివరాలు అందించనున్నారు. పీహెచ్డీ స్థాయిని దిగజార్చొద్దని.. డాక్టర్ ఆఫ్ ఫిలాసపీ(పీహెచ్డీ) సాధారణ డిగ్రీ కాదు. భవిష్యత్తరాలకు ఉపయోగపడే ఓ పరిశోధన. దీని స్థాయిని దిగజార్చవద్దని, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా ప్రవేశాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న విషయాన్ని గవర్నర్ నరసింహన్ తీవ్రంగా పరిగణించారు. దీంతో ఇటీవల ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో జరిగిన ఒక సమావేశంలో ఇప్పటి వరకు ఏఏ యూనివర్సిటీ ఎన్నెన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేసింది..? ప్రస్తుతం ఏఏ యూనివర్సిటీలలో ఏఏ విభాగాల్లో ఎంతమంది పీహెచ్డీ చేస్తున్నారు. ఎన్నేళ్లుగా చేస్తున్నారు..? అనే సమగ్ర వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని గవర్నర్ సూచించారు. ఆరు విభాగాల్లో పీహెచ్డీ.. శాతవాహనయూనివర్సిటీలో 2015– 16 సంవత్సరంలో పీహెచ్డీ కోర్సు ప్రారంభమైంది. ఉర్దూ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సోషియాలజీ, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో కలుపుకుని 14 మంది నమోదవగా.. దాదాపు 11మందే కోర్సును కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ విద్యా సంవత్సరం కూడా పీహెచ్డీ నోటిఫికేషన్‌ను శాతవాహనయూనివర్సిటీ నెలక్రితమే ప్రకటించింది. దరఖాస్తులకు ఈ నెల 14తేదీ వరకు అనుమతించింది. సెట్‌తో పాటు వివిధ పరీక్షల ఫలితాలు వెలువడే వరకు గడువును పొడగించాలని వివిధ విద్యార్థి సంఘాలు, పీహెచ్డీ అభ్యర్థులు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్ళారు. ఇటీవల మళ్ళీ దరఖాస్తుల గడువును ఈ నెల 30 తేదీ వరకు పొడగిస్తూ ప్రకటన వెలువరించారు. ఐదేళ్లు దాటిన వారి ప్రవేశాలు రద్దు... నాలుగైదేళ్లకు మించి పీహెచ్‌డీకి సమయం ఇవ్వకూడదని ఉన్నతవిద్యామండలి నిబంధనలు విధించనుంది. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం అమలు చేసేందుకే శాతవాహనతో పాటు వివిధ యూనివర్సిటీల నుండి సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నారు. ఐదేళ్ళు దాటినవారి ప్రవేశాలు రద్దు చేయాలని , అలాంటి వారు ఎందరున్నారో తేల్చాలని వైస్ ఛాన్సిలర్లకు ఆదేశాలు అందాయి. పీహెచ్డీ ప్రవేశాలను నట్,స్లెట్ ప్రతిభ ఆధారంగా చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ఇటీవల స్పష్టం చేశారు. పీహెచ్డీ ప్రవేశాల్లో ఒక్కో యూనివర్సిటీ ఒక్కో తీరును ప్రదర్శిస్తోంది. అన్ని ఒకే రకమైన నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే త్వరలోనే శాతవాహన పీహెచ్డీ ప్రవేశాలు కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని యూనివర్సిటీల నిబంధనల ప్రకారమే సాగనున్నాయి. పీహెచ్డీ వివరాలపై రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డిని సంప్రదించగా ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం వారు కోరిన సమాచారాన్ని సోమవారం పంపుతున్నట్లు వివరించారు. -
నిలిచిపోయిన ఓయూ పీహెచ్డీ ప్రవేశాలు
హైదరాబాద్: ఓయూ పీహెచ్డీ ప్రవేశాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వాస్తవానికి జూలై 30న పీహెచ్‌డీలో సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితా విడుదల కావాల్సి ఉంది. కానీ అధ్యాపకుల కొరత వల్ల పెరిగిన విద్యార్థుల సంఖ్యను బట్టి పర్యవేక్షకులు లేకపోవడంతో ప్రవేశాలు పొందిన విద్యార్థుల జాబితాను నిలిపివేశారు. కొన్ని విభాగాల్లో ఒకటి, రెండు సీట్లు ఉండగా అర్థశాస్త్రం విభాగంలో ఒక్క గైడ్ కూడా లేకపోవడంతో ఆయా విభాగాల అధిపతులు పర్యవేక్షకుల వేటలో పడ్డారు. రిటైర్డ్ ప్రొఫెసర్లకు గైడ్షిప్ ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో విభాగాల అధిపతులు విశ్రాంత అధ్యాపకులను ఆహ్వానిస్తున్నారు. అయితే చాలా మంది రిటైర్డ్ అధ్యాపకులు ఓయూలో గైడ్షిప్ను తిరస్కరిస్తున్నారు. అన్ని అర్హతలు గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు కూడా గైడ్షిప్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీంతో విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నేతలు వీసీ, రిజిస్ట్రార్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సీట్లు సరిపడా ఉన్న విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాల జాబితా విడుదల చేయా లని విద్యార్థులు కోరుతున్నారు. అయితే ఒకేసారి ప్రకటన వెలువడినందున, జాబితాను కూడా ఒకే సారి విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. -
పీహెచ్‘డీ’లా
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలు డీలా పడుతున్నాయి. అడ్మిషన్ పొందిన వారిలో సగం మంది కూడా సకాలంలో పరిశోధన పత్రాలు సమర్పించడం లేదు. ప్రత్యక్షంగా వర్సిటీకి చెడ్డపేరు తేవడంతో పాటు పరోక్షంగా ఇది వివిధ ఫెలోషిప్‌లపై ప్రభావం చూçపుతోంది. అడ్మిషన్ పొందుతున్న ప్రతి పది మందిలో ఒకరిద్దరు మాత్రమే నిర్దేశిత గడువులోగా థీసిస్ సమర్పిస్తుండగా, 80 శాతం మంది గడువు ముగిసిన తర్వాతే అందజేస్తున్నారు. పరోక్షంగా ఇది వర్సిటీకి చెడ్డ పేరు తీసుకురావడంతో పాటు పరిశోధనలు, ఫెలోషిప్‌లపై తీవ్రప్రభావం చూపుతోంది. సాక్షి, హైదరాబాద్ : పీహెచ్డీ చేయడం ఒకప్పుడు చాలా గొప్పగా భావించేవారు. వీరికి దేశవిదేశాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ ప్రస్తుతం అభ్యర్థుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. కేవలం ఫెలోషిప్‌లు సహా హాస్టల్ వసతి కోసమే పీహెచ్డీ అడ్మిషన్ అన్నట్లుగా తయారైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అడ్మిషన్ పొందిన వారిలో సగం మందికి కూడా పరిశోధన పత్రాలు సమర్పించడం లేదు. మరికొంత మంది ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన పీహెచ్డీ కోర్సును ఏడెనిమిదేళ్ల వరకు పొడిగించుకుంటున్నారు. పీహెచ్డీ అడ్మిషన్ దొరికితే చాలు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు హాస్టల్లో ఉచితంగా వసతి పొందడంతో పాటు ప్రైవేటుగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చని భావిస్తుంటారు చాలా మంది. అందుకే ఏ కోర్సుకు లేనంత డిమాండ్ పీహెచ్‌డీకి ఉంది. నోటిఫికేషన్ జారీ మొదలు ప్రవేశాల ముగింపు వరకు ఎన్నో ఆరోపణలు.. పోరాటాలు... తీరా సీటు లభిస్తే కనీసం 30 శాతం మంది కూడా ఇచ్చిన గడువులోపు పరిశోధన పత్రాలు పూర్తి చేయడం లేదు. పీహెచ్‌డీలో చేరిన ఒక్కో సైన్స్ విద్యార్థికి నెలకు రూ. లక్షకుపైనే ఖర్చు అవుతోంది. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్లో ప్రతిభ చూపిన వారికి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్)కింద ఉపకారవేతనం అందిస్తుంది. పీజీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్‌లు అందిస్తుంది. గతంలో ఓయూకి ఏటా 60–70 రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌లు వస్తే ప్రస్తుతం 30–40కి మించడం లేదు. పీహెచ్డీ అడ్మిషన్ పొందిన వారిలో చాలా మంది మధ్యలో మానేస్తుండటం, సకాలంలో పరిశోధనలు పూర్తి చేసి ధీసిస్ సమర్పించక పోవడం వల్లే ఈ ఫెలోషిప్‌ల కుదింపుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రీ పీహెచ్‌డీలో 30 శాతం మంది పీహెచ్డీ ప్రవేశాల తర్వాత ఏడాది లోపు ప్రీపీహెచ్‌డీ పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో రెండు సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో 50 శాతం మార్కులు రావాలి. అభ్య ర్థిలో పరిశోధనాంశంపై ఏ మేరకు అవగాహాన పెరిగిందో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. అయితే ప్రీపీహెచ్‌డీ పరీక్షలో 30 శాతం మంది తప్పుతున్నట్లు విమర్శలు లేకపోలేదు. గతంలో రెగ్యులర్ పీహెచ్డీ కోర్సు మూడేళ్లు, పార్ట్‌టైమ్ కోర్సు నాలుగేళ్లు ఉండేది. ఆ తర్వాత మూడేళ్ల కోర్సును నాలుగేళ్లకు, నాలుగేళ్ల కోర్సును ఐదేళ్లకు పెంచారు. పీహెచ్డీ అడ్మిషన్ పొంది నిర్ధేశిత గడువులో పరిశోధన పత్రాలు సమర్పించిన వారు 40 శాతం మించలేదు. అధిక శాతం 6– 10 ఏళ్ల లోపు పూర్తి చేస్తున్నవారే. పీహెచ్‌డీలో చేరిన ఆర్ట్స్, సైన్స్ కోర్సు విద్యార్థుల్లో 50 శాతం మంది మధ్యలోనే మానేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది పీహెచ్డీ కోర్సుల్లో రిజిస్టరైన వారు ఫ్యాకల్టీ రిజిస్టరైన పేరు అభ్యర్థులు ఆర్ట్స్ 564 కామర్స్ 218 ఎడ్యుకేషన్ 76 ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 142 లా 2 మేనేజ్మెంట్ 367 ఓరియంటల్ లాంగ్వేజ్ 5 సైన్స్ 1191 సోషల్ సైన్స్ 443 ఫార్మసీ 31 గత విద్యా సంవత్సరం పూర్తి అయినవి సైన్స్ 181 ఇంజనీరింగ్ 48 ఇతరులు 137 -
రాద్ధాంత మెందుకో!
తెయూ(డిచ్పల్లి)/నిజామాబాద్‌అర్బన్ : తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన పీహెచ్డీ అడ్మిషన్లలో అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులకు సీట్లు కేటాయించారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తెలుగు, బిజినెస్ మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్ విభాగాల్లో పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కొందరు అభ్యర్థులు ఉన్నత విద్యా మండలికి, అప్పటి తెయూ ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్‌కు ఫిర్యాదులు చేశారు. స్పందించిన ఇన్చార్జి వీసీ ఓయూ కెమిస్ట్రీ డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో ఏక సభ్య కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. మంగళవారం కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు తెయూను సందర్శించి ఇన్చార్జి రిజిస్ట్రార్ చాంబర్లో పీహెచ్డీ అ డ్మిషన్లపై విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల వాదనలు నమోదు చేశారు. అయితే కొందరు విద్యార్థి నాయకులు విచారణ కమిటీనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అందోళకు దిగడంపై విచారణ కమిటీ సభ్యుడు విస్మయం వ్యక్తం చేశారు. ఏవైనా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ కమిటీ వేసి నిజానిజాలు తెలుసుకోవడం అన్ని వర్సిటీల్లో జరిగే ప్రక్రియేనని వర్సిటీ విద్యార్థులు పేర్కొం టున్నారు. మద్దతు తెలపలేక విచారణలో వాస్తవాలు వెలికి తీసి బాధితులకు న్యాయం చేయాలని మద్దతు తెలుపాల్సిన విద్యార్థి సంఘాల నాయకులే ఏకంగా కమిటీనే రద్దు చేయాలని డిమాండ్ చేయడమేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విచారణను అడ్డుకోవడం, ధర్నాలు చేయడం సమంజసంగా లేదని విమర్శిస్తున్నారు. అసలు విచారణ అంటే ఎందుకు అందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విచారణ కమిటీని రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి నాయకులు బుధవారం వర్సిటీ కళాశాల తరగతులు బహిష్కరించడాన్ని వ్యతిరేకించారు. అయినా విద్యార్థి నా యకుల మాటను కాదనలేక ఇష్టం లేకున్నా వర్సిటీ బంద్‌కు సహకరించాల్సి వచ్చిందని కొందరు విద్యార్థులు వాపోయారు. వారికి ఇబ్బందులనే పీహెచ్డీ ప్రవేశాలలో అక్రమాలపై విచారణ జరిగితే విద్యార్థి సంఘాల నాయకులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ జరిగితే కొందరు అనర్హులు ప్రవేశం కోల్పోతామని భావిస్తున్నారు. పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి మొదటి లిస్టులో నలుగురు విద్యార్థి సంఘాల నాయకులు ఎంపిక కాలేదు. వారి ఎ ంపిక కోసం కళాశాల అధికారులు సైతం రిజర్వేషన్ కేటగిరిలో మార్పులు చేశారు. ఓపెన్ కేటగిరిలో 45 మార్కులకుగాను 40 మార్కులు, బీసీలకు 40 మార్కులకుగాను 30 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 35 మార్కులకుగాను 30 మార్కులు తగ్గిస్తు నిబంధనలు చేశారు. దీంతో ఎంపిక కాని విద్యార్థి సంఘం నాయకులు ఎంపికయ్యారు. అర్హత కలిగిన మెరిట్ స్టూడెంట్లకు ఈ మార్పులకు సంబంధించి కనీస సమాచారం అందించలేదు. ఫోన్ చేస్తేనే యూనివర్శిటీకి రావాలని, సీటు వచ్చినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఓ విద్యార్థి సంఘం నాయకుడికి కేవలం 30 మార్కులే రాగా ప్రవేశానికి అనర్హుడయ్యాడు. కానీ, మార్పులు చేయడంతో సీటు లభిం చింది. హైదరాబాద్‌కు చెందిన మహిళ విద్యార్థి నాయకురాలికి పీహెచ్డీ ప్రవేశానికి అర్హత ఉన్నప్పటి కీ సీటు లభించలేదు. దీంతో ఆమె ఉస్మానియా యూ నివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది యూ నివర్శిటీ అధికారులకు తెలిసి సీటు ఇస్తామంటూ యూనివర్శిటీకి పిలిపించారు. నెల రోజులు గడిచినా సీటు మాత్రం ఇవ్వలేదు. యూనివర్శిటీ అధి కారులను నిలదీస్తే ఇటీవలే ప్రవేశం కల్పించారు. ఫీజులు కూడా చెల్లించలేదు యూనివర్శిటీ నిబంధనల ప్రకారం ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి రూ. 16 వేల రూపాయలు ఫీజును వసూలు చేయాలి. పీహెచ్‌డీకి రూ. 15 వేలు, అడ్మిషన్ ఫీజు వెయ్యి రూపాయలు ఉంటుంది. కాని ఎం పికైన కొందరు విద్యార్థి సంఘాల నాయకులు కేవ లం వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించారు. వీరి నుంచి ఫీజులు కూడా వసూలు చేయలేకపోయారు. అదే ఎంబీఏ, మాస్ కమ్యూనికేషన్, తెలుగు విభాగా ల్లో ఇతర విద్యార్థుల నుంచి మాత్రం పూర్తి స్థాయి ఫీజులను వసూలు చేశారు. తెలుగు పీహెచ్డీ ప్రవేశాలపై విద్యార్థుల ఆందోళన వెనుక అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. విచారణలో అనర్హులకు అడ్మిషన్ల విషయం బట్టబయలు అవుతుందని, తమపై వేటు పడే అవకాశం ఉందని భావించిన కొందరు అధికారులు విద్యార్థి సంఘం నాయకులను ఉసిగొలిపి మీ ప్రవేశాలు రద్దు అవుతాయని, విచారణను అడ్డుకోవాలని ప్రేరేపించినట్లు సమాచారం. దీంతో విచారణ కమిటీని అడ్డుకోవడం, తెలంగాణ యూనివర్శిటీకి బంద్ పిలుపునిచ్చారని తెలుస్తోంది. -
‘పీహెచ్డీ’ వివాదాలపై విచారణ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం పీ హెచ్డీ కోర్సుల ప్రవేశాలలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదులపై ఏకసభ్య కమిటీ మంగళవా రం విచారణ జరిపింది. తెయూ గత ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్ తనకు అందిన ఫిర్యాదుల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఏకసభ్య విచారణ కమిటీగా నియమించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ఆర్ట్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ ధర్మరాజుతో కలిసి నాగేశ్వరరావు విచారణ నిర్వహించారు. ఆయన రాకను తెలుసుకున్న పీహెచ్డీ ప్రవేశాలు పొందిన అభ్యర్థులు రిజిస్ట్రార్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. తమకు మెరిట్ వచ్చినా అడ్మిషన్ ఇవ్వకుం డా అక్రమాలకు పాల్పడ్డారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు అల్లాడి రమేశ్, వి.గాయత్రితోపాటు టీఆర్ఎస్వీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ధాత్రిక స్వప్న విచారణ కమిటీ సభ్యుడికి వినతి పత్రం అందజేశారు. కొందరు విద్యార్థి సంఘాల నాయకులకు పీహెచ్‌డీలో అడ్మిషన్లు ఇవ్వడానికి కటాప్ మార్కులు తగ్గిం చారని, అనర్హులకు అడ్మిషన్లు ఇచ్చి, అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న అడ్మిషన్ పొందిన పీహెచ్డీ స్కాలర్స్, బాధితులతో వాగ్వివాదా నికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న డిచ్పల్లి పోలీసులు వెంటనే వర్సిటీకి చేరుకుని అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చే పట్టారు. మూడు నెలల నుంచి తెలుగు హెచ్‌వోడీ, డీన్ల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్డీ సీట్లను డబ్బులు తీసుకుని అనర్హులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇంటర్వూ కమిటీ, నిపుణుల సం తకంతో కూడిన మెరిట్ జాబితాను ప్రకటించలేదన్నారు. మెరిట్ జాబితాను ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. ఇంట ర్వూ కమిటీ సభ్యులు, నిపుణులు ఎంపిక చేసిన జాబితాను మార్చి తమకు అనుకూలంగా ఉన్న వారికి అక్రమంగా అడ్మిషన్లు ఇచ్చారని ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. విచారణ కమిటీని రద్దు చేయాలి తెయూ పీహెచ్డీ అడ్మిషన్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తెలుగు విభాగంలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై నియమించిన ఏకసభ్య కమిటీని వెంటనే రద్దు చేయాలని అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ చాంబర్లో బైఠాయించి నిరసన తెలి పారు. కొందరు అధ్యాపకులు తెలంగాణ యూనివర్సిటీ పరువు తీయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మెరిట్ జాబితాను పరిశీలించి న్యాయం చేస్తాం.. ఎంపిక కమిటీ, సబ్టెక్టు నిపుణులు ఇంటర్వ్యూలు నిర్వహించి విడుదల చేసిన జాబితాను పరిశీలిస్తామని విచార ణ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ నా గేశ్వరరావు విలేకరులకు తెలిపారు. సబ్జెక్టు నిపుణుడిగా ప్రొఫెసర్ చెన్నప్ప వ్యవహరించారని, తనకు బాధితులు అందజేసిన జాబితాపై ఆయన సం తకం లేదన్నారు. వర్సిటీ అధికారుల వద్ద అసలైన మెరిట్ జాబితా తీసుకుని రెండింటినీ పరిశీలించి అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయా లేదో తేలుస్తానన్నారు. అడ్మిషన్లలో అర్హులకు అన్యాయం జరిగినట్లు తేలితే న్యా యం జరిగేలా చూస్తానని, అనర్హులకు అడ్మిషన్లు ఇచ్చినట్లు తేలితే చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని ఆయన స్పష్టం చేశారు. -
అనర్హులకు అందలం
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ యూనివర్సిటీలోని తెలుగు పీహెచ్డీ ప్రవేశాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కనీస నిబంధనలు పాటిం చకుండా ఇష్టారీతిన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని అంటున్నారు. అర్హులైన విద్యార్థులు మూడు నెలలుగా యూనివర్సిటీ చుట్టు తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత ఆగస్టు నెలలో పీహెచ్డీ ప్రవేశాలు జరిగాయి. 26 సీట్లకుగాను 86 మంది ఇంటర్వ్యూలకు హాజ రయ్యారు. ఇందులో నెట్‌సెట్ రాసిన వారు ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో ముగ్గురికి మాత్రమే ప్రవేశం కల్పించి మిగితావారికి మొండిచేయి చూపించారు. పీహెచ్ డీ ప్రవేశాలకు అర్హత సాధించని విద్యార్థి సంఘం నాయకులకు ప్రవేశం కల్పించారు. ఏం జరిగింది? పీహెచ్డీ ప్రవేశాల జాబితా వెల్లడి ఆగానే అందులో అక్రమాలు జరిగాయంటూ, అర్హత సాధించని నలుగురు విద్యార్థి సంఘం నాయకులు మూడు రోజులపాటు ఆం దోళన చేశారు. తమకు కూడా ప్రవేశాలు కల్పించాలని పట్టుబట్టారు. అధికారులను మాయచేసి ప్రవేశాల నివేదికను రెండవసారి రూపొందింపజేశారు. విద్యార్థి సంఘం నాయకులు నలుగురు అర్హత సాధించినట్లు యూనివర్సిటీ అధికారులు రెండవ జాబితాను పెట్టారు. దీంతో, అంతకు ముందు అర్హత సాధించిన స్వప్న, గాయత్రి అనే ఇద్దరు విద్యార్థినులు అనర్హులుగా మారిపోయారు. నిబంధనల ప్రకారం ముగ్గురు సభ్యుల బృందం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయాలి. ఇందులోనూ అనర్హు లకే అవకాశం లభించింది. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని యూనివర్సిటీ అధికారులతో తీవ్ర వాగ్వివాదానికి దిగడంతో అధికారులు ఆమెకు ప్రవేశం కల్పించారు. ఇందులో విద్యార్థి సంఘాల నాయకులే కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. 40 సంవత్సరాలు దాటినా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఓ నా యకుడికి సైతం పీహెచ్డీ సీటు లభించడం గమనార్హం. ప్రవేశాలకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన లిస్టును టీయూ అధికారులు గల్లంతు చేసినట్లు తెలిసింది. బోర్డు అధికారులు ఏం చేసినట్లు! పీహెచ్డీ ప్రవేశాల కోసం ముగ్గురు సభ్యుల బృందం ఉంటుంది. ఇందులో వర్సిటీ ప్రిన్సిపాల్, సీనియర్ తెలుగు లెక్చరర్, మరో అధికారి ఉంటారు. వీరు పీహెచ్డీ ప్రవేశం కోరే అభ్యర్థుల నెట్‌సెట్ ఉత్తీర్ణత, సంబంధిత సబ్జెక్టులలో అనుభవం, ఇంటర్వ్యూలో మార్కుల విధానం, సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంటుంది. అన్నీ సక్ర ంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే జాబితాను వెల్లడించాలి. కానీ, ఈ బృందం కూడా ఉన్నతాధికారుల ఒత్తిడికి తలొగ్గినట్లు తెలిసింది. ఈ ఇంటర్వ్యూకు వచ్చిన ఓ విద్యార్థి ‘‘నేను అర్హురాలిని నాకు ఎందుకు ప్రవేశం కల్పించలేదని’’ ప్రశ్నించగా, ‘‘ఒక్కొక్కరికి పది వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మీరు భరించగలరా’’ అ ని ఓ అధికారి ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. తమ తప్పులు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూనే, ప్రవేశాలపై ప్రశ్నించిన అధికారులు, విద్యార్థులను విద్యార్థి సంఘం నాయకులతో బెదిరించారని ఓ విద్యార్థి వాపోయాడు. ఈ వ్యవహారమంతటిపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. -
స్టాండింగ్ కమిటీ సమావేశం నిరవధిక వాయిదా
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరగాల్సి ఉండగా నిరవధికంగా వాయిదా వేశారు. కేయూ ఇన్చార్జ వీసీగా ఉన్న ప్రొఫెసర్ కె.వీరారెడ్డి రాజీనామా చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా పడడం ఇది నాలుగో సారి గమనార్హం. ప్రతీసారి తేదీ ప్రకటించడం, ఏదో కారణంతో వాయిదా వేయడం పరిపాటిగా మారింది. అయితే, ఈసారి ఎప్పుడు సమావేశం నిర్వహించే విషయాన్ని కూడా కేయూ ఇన్చార్జ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు వెల్లడించకపోతుండడం గమనార్హం. పీహెచ్డీ ప్రవేశాలు ఎప్పుడు? యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలంటే వీరారెడ్డి స్థానంలో మరొకరిని ఇన్చార్జ వీసీగా నియమించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ స్టాండింగ్ కమిటీలోని ఎజెండాను వీసీ దృష్టికి తీసుకువెళ్లి ఆమోదించాక తేదీ నిర్ణయించాల్సి ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇక కేయూ పరిధిలోని పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలో ఆమోదించాల్సి ఉంది. అయితే, తాజాగా కూడా సమావేశం వాయిదా పడడంతో రెండున్నరేళ్లుగా ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివిధ విద్యార్థి సంఘాలు వీసీ చాంబర్లో ఆందోళనకు దిగితే బుధవారం నాటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో తేదీ ప్రకటిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇన్చార్జ వీసీ రాజీనామాతో సమావేశం వాయిదా పడడంతో పీహెచ్డీ ప్రవేశాల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటివి ఇంకా కొన్ని సమస్యలు కూడా అలాగే మిగిలిపోనున్నాయి.